(ప్రొఫెసర్ హరగోపాల్ సార్ వివిద పత్రికలల్లో రాసిన వ్యాసాలు అందుబాటులో ఉన్న మేరకు ఇక్కడ ఇస్తున్నాం. ఈ వ్యాసాలు, ఆయన అనుభవాలు ఈ తరం వారికి ఉపయోగపడతాయని అశీస్తూ...మీ డేవిడ్)
Sunday, October 28, 2012
వైవిధ్యం సరే, వైరుధ్యాల సంగతేమిటి? (18-10-2012)
హైదరాబాద్‌లో రెండు వారాలుగా అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు జరుగుతున్నది. మాబోటి వాళ్లకు వెళ్ళాలని కూడా అనిపించలేదు. ఈ సదస్సు కు హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సీసీఎంబీని ఆహ్వానించలేదు. దేశం గర్వించే శాస్త్రవేత్త పీఎం భార్గవను కూడా పిలవలేదు. ఇది చాలు సద స్సు దశ, దిశను తెలుసుకోవడానికి. మూడు, నాలుగు దశాబ్దాలుగా అంతర్జాతీయ సదస్సులు చర్చించే అంశాలు, చర్చిస్తామని చెప్పే అంశాలు, చెప్పి, చర్చించే అంశాలకు వాస్తవంలో ఈ సదస్సుల వెనక ఉండే ఆర్థికశక్తుల ఆచరణకు ఏం సంబంధం ఉండదు. నిజానికి ఆచరణ దిగజారి ప్రపంచం విధ్వంసానికి గురవుతున్నప్పుడు, సామాన్య ప్రజలు, మధ్య తరగతి తమ అనుభవాన్ని అవగాహన చేసుకుంటున్న సందర్భంలో మన మనసులోని మాటలను ఈ సదస్సులే చర్చిస్తాయి. దాంతో వ్యవస్థ మీద కొత్త ఆశలను కొత్త విశ్వాసాలను కలిగిస్తాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మూడవ ప్రపంచం అనబడే దేశాలలో అప్పుడే స్వాతంత్య్ర ఆకాంక్ష మొలకెత్తుతున్న రోజుల్లో అంతర్జాతీయ మానవ హక్కుల రూపకల్పన జరిగింది. ఇక రాబోయే ప్రపంచం మానవహక్కుల పునాది మీద నిలబడి రాజ్యం ప్రజలకు బాధ్యత వహించి స్వేచ్ఛాయుత ప్రపంచ నిర్మాణం జరుగుతుందన్న ఆశను కల్పించారు. ఆరు దశాబ్దాల తర్వాత మానవ హక్కుల స్థానంలో ‘టెపూరరిజం’ చర్చకు వచ్చి దాన్ని ఎదుర్కొనడానికి రాజ్యమే ఒక టెర్రరిస్టుగా మారింది. ఈ దుమారంలో మానవహక్కుల ప్రమాణాలు ఎక్కడ కొట్టుకుపోయాయో తెలియదు. ఈ విధ్వంసం అగ్రభాగాన అమెరికా ఉంది.
1960వ దశాబ్ద చివరిలో ప్రపంచ వ్యాప్తంగా నిరసన జ్వాలలు పెరిగి, యువత కొత్త ప్రత్యామ్నాయాలు వెతుకుతున్న తరుణంలో 1967లో టెహ్రాన్‌లో అంతర్జాతీయ మాన వ హక్కు ల సదస్సు జరిగింది. ఆ సదస్సులో ప్రధానంగా యువత పాత్ర మీద, అలాగే కూలిపోతున్న కుటుంబ వ్యవస్థ మీద పెద్ద చర్చ జరిగింది. మళ్లీ 1990లో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత, కమ్యూనిజం వైఫల్యం చెందడానికి కారణాలను వెతుకుతూ వ్యక్తి స్వేచ్ఛను, మానవ హక్కులను గౌరవించకపోవడం వల్లేనని తేల్చేందుకు 1993లో వియన్నా లో రెండవ అంతర్జాతీయ మానవ హక్కుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో పెట్టుబడిదారీ దేశాల్లో ప్రజ లు స్వేచ్ఛగా జీవిస్తున్నారని, రాజ్యం కేంద్రంగా జరిగే అభివృద్ధి నియంతృత్వానికి దారి తీస్తుందని, రాజ్యానికి ప్రత్యామ్నాయం మార్కె అంటూ, మరి సంక్షేమం మాటేమిటి అంటే వాటిని ఎన్జీవోలకు అప్పజెప్పాలనే దిశగా చర్చలు జరిగాయి. బహుశా అంతకు ముందు ఎన్నడూలేని విధంగా ఈ సదస్సులో ఎన్జీవోలకు భాగస్వామ్యం కల్పించారు. అలాగే మహిళల సాధికారత మీద, ఆదివాసీల హక్కుల మీద, జాతి వివక్ష మీద అంతర్జాతీయ సదస్సులు జరిగాయి. నిజానికి గత అరవై ఏళ్లలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో మానవ హక్కులకు సంబంధించి దాదా పు వంద ఒప్పందాలు, ప్రకటనలు చేయడమే కాక, కొత్త ప్రమాణాలు నిర్ధారించబడ్డాయి. అంతిమంగా ఈ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఐక్యరాజ్య సమితిని నిర్వీర్యం చేసి, దానిమాట వినే నాథులే లేకుండా చేశారు.
పర్యావరణం మీద కూడా చాలా సదస్సులే జరిగా యి. అందులో 1990లలో ఈఅంశం మీద చాలా పెద్ద చర్చే జరిగింది. అప్పుడే ఎజెండా 21 అని 21వ శతాబ్దపు అజెండా ఒకదాన్ని అంగీకరించారు. ఈ సదస్సు నయా ఆర్థిక విధానం విస్తరణ క్రమంలో జరిగింది. పర్యావరణాన్ని విధ్వంసం చేసే ప్రక్రియను పెంచి, అది పెంచుతున్న వాళ్లే సదస్సుకు కావలసిన వనరులను కూర్చి, చర్చలను ప్రోత్సహిస్తుంటారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సద స్సు, ప్రపంచ ‘వాతావరణం’ మారి మానవ మనుగడే ప్రమాదం అని ఒకవైపు అంటూ ఉంటే, అమెరికా, కొన్ని యూరప్ దేశాలు తమ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి అణు రియాక్టర్లను అమ్ముతున్నారు. ఒకవైపు అణువిద్యుత్ ఉత్పత్తికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతుంటే, హైదరాబాద్‌లో జీవవైవిధ్య సదస్సు జరగడం ఎంత విచిత్రం!
ఈ సదస్సుకు ఎవరిని పిలిచారో, ఏం చర్చిస్తున్నారో మీడియా పూర్తిగా బయట కు తీసుకరావడం లేదు. ‘హిందూ’ లాంటి పత్రికలు షర్మిలా పాదయావూతను పతాక శీర్షికగా వేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పర్యావరణం మీద తీవ్రమైన చర్చ జరపవలసిన జాతీయ మీడియా, మమత బెనర్జీ మతిలేని మాటల మీద, అరవింద్ కేజ్రీవాల్ మీద, ప్రియాంక గాంధీ భర్త మీద ఎడతెగని చర్చలు జరుపుతున్నారు. నిజానికి ఈ మూడు వారాలు అభివృద్ధి నమూనా మీద, నయా పెట్టుబడిదారీ వ్యవ స్థ మీద, పెట్టుబడిదార్ల అత్యాశ మీద, పెరుగుతున్న వస్తు వ్యామోహం మీద, భవిష్యత్ తరాల పట్ల బాధ్యత మీద జరగవలిసి ఉండే. కానీ ఈ పెడ ధోరణుల వెనక ఉండే శక్తుల చేతిలోనే మీడియా ఉంది.
హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సదస్సు ఈ ప్రాంతంలో నడుస్తున్న ఒక మహత్తర పోరాట కాలంలో జరుగుతున్నది. ఆ పోరాటంలో భాగమైన తెలంగాణ జర్నలిస్టులను ప్రధానమంత్రి ప్రసంగానికి రానివ్వలేదు. నిర్వాహకులకు ప్రజల పట్ల బాధ్యత ఉన్నా లేదా జీవరాసుల మీద ప్రేమ ఉన్నా, ఒక అర్ధ శతాబ్దం కింద హైదరాబాద్ నగరం ఎలా ఉండేదో, ఎన్ని చెరువులు, ఎన్ని పక్షులు, ఎన్ని పాములు, ఎన్ని పురుగులు, ఎన్నిపూలు, ఎన్ని పార్కులు ఉండేవో చూపించి, తర్వాత ఇప్పటి బోసిపోయిన హైదరాబాద్‌ను,దాని కేంద్రంగా నడుస్తున్న ఒక ప్రాంతీయ ఉద్యమా న్ని, అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్న గిరిజన, బలహీనవర్గాల ఉద్యమాన్ని, రైతుల ఆత్మహత్యలను మొత్తంగా చర్చిస్తే ప్రపంచం, పర్యావరణం, దాని విధ్వంసం ఎలా జరిగిందో కళ్లకు కట్టినట్టుగా, బుద్ధుడికి జ్ఞానోదయమైనట్టుగా ఉండేది. కార్యకారణాలు తెలిశాయి. బుద్ధుడు కూడా మానవుడి వేదనకు కారణం పెరుగుతున్న కోరికలే అని 2500 సంవత్సరాల కిందట విశ్లేషించాడు.
ఈ నగరంలో ఉండే అందమైన, అద్భుతమైన గుట్టలు, గుట్టల మీద మనుషుల్లో లేదా ఎవరో అర్కిటెక్ట్ అమర్చినట్టు తోచే రాతి వరసలు ఏమయ్యాయి? అబ్దుల్ కలాం తన ఆత్మకథలో హైదరాబాద్ (బిల్డర్స్)రాళ్ల నిర్మాణం మీద ఉండే తన మమకారాన్ని గురించి రాసుకున్నాడు. బంజారా,జూబ్లీహిల్స్‌ను ఎవరు ఆక్రమించుకున్నారు? లగడపాటి, కావూరి, నార్నెల పేర్లు ఈ గుట్టలకు ఎవరు పెట్టారు? గుట్టలు గుట్టలే వ్యక్తుల సొంత ఆస్తి కావడమేమిటి? అందమైన నౌబత్పహాడ్ మీద బిర్లాకు ఆధిపత్యం ఎలా వచ్చింది? మౌలికంగా ప్రశ్న అడగాలంటే ప్రకృతి ఎవరికి చెందిం దితైపకృతి మీద మనిషి ఆధిపత్యాన్నే ప్రశ్నిస్తున పర్యావరణ ఉద్యమాలుండగా, ప్రైవేట్ వ్యక్తులకు ప్రకృతి వనరుల మీద ఆధిపత్యమేమిటి అనే ప్రశ్న కూడా అడగా లి కదా? సదస్సు స్పృహలో ఈ ప్రశ్నలుండి ఉండవు. ఉండడానికి వాళ్లకంటూ ఒక ప్రాపంచిక దృక్పథం ఉండాలి కదా.
సదస్సు జరుగుతున్న స్థలానికి రాయివిసిరితే, లేదా కూతకూస్తే వినేంత దూరం లో విజయభాస్కర్‌డ్డి బొటానికల్ గార్డెన్ ఉంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న కాలంలోనే మేం చూస్తూ చూస్తూనే ఈ మొత్తం గార్డెన్‌ను రాజశేఖర్‌డ్డి ప్రభుత్వం ఒక ప్రైవేట్ వ్యక్తికి ‘ఇకో టూరి జం’ పేర నజరానా ఇచ్చింది. ఇక్కడ ఏడు నక్షవూతాల హోటల్ కడ్తారట. మా కళ్ల ముందే వందల చెట్లను నరికేశారు. ఈపార్కులో స్వేచ్ఛ గా తిరుగుతూ నాట్యం చేసే నెమళ్లు అనాథలయ్యాయి. అవి ఎక్కడికి పోవాలో తెలియక ఎత్తైన గోడలను దాటడం నేర్చుకున్నాయి. కొన్ని నెమళ్లు న్యాయాన్ని వెతుకుతూ హైటెక్ భవనం చేరుకున్నాయి. చివరికి పార్కులో ఉదయం నడక కోసం వెళ్తున్న వాళ్లంతా ఒక అసోసియేషన్ పెట్టుకుని, హైకోర్టుకు వెళితే, విధ్వంసం తాత్కాలికంగా ఆగింది. అలాగే అందమైన హుస్సేన్‌సాగర్ ఆక్రమణకు గురై అక్రమ కట్టడాలు వెలిశాయి. దీన్ని రక్షించాలని సుప్రీంకోర్టులో కేసు వేస్తే తాత్కాలికంగా స్టే వచ్చింది. ఈ నగరంలో జీవవైవిధ్య సదస్సు పెట్టి హైదరాబాద్‌కు జీవవైవిధ్యంలో పాస్ మార్కులు వచ్చాయని ముఖ్యమంత్రి, మేయర్ ఆనందపడిపోతున్నా రు. కానీ 90 మార్కులకు దాదాపు 90మార్కులు వచ్చే నగరం 30మార్కుల స్థాయికి దిగజారడానికి కన్నీళ్లు పెట్టుకోవాలి కదా?
నిజానికి జీవ వైవిధ్య సదస్సు చర్చించవలసిన తాత్విక, చారివూతక ప్రశ్నలు చాలా మౌలికమైనవి. ఒక టి; ప్రకృతికి మనిషికి ఉండే సంబంధమేమిటి? ప్రకృతి శక్తులతో మనిషి పోరాటం చేసిన మాట నిజమే. ప్రకృతిని పూజించే మనిషే, ప్రకృతి మీద కొన్ని విజయాలు సాధించిన మాట కూడా నిజమే. మనిషికి ప్రకృతికి గతంలో ఉండేది స్నేహపూరిత వైరుధ్యమే. దాన్ని శత్రుపూరిత వైరుధ్యంగా మార్చిన పెట్టుబడిదారుల ప్రయోజనాల నేపథ్యంలో జరిగే సదస్సు, ప్రకృతిని ఎలా ప్రేమించగలదు? ప్రకృతిని పూర్తిగా నాశనం చేసే దాకా ‘విక్షిశాంతి’ తీసుకునేట్టు లేదు. నిజానికి నిజాయితీ ఉంటే సదస్సు ఈ దోపిడీ వ్యవస్థ మీద యుద్ధమే ప్రకటించాలి.
ప్రకృతిలోని వైవిధ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని వైరుధ్యాలను పరిష్కరించడం అనివార్యం. దీంట్లో ప్రకృతి మనిషి మధ్య వైరుధ్యమే కాక, పెట్టుబడికి ప్రకృతికి, అలాగే సామ్రాజ్యవాద దురాశకు అడవికి (అడవిలోని వనరుల) మధ్య ఏర్పడిన వైరుధ్యాన్ని ఎదుర్కొవాలి. మన దేశంలో అట్టడుగున, అతి నిరాడంబరంగా బతుకుతున్న గిరిజనులు సహజ వనరులను, ప్రకృతి సంపదను, అడవిలోని జీవరాసుల సంరక్షణ కోసం పోరాడుతున్నారు. అలాగే ప్రజాస్వామ్యవాదులు ప్రకృతి విధ్వంసానికి కారణమయ్యే ప్రాజెక్టులకు, పరిక్షిశమలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
గంగానదిని కాపాడడానికి నిరంతరంగా ఓ పోరాటం జరుగుతుంది. మనదేశం, ముఖ్యంగా హిందూమతం చాలా విచివూతమైన మతం. ప్రతిదినం సాయంత్రం గంగానదికి పెద్ద ఎత్తున హారతి ఇస్తుంటారు. ఈ పూజించడం దశాబ్దాలుగా జరుగుతున్నది. కానీ సంగీతం, నాట్యం, ఆ దీపాల వెలుగులోనే నేను చిన్నతనంలో చూసిన స్వచ్ఛమైన గంగానది ఒక డ్రైనేజీ కాలువగా మారిపోయింది. కలుషితమైన నీళ్లను కూడా పూజిస్తూనే ఉన్నారు. హారతి పడుతూనే ఉన్నారు. ఇది వైవిధ్యమా? లేక వైరుధ్యమా? సదస్సు ఈ ప్రశ్నకు జవాబు వెతకడం లేదు. పరిష్కారానికి మార్గం అసలే వెయ్యడం లేదు. అయినా ఇలాంటి సదస్సులు ఒక భ్రమాజనిత విశ్వాసాన్ని కలిగించడానికి ‘ప్రకృతి విధ్వంసకారులు’ వీటికి ఆతిథ్యం కల్పించి ఆనందపడుతూనే ఉంటారు. విధ్వంసాన్ని ప్రశ్నించనంత కాలం ప్రశ్నలకు సమాధానాలు లేని ఇలాంటి సదస్సులు జరుగుతూనే ఉంటాయి.
పాలమూరు మీనాంబరం వాగు ఏమైంది? (11-10-2012)
మహబూబ్‌నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు తెలంగాణ డిమాండ్‌తో ఢిల్లీ వెళ్లారని విని నా బోటి వాడికి చాలా ఆశ్యర్యమేసింది. ఇంత పెద్ద ప్రజాఉద్యమం జరుగుతున్నప్పుడు, సెప్టెంబర్30న ప్రజా సమూహాన్ని చూసిన తర్వాత, తెలంగాణ ప్రజా వూపతినిధులంతా తమ పార్టీ పునాదులు ఎలా కదులుతున్నాయో గ్రహించి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటన్న ఆందోళన వాళ్లకు కలిగి ఉండాలి. అలా ఆందోళన పడకపోతే వాళ్లకు ప్రజల పట్ల ఎంత చులకనో అర్థమవుతుంది. రాజకీయాల్లో ఏ ఆశయాలు, ఆదర్శాలు లేకున్నా తమ సొంత మనుగడకే ప్రమాదం ఏర్పడినప్పుడైనా కదలాలి. ప్రజలతో నడవాలి.ఈ ఇంగిత జ్ఞానం తెలంగాణ రాజకీయ నాయకులకు లేదా? లేక 2014 ఎన్నికల వరకు అధికారంలోఎలాగో ఒకలాగ కొనసాగితే చాలు అనే అల్పసంతోషంతో ఉన్నారా? ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులకు కొంచమైనా జ్ఞానోదయమైనందుకు సంతోషించాలి.
తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేయవలసిన అవసరం, అగత్యం, బాధ్యత మహబూబ్‌నగర్ ప్రతినిధులకు అందరికంటే ఎక్కువ ఉన్నది. ఢిల్లీలో వాళ్లు వేరే వాదనలేవీ చెప్పనవసరం లేదు. మహబూబ్‌నగర్ జిల్లాకు సమైక్య రాష్ట్రంలో ఎంత అన్యాయం జరిగిందో వివరిస్తే చాలు. అది అధిష్ఠానానికి అర్థమైతే తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత ఏమిటో అర్థమవుతుంది. కానీ మహబూబ్‌నగర్ రాజకీయ నాయకత్వానికి ఆ అవసరం ఏ మేరకు అర్థమయ్యిందో ఆ వాదనలను ఎంత పటిష్టంగా ముందు పెట్టగలిగిందో మనకు తెలియదు.పాలమూరు దుస్థితికి రాజకీయ నాయకత్వం బాధ్యత వహించి, ఇప్పటికైనా పాలమూరు పేద ప్రజల పక్షాన మాట్లాడడం నేర్చుకోవాలి.
కృష్ణానది 2,70,2baba0 కిలోమీటర్లు జిల్లా గుండా ప్రవహిస్తుంటే తుంగభద్ర నదిలో ఈ జిల్లాకు రావలసిన న్యాయమైన వాటా వస్తే, మహబూబ్‌నగర్ జిల్లాలోనే కాక పట్టణంలో కూడా నీళ్ల కోసం అన్ని కష్టాలు ఎందుకు? ఇదేం ఎడారి ప్రాంతం కాదు. జీవనదులు ప్రవహిస్తున్న జిల్లా. ఈ జిల్లా నుంచి లక్షలాది మంది వలసలు పోవడం ఏమిటి? కరువు చావులు ఏమిటి? వ్యవసాయం కోసం బోరుబావులు తవ్వడమెందు కు? రాత్రివేళల్లో కరెంటుకోసం పొలాలకు వెళ్లి పాముకాటుతో చావడమెందుకు? కోస్తా జిల్లా రైతులా బతకవలసిన పాలమూరు రైతులు దయనీయమైన స్థితికి ఎందుకు నెట్టివేయబడ్డారు? ఈ ప్రశ్నలు మనందరిని నిలదీస్తున్నయిపజావూపతినిధులు యాభై ఏళ్ల కిందటే ఇలా ఢిల్లీకి వెళ్లవలసి ఉండే. బచావత్ ట్రిబ్యునల్‌తో కొట్లాడవలసి ఉండే.
పాపం బచావత్ మహబూబ్‌నగర్ గురించి ఎవ్వరూ ఏమీ అడగడం లేదని దయదలిచి జాలిపడి జూరాల ప్రాజెక్టును తన అవార్డులో చేర్చాడు. 1969 తెలంగాణ ఉద్యమం తర్వాత జరిగిన ఒప్పందంలో పాలమూరు నీళ్ల గురించి ప్రస్తావన ఎందుకు లేదు? అరవైలలో జరిగిన ఉద్యమంలో పాలమూరు ప్రజలను చైతన్యవంతులను ఎందుకు చేయలేదు? అలా చేయకపోవడం అప్పటి ఉద్యమ వైఫల్యం. సరే నదులలో నీళ్ల వాటా రాకున్నా, ఉన్న సహజ జలవనరులు ఎందుకు విధ్వంసమయ్యాయి? చెరువులు, కుంటలు, వాగులు, బావులు ఏమైనట్టు? లేనిదానికి కొట్లాడకపోయినా, ఉన్నవాటిని రక్షించుకోకపోవడం ఒక తెలివిహీనత. పాలమూరు మెట్ట ప్రాంతం కావడం వల్ల చెరువులకు, కుంటలకు చాలా అనువైన ప్రాంతం. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా చెరువులు ఉండేవి. ఒక్కొక్క చెరువు వెనక ఒక కథే ఉన్నది. కొన్ని చెరువుల నిర్మాణానికి ప్రాణత్యాగాలు చేశారనే కథలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నిజమైనా, కాకున్నా జనంలో ఈ కథల ప్రాచుర్యం చెరువుల ప్రాధాన్యాన్ని చాటుతుంది. ఈ మొత్తం అభివృద్ధి క్రమక్షికమంగా విధ్వంసమౌతూ, భారీ నీటి ప్రాజెక్టుల ప్రాధాన్యం పెంచుతూ వచ్చారు.
కోస్తాంవూధకు ఉండే నైసర్గిక స్వభావం వల్ల భారీ ప్రాజెక్టుల అవసరం వాళ్లకు ఎక్కువ. అక్కడ కుంటలు, చెరువులు, బావుల నిర్మాణం చాలా కష్టం. అందుకే 1baba52లో కృష్ణా, గోదావరి నదుల మీద ఆనకట్టలు కట్టి బ్రిటిష్‌వాడు ఆ ప్రాంతా న్ని అభివృద్ధి చేశాడు. ఆ అభివృద్ధి అనుభవంతో విశాలాంధ్ర ఏర్పాటు తర్వాత నిధులను భారీ నీటి పారుదలకు కేటాయిస్తూ, నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. అదే క్రమంలో చిన్న నీటి తరహా ప్రాజెక్టులకు కూడా అంతే ప్రాధాన్యం ఇచ్చి ఉంటే ప్రాంతీయ అసమానతలు ఇంత పెద్ద ఎత్తున పెరిగేవి కావు. దీనికి తోడు ‘హరిత విప్లవం’ నీటి కొరత ఉన్న ప్రాంతాలకు ఒక శాపంగా మారింది.
ఈ వ్యవసాయక మార్పు సంపూర్ణంగా, సమృద్ధిగా నీళ్లు ఉండే ప్రాంతానికి మాత్రమే ప్రయోజనం. పోనీ నీటి వనరులు తక్కువున్న ప్రాంతం పంటల ను, జల వనరులను, వందల సంవత్సరాల వ్యవసాయ పద్ధతులను కాపాడి, దేశీయ విజ్ఞానం ఆధారంగా వీటిని మెరుగుపరిచే బదులు, వెనుకబడిన ప్రాంతాల వనరులతో సంబంధం లేకుండా, అన్ని ప్రాంతాలలో ‘హరిత విప్లవాన్ని’ ప్రోత్సహించడంతో, వేల సంవత్సరాలుగా తెలంగాణ పండిస్తున్న జొన్నలు, సజ్జలు, తైద లు, వేరుశనగ, ఆముదం, కందులు లాంటి పంటలు క్రమేణా క్షీణిస్తూ వచ్చాయి. హరితవిప్లవంతో దిగుమతి చేసుకున్న కొత్త వంగడాలు ప్రవేశపెట్టడంతో, చెరువులు, కుంటలు, బావుల స్థానంలో, వినాశనకరమైన బోరుబావులు రావడంతో పాలమూరు రైతుల పరిస్థితి మరింత దీనంగా మారింది. రాజకీయ, ఆర్థిక చైతన్యం లేకపోవడం వల్ల వస్తున్న మార్పులను సరిగ్గా అంచనా వేయకపోవడం వల్ల, వందల సంవత్సరాల తమ సమష్టి వ్యవసాయక అనుభవం రైతులకు నిరుపయోగమైపోయింది.
ప్రతి అవసరానికి రైతు మార్కెట్లకు పరిగెత్తే పరిస్థితి ఏర్పడడంతో, పంటలకు సరైన ధరలు రాకపోవడంతో, గ్రామీణ జీవనం విచ్ఛిన్నమౌతూ వచ్చిం ది. ఈ విచ్ఛిన్నం నుంచే భారీ నీటి ప్రాజెక్టులు తమకూ కావాలనే డిమాండ్ తెలంగాణ ప్రాంతంలో ఉద్యమంలో పెరిగి, 1960లో ఉద్యమంలో లేని రాజకీయ అవగాహన 21వ శతాబ్ద తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా ముందుకువచ్చింది.
ఈ జిల్లాలో ఉండే చెరువులు, కుంటలు ఎలా విధ్వంసమయ్యాయో జడ్చర్ల పట్టణంలోని ఊర చెరువు, అంతకుమించి పట్టణానికి ఐదు కిలోమీటర్లలో ఉన్న అద్భుతమైన మీనాంబరం వాగును చూస్తే చాలు. తెలంగాణ ఉద్యమకారులందరూ పాలమూరు జిల్లాకు వెళితే ఈ రెండు ప్రదేశాలను చూస్తే చాలు. అరవై ఏళ్ల రాజకీయ, ఆర్థిక ‘అభివృద్ధి’ ఏమిటో? దాని విషరూపమేమిటో అర్థమవుతుంది. నూతన ఆర్థిక విధానాల పుణ్యమా అని పాలమూరు వ్యవసాయం మరింత విధ్వంసం కావడానికి కారణమై ఆత్మహత్యల దాకా చేరుకుంది.
దీనితోపాటు ఇసుక మాఫియా పుట్టుకొచ్చింది. ఒక మధ్యతరగతికి చెంది న విజయ్‌కుమార్ అనే కాంట్రాక్టర్ (కోస్తాంధ్ర కాంట్రాక్టర్) కోటీశ్వరుడు కాగలిగాడు. ఆయన చేసిన విధ్వంసానికి ప్రతీకగా ఆయన తల్లిదంవూడుల విగ్రహాలను జడ్చర్ల దగ్గర ప్రతిష్టించాడు. ఇలాంటి విగ్రహాల మీద ఆగ్రహాలు ఉండడం సహజం. ఇసుక తరలింపులో భూగర్భ జలాలు పాతాళానికి పోవడంతో బోరుబావులు 400-500 అడుగుల దాకా చేరడంతో వ్యవసాయం అసాధ్యమైపోయింది.
మీనాంబరం వాగును చూడడానికి మిత్రుడు పాలమూరు అధ్యయన వేదిక నాయకులలో ఒకరు యాదగిరితో కలిసి వెళ్లాం. యాదగిరి అలియాస్ ఉదయమిత్ర ఆక్టివిస్టే కాదు, రచయిత, కవి, అధ్యాపకు డు. ఆయనకు తోడు జడ్చర్లలో ఈ అంశాల పట్ల ఆందోళన చెందుతున్న కొందరు యువకులు, పౌరు లు ‘వనరుల సంరక్షణ కమిటీ’ని ఏర్పాటు చేసి జంగ య్య కన్వీనర్‌గా, రవిశంకర్ కో-కన్వీనర్‌గా పౌర సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి కృషి చేస్తున్నారు.
మీనాంబరం వాగుతో పాటు జడ్చర్ల ఊర చెరువు ఎలా దురాక్షికమణలకు గురైందో, చెరువు శికంలో కట్టడాలు ఎలా వచ్చాయో చూపించారు. నగరం నడి ఒడ్డున ఉండి మొత్తం పట్టణానికి ప్రాణాధారంగా ఉండే ఈ చెరువు తమ కళ్లముందే విధ్వం సం అవుతూ ఉంటే, జడ్చర్ల, బాదేపల్లి ప్రజలు ఎందుకు మాట్లాడలేదో? ప్రజావూపతినిధులు ఎందుకు పట్టించుకోలేదు?
ఇప్పుడు మీనాంబరం వాగులో కొనసాగుతున్న ఇసుక తరలింపును చూస్తే, భూకంపం వస్తే పడి ఉన్న శవాల వలె వందల ఏళ్లుగా ఎదిగిన మహావృక్షాలు కూలిపడి ఉన్నాయి. వాగును తవ్వుతూ తవ్వుతూ వాగు ఒడ్డున ఉన్న దేవాలయం పునాదుల దాకా వచ్చారు. ఇంకా ఒక్క ఇంచు తవ్వినా గుడి కూలిపోతుంది. ప్రజలను దేవుడే రక్షించాలి అన్నట్లు దేవాలయం ఇసుక తవ్వడానికి అడ్డుపడింది. నూతన ఆర్థిక విధానం ఎంత దుర్మార్గమైందంటే అది గుడిని, గుడిలోని లింగాన్ని మింగగలదు. ఆ లింగాన్ని మింగి స్వాముల నోటి లో నుంచి బయటికి తీసి మళ్లీ ప్రజలను నమ్మించగలదు. ఆ స్వాముల ఆశీస్సులు కాంట్రాక్టర్లకు ఎలాగూ ఉంటాయి. ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినదని ఇప్పటికీ వేలాదిమందితో జాతర జరుగుతుందని అన్నప్పుడు, దేవుడి విగ్రహాన్ని కళ్లుమూసుకుని భక్తులు చూడాలనే పద్ధతి ఎందుకు వచ్చిందో అర్థమౌతుంది.
తెలంగాణ ఉద్యమ లక్ష్యం భౌగోళిక తెలంగాణ కాక ప్రజల నిత్య జీవిత సమస్యలు కూడా ముందుకు రావాలి. నీటి వనరుల రక్షణ సమస్య కీలకం కావాలి. ప్రతి చెరువు, కుంట, వాగును రక్షించుకోవడానికి, పునరుద్ధరించుకోవడానికి కమిటీలు ఏర్పడాలి. ఈ దిశగా కృషి చేయాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల మాటలు వినడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. ఇంకా ఒక అడుగు ముందుకువేసి ఈ విధ్వంసం వెనక ఉన్న సామ్రాజ్యవాద ప్రేరిత అభివృద్ధి నమూనాను ప్రశ్నించగలిగితే ప్రజల చైతన్యస్థాయి మరింత ఉన్నతస్థాయికి ఎదిగి ప్రజాస్వామ్య తెలంగాణ ఆకాంక్ష సాకారం కావడానికి దోహదపడుతుంది.
తెలంగాణ ఉద్యమంలో సెప్టెంబర్30 (27-9-2012)
దశాబ్ద కాలంలో తెలంగాణ చూసిన భిన్నమలుపులలో 2012 సెప్టెంబర్ 30 ఒక ప్రధానమైన మలుపుగా నిలిచిపోయేలా ఉద్యమం జరగాలి. జిల్లాలన్నింటిలో రాజకీయ పార్టీల జోక్యం ఉన్నా లేకున్నా ప్రజలు ఈ ‘మార్చ్’ను విజయవంతం చేయాలనే దీక్షతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. రాజకీయ పార్టీల రంగు రంగు వేషాలతో ప్రజలు విసిగిపోయారు. అయితే 30వ తేదీన ఏం జరగబోతున్న ది అన్నది ప్రభుత్వానికి, ప్రజలకు ఒక పెద్ద సవాలు. ఈ మార్చ్‌కు సహజంగానే ప్రభుత్వం అనుమతి ఇవ్వనంటున్నది. ఇది కొత్త సంగతేం కాదు. గత నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు అణచివేతను భిన్న రూపాల్లో అనుభవించే ఉన్నారు. రాజకీయంగా పరిష్కరించవలసిన సమస్యలను శాంతిభవూదతల సమస్యగా చూడడం వెంగళరావు పాలనతోనే ఆ మాటకు బ్రహ్మానందడ్డి కాలంలోనే ప్రారంభమైంది. అన్ని రకాలుగా అధికార దుర్వినియోగం చేయడాన్ని చట్ట, రాజ్య వ్యవస్థ అనుమతించడంతో ఆ యంత్రాంగమే సామాజిక పరిణామానికి ప్రజాస్వామ్య వికాసానికి పెద్ద గుదిబండై కూర్చుంది. ఏ రాజకీయ నాయకు లు గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించాలో వాళ్లు హైదరాబాద్‌లో సౌఖ్యాలు అనుభవిస్తూ ప్రజా ఉద్యమాలను ఎదుర్కొనడానికి పోలీసులను ఉపయోగిస్తున్నారు. పోలీసులు కూడా దీన్ని కోరుకుంటున్నారు. రాజకీయ పార్టీలు, నాయకులు ప్రజాసమస్యల నుంచి తప్పించుకొని తిరిగినంత కాలం ప్రజా నిరసన భిన్న రూపాల్లో వ్యక్తమవుతుందని తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లేదా భిన్న ఉద్యమాలు అలాగే నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి పౌరహక్కుల సంఘా లు విశ్లేషిస్తూనే ఉన్నాయి. ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నాయి. ఈ అవగాహనకు పరాకాష్టగా రాష్ట్రంలో ‘శాంతి చర్చలు’ జరిగాయి. శాంతి చర్చలు చరివూతలో చాలాకాలం గుర్తుండే ఒక ప్రయోగమే. వర్గాలుగా విడిపోయిన సమాజంలో శాంతి చర్చలు ఏమిటి అన్నవారు కూడా తర్వాత కాలంలో ఈ ప్రయోజనపు విశిష్టతను అంగీకరించక తప్పలేదు. శాంతి చర్చల విఫలం నక్సలైట్లకు ఎంత నష్టం చేశాయో తెలియదు. కానీ ‘శాంతి’కి ప్రజాస్వామ్యానికి అది పెద్ద విఘాతాన్ని కలిగించింది.
ఈ పర్యాయం తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి రెండు కళ్లు, రెండు చెవులు, రెండు నాలుకలు, మూడు ఆలోచనలు బార్లా తెరిచే ఉన్నాయి. కానీ ఒక సమస్యకు రెండు పరిష్కారాలుండవు. ఈ ఉద్యమం ఏ సాధించినా, సాధించకున్నా ప్రజా అవగాహనను, చైతన్యాన్ని పెంచింది. అందుకే మొత్తం దేశంలో తెలంగాణ ప్రాంత చైతన్యస్థాయి, మరే ప్రాంతంలో లేదు, ఉన్నా నాకు తెలియదు. అయితే ఉద్యమంలో, చాలా సందర్భాల్లో పేర్కొన్నట్లు, తెలంగాణ యువత పాటించవలసిన నిజాయితీ, నిబద్ధత ఏ స్థాయిలో ఉండాల్లో ఆ స్థాయిలో లేకపోవడం ఒక లోటే. అయితే సెప్టెంబర్30న తెలంగాణ యువతకు, విద్యార్థి లోకానికి ఒక పెద్ద పరీక్ష. ఈ పరీక్షలో పాస్ కాకపోతే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినట్లే. ఏ ఆశలకు లొంగకుండా నిటారుగా నిలబడగలిగితే, తర్వాత జీవిత కాలమంతా ఆత్మవిశ్వాసంతో, సగర్వంగా బతకవచ్చు. ఈ చైతన్యం ప్రజా సమీకరణలో, ప్రజలను చైతన్య పరచడంలో విద్యార్థులు, విద్యావంతులు తమ వంతు పాత్రను నిర్వహించవలసి ఉంది.
ప్రభుత్వం ఈ ‘మార్చ్’కు అంత సులభంగా అనుమతి ఇస్తుందన్న నమ్మకం లేదు. అనుమతి ఇస్తే కిరణ్‌కుమార్‌డ్డి ప్రభుత్వం ప్రజాస్వా మ్య సంస్కృతిని కొంత కాపాడినట్టే. అనుమతి ఇవ్వడమే కాక తాము ప్రత్యక్షంగా, పరోక్షంగా పెంచి పోషించిన గూండాలను, మాఫియాను, అసాంఘిక శక్తులను ‘మార్చ్’ను హింసాయుతం కానీయకుండా చూడగలిగితే లేదా ఆపగలిగితే అది ప్రజాస్వామ్య విజయంగా గుర్తించవలసి ఉంటుంది. అలా జరిగితే తెలంగాణ రాష్ట్ర ప్రకటన కొంత ఆలస్యమైనా ప్రజలు మరికొంత కాలం ఓపిక పట్టవచ్చు. శాంతియుత పద్ధతుల ద్వారా, ప్రజాస్వామ్య ఉద్యమాల ద్వారా తమ లక్ష్యాలను సాధించుకోవచ్చనే విశ్వాసమే ప్రజలకు కలిగితే, వ్యవస్థాపక హింస పాత్ర కూడా కొంత తగ్గవచ్చు. ఈ మధ్య కాలంలో భిన్న దేశాల ప్రజల నిరసన వెల్లువ, ఏ హింస లేకుండా నియంతలను అధికార పీఠం నుంచి దించగలిగారు. ఉద్యమాలలోని హింసస్థాయి రాజ్యహింస స్థాయిని బట్టే ఉంటుంది. రాజ్యం ప్రజాస్వామికంగా ప్రవర్తిస్తే, ప్రజలను శాంతియుత ఉద్యమం ద్వారా తమ సమస్యలు పరిష్కారమౌతాయనే విశ్వాసమే కలిగితే, అది కలిగించగలిగితే జనజీవన స్రవంతి ఒక గంతు వేసినట్లే. ఒకమలుపు తిరిగినట్లే.
సెప్టెంబర్ 30న మార్చ్‌ను అంత ప్రజాస్వామికంగా పాలకులు అనుమతిస్తారని ఆశించడం అత్యాశే. కొందరు స్నేహితులు మీరు మరీ కలలు కనడం మొదలుపెట్టారు అని అనవచ్చు. శాంతియుత ఉద్యమాలను ప్రోత్సహిస్తే, హైదరాబాద్‌లో వేలాది ఎకరాలు భూమిని ఆక్రమించుకున్నవారు, అక్రమ సంపాదనను కూడబెట్టుకున్నవారికి, అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారికి ‘శాంతి’ పెద్ద శత్రువు. శాంతి మనిషిని తనలోని ‘ఆ మనిషి’ చూడడానికి ఒక అవకాశం. పాలకులకు తమ లోపలి మనిషిని చూసే ధైర్యం ఉండదు. అలా చూడడం చాలా మౌలిక ప్రశ్నలకు దారితీస్తుంది. చివరకు మనం ఎందుకు జీవిస్తున్నాం, జీవితానికి అర్థమేమిటో, ఈ సంపద కూడబెట్టి ఏం చేస్తాం అనే ప్రశ్నలకు దారితీయవచ్చు. అందుకే అమాయకమైన, నిరాడంబరమైన, నిజాయితీగా బతుకుతున్న ఏ మనిషైనా రాజ్యాన్ని భయపెట్టగలడు. అందుకే అలా అడవిలో జీవిస్తున్న ఆదివాసీల మీద యుద్ధమే ప్రకటించారు. ఆదివాసీల జీవన విధానం వలసవాదానికి, పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రమాద మే. వాళ్ల జీవన విధానం ఒక దృష్టాంతం గా ఉన్నంత కాలం నూతన ఆర్థిక విధానానికి నిద్రపట్టదు.
రెండవ తరం ఆర్థిక సంస్కరణల పేరు మీద, వృద్ధి రేటు పడిపోయిందని, రెండు దశాబ్దాల ప్రయోగం తర్వాత సంస్కరణలను పునః పరిశీలించే బదు లు వాటిని మునుముందుకు తీసుకు పోవడానికి ప్రపంచ పెట్టుబడికి ఏజెంట్ అయిన చిదంబరం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా కీలక సమయంలో బ్రేక్ వేయవలసిన సోనియాగాంధీ ఈ సంస్కరణలకు తన పూర్తి మద్దతును తెలిపారు. భవిష్యత్ ప్రధాని అని తలుస్తున్న రాహుల్‌గాంధీ అవగాహన ఏమిటో తెలియదు. అందరూ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నారు. సంస్కరణలు ముందుకుపోయినకొద్దీ జరగబోయేది ప్రమాదమే. ఈ పర్యవసానాన్ని గురించి నోబెల్ బహుమతి గ్రహీత జోసె ఫ్ స్టిగ్లిడ్చ్ తన ‘Price For In equality’ అసమానతల మూల్యం. అంటే పెరుగుతున్న అసమానతలకు రాజకీయాలు చెల్లించవలసిన మూల్యా న్ని గురించి వివరంగానే రాశాడు. ఈ రచనలో ‘ఒకరి చేత, ఒకరి కొరకు, ఒక వలన’ జరుగుతున్న పాలన 99 మంది ఆగ్రహాన్ని చూడక తప్పదు. నిజానికి తెలంగాణ మార్చ్‌కు ఇది చారివూతక, రాజకీయ, ఆర్థిక నేపథ్యం. అందుకే సెప్టెంబర్ 30 మార్చ్ ఒక ప్రధానమైన ప్రయోగంగా చూడవలసి ఉంటుంది.
మార్చ్‌ను జరగనివ్వకపోతే ప్రతి పట్టణం, ప్రతిక్షిగామం ఒక ట్యాంక్‌బండ్, ఒక ఇందిరాపార్క్, ఒక అమరవీరుల స్థూప చిహ్నంగా మారాలి. గ్రామక్షిగామంలో మార్చ్ జరగాలి. అవి మీడియా దృష్టికి రాకపోవచ్చు. రావు కూడా. మీడియా చరివూతను విశ్లేషించే సాధనం కాదు. ఇప్పటి సమకాలీన మీడియా చరిత్ర గమనాన్ని అడ్డుకోవడానికి చాలా ప్రయాస పడుతున్నది. చరిత్ర చోదకశక్తులు గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నాయి. ప్రతి గ్రామంలో ప్రజలు ముక్తకం తెలంగాణ రాష్ట్ర సాధనే కాక, ఒక ప్రజాస్వామ్య మానవీయ తెలంగాణ, దేశానికే ఒక నమూనాగా మార్చడానికి తమవంతు పాత్రను నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేయాలి. ఆ చైతన్యమే తెలంగాణ భవిష్యత్తుకు బాటలను వేస్తుంది.
నిండమునిగిన వాడికి చలేమిటి? (20-9-2012)
walmart చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడిని అనుమతించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తెలుపుతూ నిర్ణయం తీసుకున్నది. తోటి ఇతర పార్టీలు అభ్యంతరం చెప్పినా మమతా బెనర్జీ తన మద్దతును ఉపసంహరించుకున్నా, నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రశ్నేలేదంటున్నది. పోరాడుతూ పోరాడుతూ పోయినా ఫర్వాలేదు అనే మన ప్రధాని, తన పదవికి న్యాయం చేయలేదు అని టైమ్ మ్యాగజైన్ అన్న తర్వాత, ఒబామా స్వయాన భారతదేశం ఆర్థిక సంస్కరణల అమలులో వెనుకబడి ఉన్నదని వ్యాఖ్యానించి న తర్వాత తెలంగాణ భాషలో చెప్పాలంటే, రోషం వచ్చింది. ఇక అగేది లేదు అని అంటున్నాడు. తొమ్మిది, పది సంవత్సరాల పదవీకాలంలో అణు ఒప్పం దం సందర్భంలో కూడా ప్రధాని చాలా మారాము చేశాడు. అదే ప్రధాని విశ్వవిద్యాలయ గ్రాంటు కమిషన్‌కు చైర్మన్‌ను నియమించలేకపోతున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులు లేరు. ఎవ్వరైనా అడిగితే తాను అశక్తుడినని అంటూనే కొన్ని ఆర్థిక కఠిన నిర్ణయాలు తప్పవు అంటున్నాడు. ఈభాష తెలుగు ప్రజలకు కొత్తేం కాదు. అలా కఠిన నిర్ణయాలు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవని కాలేజీ సర్వీసు కమిషన్‌ను రద్దు చేసి, విద్యుచ్చక్తి మీద సబ్సిడీ లేదని, అసలు సబ్సిడీలు ఇవ్వడమే తప్పని అంటూ మాబోటి వాళ్ళు ఎవరైనా సలహాలు ఇచ్చినా పట్టించుకొని చంద్రబాబునాయుడి పైన ప్రజలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకున్నా రు. ఎంత కఠినమంటే ఆయన ప్రజలని ఎలా విస్మరించారో, ప్రజలు ఆయనని అలాగే విస్మరించారు. నిజానికి కొన్ని విషయాల్లో చంద్రబాబు, రాజశేఖర్‌డ్డి కంటే కొంచెం మెరుగు. కానీ రాజశేఖర్‌డ్డి ప్రజలకు కొన్ని రాయితీలు కల్పించడం, కొన్ని సంక్షేమ కార్యక్షికమాలు అం దించడం వల్ల ఆయన కుమారుడు జైళ్ళో ఉన్నా ప్రజలకు ఆ కుటుంబం పట్ల కొంత అభిమానం మిగిలే ఉన్నది.
ఇప్పుడు ఎవరు గెలిచినా జరిగేది ఏమిలేదు అనే నిర్ణయానికి వచ్చి దుర్మార్గులలో ఎవరు తమకు కొంత ఉరట కల్పించినా వాళ్ళ పట్ల కొంచెం సానుకూలంగా ఉన్నారు. దీనినిబట్టి ప్రజలు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో ఊహించవచ్చు. ఇది మన రాష్ట్ర అనుభవం. ఈ అనుభవాన్ని రాష్ట్రంలోని ఏ కాంగ్రెస్ ప్రజావూపతినిధి ప్రధానికి చెప్పడం లేదా, లేక ఆయన వినడా, లేక వీళ్ళ ప్రయోజనాలు కూడా చిల్లరవ్యాపారంలో విదేశీ పెట్టుబడులతో ఏమైనా ముడిపడి ఉన్నాయా? అన్నది పెద్ద సందేహమే.
కేంద్ర ప్రభుత్వం ఒకేసారి మూడు కఠిన నిర్ణయాలను తీసుకున్నది. ఒకటి, డీజిల్ ధర పెంపు, రెండు: చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు; మూడు: ప్రభుత్వరంగ సంస్థల నుంచి 15 వేల కోట్ల పెట్టుబడి ఉపసంహరణ- అంటే ప్రజా ఆస్తులను ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పచెప్పడం. అసలే ధరలు పెరుగుతూ సామాన్య ప్రజల జీవితం రోజురోజుకు దుర్భరం అవుతున్న దశలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ వచ్చే ఎన్నికల్లో మునుగుతుందిరా బాబు అంటే మునిగితే మునుగని అనే వాళ్ళకు చెప్పడం ఎంతో కష్టం. మన్మోహన్ సింగ్‌కు మళ్ళీ ప్రధానమంత్రి అవుతానన్న ఆశలేదు. కానీ కాంగ్రెస్‌పార్టీ కలిసికట్టుగా సామ్రాజ్యవాద నౌకలో మునుగదలచుకుంటే, ఏ గజ ఈతగాళ్ళు వీళ్ళని రక్షించలేరు. పోనీ బీజేపీ ఏమైనా దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తుందా అంటే, నామమావూతపు వ్యతిరేకత ఎలాగు ఉంటుంది, కానీ ప్రపంచీకరణ విషయంలో, అభివృద్ధి నమూనా విషయంలో వాళ్ళకు ప్రత్యామ్నాయ దేశాభిమాన, దేశభక్తితో కూడిన జాతీయ నమూనా ఏదీ లేదు.
కొత్తగా ఎదుగుతున్న వెనుకబడిన తరగతుల ప్రభావం కలిగిన రాజకీయ పార్టీలకు కూడా ఆర్థిక నమూనా మీద ఎలాంటి అవగాహన లేకపోవడం చాలా పెద్ద విషాదం. ఈ అంశాన్ని గురించి వ్యాసాల్లో ఎన్నిసార్లు రాశానో తెలియదు. ఇలా మళ్ళీ మళ్ళీ రాయడం ఈ అంశాల గురించి ‘నమస్తే తెలంగాణ’ పాఠకులకు చెప్పడానికే. తెలంగాణ ఒక మహో ఉద్యమంలో ఉన్నది. కొత్తరాష్ట్రమే కాదు. కొత్త ఆర్థికనమూనా కోసం పురిటి నొప్పు లు పడుతున్నది. అవుతే ప్రసవంలో వినూత్న శిశువు జన్మిస్తుందన్న నమ్మకం లేదు. వికృతశిశువు కాకుండా ఒక ఆరోగ్యకర శిశువు జన్మించినా తెలంగాణ ప్రజలు తమను తాము అభినందించుకోవచ్చు. ఎందుకో ఈసారి తెలంగాణ ఉద్యమంలో యువకుల నుంచి కొత్త రాజకీయ నాయకత్వం రాలేదు. లేదా రానివ్వలేదు. ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు తగు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఎవరైనా ఎదుగుతుంటే తమలో కలుపుకున్నాయి. కొందరిని ఇతర మార్గాల ద్వారా వశపరుచుకున్నారు. అందులోంచి ఎదిగిన కళాకారులకు , కవులకు, గాయకులకు రాజకీయ, ఆర్థిక అంశాలపై అంత లోతైన అవగాహన ఉండడానికి అవకాశాలు చాలా తక్కువ. ముఖ్యంగా సామ్రాజ్యవాద ప్రభావం, అది ఉపయోగిస్తున్న భిన్న పద్ధతుల మీద , వాటి మధ్యన ఉండే అంతర్గత సంబంధాల మీద, వైరుధ్యాల మీద అంతగా అవగాహన ఉండదు. అవుతే ప్రజా చైతన్యం పెంచడం లో వాళ్లు చాలా కీలకమైన పాత్ర నిర్వహిస్తున్నారు. ఆ చైతన్యం కొత్త ఆలోచనా విధానానికి , ప్రత్యామ్నాయ నమూనాల రూపకల్పనకు అంతగా ఉపకరించకపోవచ్చు.
అరుంధతీరాయ్ మావోయిస్టులకు అవకాశం వస్తే వారు ఖనిజ సంపద పట్ల ప్రకృతి పట్ల ఎలాంటి విధానాలను అవలంబిస్తారో అనే ప్రశ్న అడుగుతున్నది. ఈ ప్రశ్న నిజానికి అడగడానికి ఇక ఆ ప్రజల్లోని వారు మిగిలి ఉన్నారనిపిస్తున్నది. వాళ్లే ప్రత్యామ్నాయ జనతన సర్కార్ గురించి మాట్లాడుతున్నారు. అది బీజ ప్రాయంలోనే ఉన్నది. తగిన చర్చ కాని, ప్రచారం కాని జరగలేదు. అయితే వాళ్లు ఇప్పుడున్న నమూనాను సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నారు. సామ్రాజ్యవాదాన్ని ఎదిరించే సాహ సం చేస్తున్నారు. అందుకే భిన్నరంగాలలో దేశవ్యాప్తంగా ఈ రాజకీయాల పట్ల నేను ఊహించని ఆసక్తి పెరిగింది. అందుకే ఆ రాజకీయాలను జాతీయ భద్రతకు పెను ప్రమాదంగా , చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడిని ఆహ్వానిస్తున్న ప్రధాన మంత్రి భావిస్తున్నాడు.
చిల్లర వ్యాపారం చర్చకు వస్తే పాలకులు ఎందు కు లక్షలాది మంది చిల్లర మనుషుల జీవితాలకు చిల్లులు వేయడానికి సిద్ధపడుతున్నారు అంటే, సామ్రాజ్యవాదం పాలకుల మీద ఎలాంటి మాయజాలాన్ని విసిరిందో అర్థంచేసుకోవాలి. ప్రజలు ఎన్నికలలో ఎవరిని ఎన్నుకుంటున్నారు అనే అంశా న్ని పక్కకు పెడితే, ఒక దేశ ప్రధానమంవూతిగా ఎవ్వరుండాలి దగ్గర నుంచి, ఏ మంత్రిత్వశాఖ ఎవరికి ఇవ్వాలి అనే దాకా ఆదేశాలు వాళ్లే ఇస్తున్నారు. వాళ్ల మనుషులకు వాళ్ల మీడియా ద్వారా కావలసిన ప్రచారాన్ని చేయిస్తారు. లేకపోతే కపిల్ సిబల్ స్వతంత్ర భారతంలో అతి గొప్ప విద్యామంత్రి అనే ప్రచారం ఎలా సాధ్యం? అబ్దుల్ కలాం, ఆజాద్, చావ్లా, హుమాయిన్, కబీర్ లాంటి ప్రముఖులకంటే ఈయన ఎలా గొప్పవాడో! అడిగే వాడేడి? దేశీయ పెట్టుబడి అంతర్జాతీయ పెట్టుబడితో మిలాఖత్ అయిన తర్వాత అంతర్జాతీయ ఆర్థికశక్తులకు మన రాజకీయాల మీద, రాజకీయ నాయకుల మీద, ఆర్థిక వనరుల మీద చాలా పట్టు లభించింది. వాళ్ల చదరంగంలో చిదంబరం, కపిల్‌సిబల్ లాంటి వాళ్లు పావులు. వీళ్లు సరిపోరని ఇంకొక ప్రధాన పావును కదుపు తున్నాయి.
పదేళ్ల క్రితం దేశమంతా అసహ్యించుకున్న నరేంవూదమోడీ బీజేపీలోని హేమాహేమీలను పక్కకు నెట్టి పెద్ద నేతగా అవతరిస్తున్నాడు. నరమేధం చేసిన వ్యక్తి చర్యలను ఇంత తొందరగా దేశం ఎలా మరిచిపోగలుగుతున్నదో ఆలోచిస్తే భయం వేస్తున్నది. మీడియా అలసట లేకుండా ఆయన ఇమేజీని పెంచుతున్నది. అందుకే చిల్లర వ్యాపారంలోనే కాదు, ఏ రంగంలో అయినా అంతర్జాతీయ సామ్రాజ్యవాద శక్తులు రావాలంటే తలుపులు తెరవడానికి పెట్టుకున్న ద్వారపాలకులు మన నేతలు. వీరు నిండ మునిగినా తమ దేవుళ్లు దేవాలయంతో సహా మునగడానికి సిద్ధంగా ఉన్నారు.
నీళ్లులేక పాలమూరు కన్నీళ్లు (13-9-2012)
పాలమూరు జిల్లా కరువు గురించి మాట్లాడి మాట్లాడి అలసిపోవడమే తప్ప, సమస్య పరిష్కారం జరగడం లేదు. ఆకలి, దప్పి ఉండే దాకా అలసిపోవడానికి వీలులేదు. పౌర హక్కుల సంఘం ఎన్కౌంటర్ల మీద వాస్తవ నిర్ధారణ కమిటీలలో తిరుగుతున్నప్పుడు ఒకసారి బాలగోపాల్‌తో ఎవరో మిత్రుడు ఎన్ని రోజులని మనం ఇలా వాస్తవ నిర్ధారణ కమిటీలు వేసి తిరుగుతుంటాం అని అంటే ‘చంపేవాడే’ అలసిపోనప్పుడు దీనిని ప్రజలకు చెప్పేవాళ్ళు అలసిపోతే ఎట్లా అన్నాడు. అలాగే పాలమూరు గురించి ఎన్నిసార్లు చెపుతారు అంటే అలసిపోకుండా నీళ్ళు వచ్చేదాకా, పాలమూరు రాజకీయ నాయకుల హృదయాలు కరిగి నీళ్ళయ్యేదాకా, ప్రభుత్వాలు సమస్యను నిర్దిష్టంగా పరిష్కరించే దాకా, పాలమూరు ప్రజలు నీళ్ళ కోసం రాజీలేని పోరాటాలు చేసేదాకా, చదివే వారికి ఎంత ఇబ్బందైనా, ఎంత విసుగు వచ్చినా, చెబుతూనే ఉండాలి. వాళ్ళే మళ్ళీ చెప్పడానికి ఇది ఒక సరైన సందర్భం కూడా. తెలంగాణ ఉద్యమం పాలమూరు సమస్యను సమక్షిగంగా అవగాహన చేసుకొని రాష్ట్రం ఏర్పడ్డాక, ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కరించేలా తెలంగాణ సమాజాన్ని సంసిద్ధం చేయాలి.
పాలమూరు కరువు, వలసల వల్ల జరిగే మానవ హననానికి రాజకీయాల్లో చాలా మానవీయమైన నాయకత్వం వచ్చి ఉండవలసింది. అవి కొంత వరకు వనపర్తి బాల కిష్టయ్య,మహేంవూదనాథ్లలో కనిపించినా తర్వాత వచ్చిన నాయకత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. రాజా రామేశ్వరరావు వనపర్తి ప్యాలెస్‌ను పాలిటెక్నిక్ కాలేజీకి ఇచ్చి తన దాతృత్వాన్ని కొంతైనా చాటుకున్నాడు. కాని తర్వాత వచ్చిన నాయకులు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకొని లాభాల వేటలో పడ్డారు. రాజకీయాలు ఎలా దిగజారిపోయాయో అనడానికి ఇదొక మంచి ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద భూస్వాములకు, అగ్ర కులాలకు నాయకత్వ అవకాశాలు ఇచ్చిందని, ఆ పెత్తందారీ ఆధిపత్యం నుంచి బయటపడడానికి, వెనుకబడిన కులాలు, తరగతులు తెలుగుదేశం పార్టీని ఆశ్రయించాయి. ఈ పార్టీకి చాలాకాలం తిరుగులేని మద్దతునిచ్చాయి. ఎన్టీ రామారావు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నారు కూడా. ఇవన్నీ ప్రజలను భ్రమలకు గురిచేయడానికి పనికొచ్చాయి, కానీ వారి జీవితాలు మెరగుపడడానికి కాదు.
మేం పిల్లలుగా ఉన్నప్పుడు మా గ్రామంలో దాదాపు పది బావులలో ఎండాకాలం లో కూడా సమృద్ధిగా నీళ్లుండేవి. మేమందరం గంటల తరబడి ఈతలు కొట్టిన వాళ్లమే. బోలెడన్ని మంచినీళ్ల బావులుండేవి. ఈ బావుల్లో నీళ్లు ఎనిమిది, తొమ్మిది ఫీట్లలో ఉండేవి. వర్షాకాలంలో చేతులకు తగిలేంతపైకి నీళ్లుండేవి. మా ఊరి గిద్ద నిండా నీళ్లుండేవి. అవి గ్రామం గుండా ఊరి దొర భూమికి పారేవి. కానీ నిరంతరంగా పారే కాలువ గ్రామానికి ఎంతో అందాన్నిచ్చేది. హరిత విప్లవ పుణ్యమా అని మొత్తం వ్యవసాయ పద్ధతులు మారిపోవడం, విపరీతంగా నీళ్ల అవసరాలున్న పంటలను పండించడం వల్ల వ్యవసాయ పునాదులు విధ్వంసం అయ్యాయి. వందల సంవత్సరాల రైతుల అనుభవం కాని, వ్యవసాయ పంటలను విస్మరించి ‘ఫోర్డు ఫౌండేషన్’ ప్రేరేపిత వంగడాలను ప్రవేశపెట్టడం దేశ పాలకుల దివాళాకోరుతనాన్ని చాటుతున్న ది. మా బాల్యంలో మా నాన్న వచ్చిన వాళ్లందరితో జపాన్ వ్యవసాయ పద్ధతుల గురించి మాట్లాడితే, జపాన్ తరహా పంటలు పండించే వాళ్లకు ప్రభుత్వ రాయితీలున్నాయని చెప్పేవాడు. నిజానికి జపాన్‌లో భూ కమతాలు చాలా చిన్న వి. ఎవరికి ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండదు. జపాన్ పెట్టుబడిదారీ అభివృద్ధికి, అత్యంత సంపద సృష్టికి భూ సంస్కరణలు కూడా తోడ్పడ్డాయి.
జపాన్ను కాదని వేల ఎకరాలు సంపూర్ణ యాంత్రీకరణ ద్వారా చేసే అమెరికా నమూనాను మన రైతాంగం మీద ఏ మాత్రం దూరదృష్టి లేకుండా రుద్దడంతో వ్యవసాయ రంగం చాలా సంక్షోభానికి గురైంది. ఈ నమూనాకు కీలకం నీళ్లు. పాలమూరు జిల్లా లాంటి జిల్లాలో రైతులు నీళ్లవేటలో, చేదుడు బావులు, మోట బావుల నీళ్లు సరిపోక బోరుబావులను ఆశ్రయించారు. బోరుబావులు చిన్నపిల్లలు చనిపోవడానికి కారణమయ్యాయి. కానీ రైతుల స్థితిని మార్చడానికి, వాళ్ల జీవితాలు మెరుగుపడడానికి ఏ మాత్రం పనికి రాలేదు. ఇది సరిపోక మన దుర్మార్గ పాలకుల సామ్రాజ్యవాద ప్రేరిత వాణిజ్య వ్యవసాయాన్ని ప్రపంచీకరణలో భాగంగా ప్రవేశపెట్టారు. కొంచెం బుద్ధి ఉన్నవాళ్లైనా దీర్ఘకాలిక పరిణామాలను, పర్యవసానాల గురించి ఆలోచిస్తారు. ఆ బుద్ధి కొరవడడంవల్ల మనం పెద్ద గోతిలో పడిపోయాం.
ప్రపంచీకరణ, నూతన ఆర్థిక విధానం చిన్న కమతాలకు పనికి రాదు. వాణి జ్య పంటలు వేయడానికి పెట్టుబడి కావాలి. పెట్టుబడి అంటే అప్పు చేయవచ్చు. కానీ నీళ్లను ఎలా సృష్టిస్తారు. భూగర్భ జలాల మీద ఆధారపడ్డవాళ్లు గుర్తించుకోవలసింది, భూగర్భంలో నీళ్లేమీ నిలువ ఉండవు. ప్రతి సంవత్సరం పడే వర్షపు నీళ్లే భూమిలోకి ఇమిడి భూమి లోపల నిలువ ఉంటాయి. వర్షపాతం చాలా తక్కువగా ఉన్న పాలమూరు జిల్లా లాంటి ప్రదేశాలు, భూమి నుంచి బోరుల ద్వారా భూమిలో ఇమిడిన నీళ్లకంటే ఎక్కువ వాడడం వల్ల, నీళ్లు తగ్గి సంక్షోభం పెరిగింది. ఇలాంటి ప్రాంతాల్లో నూతన ఆర్థిక విధానం ప్రవేశపెట్టిన వ్యవసాయ పద్ధతుల తీవ్రతకు తట్టుకోలేక రెండు లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది మనకు ప్రత్యక్షంగా కనిపించిన సామ్రాజ్యవాద యుద్ధం. దేశాలనన్నింటిని తమ సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడేవిగా చేసే ‘కువూట’లో ఇదొక భాగం.
హరిత విప్లవం, నూతన ఆర్థిక విధానాల వల్ల జరిగిన ప్రమాదం నుంచి ఇప్పు డు బయట పడడం అంత సులభం కాదు. ఈ దేశం లో విప్లవం విజయవంతమైనా, ఆ పాలనకు కూడా ఇది చాలా పెద్ద సవాలే. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే నదీ జలాలను న్యాయబద్ధంగా పంచాలి. నదులు లేని ప్రాంతాల గతి ఏమిటి అంటే, అది ఒక భిన్న సమస్య. కాని నీళ్లు సమృద్ధిగా కృష్ణానదిలో దాని ఉప నదుల్లో పారుతున్న పాలమూరుకు నీళ్లు లేకపోవడం ఎంత పెద్ద విషాదం. అందుకే పాలమూరు ప్రజలకు నదీ జలాల్లో తమ వాటా అడగడం తప్ప వేరే గత్యంతరం లేదు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు పట్టించుకోనప్పుడు ప్రజా ఉద్యమాలే పరిష్కారాన్ని సాధిస్తాయి.
పాలమూరులో చాలా చైతన్యవంతమైన ఆ ఉపాధ్యాయ వర్గం, అలాగే భిన్న ప్రజా సంఘాలున్నాయి. ప్రజల హక్కుల కోసం ప్రాణాలిచ్చిన పురుషోత్తం, కనకాచారి, మునెప్ప లాంటి వాళ్లను పాలమూరు జిల్లా కని పెంచింది. చైతన్యం పెరుగుతున్న దశలో పాలకులు, పోలీసు యంత్రాంగం విపరీతమైన అణచివేతకు పాల్పడింది. మనసున్న ఏ మని షి అయినా పాలమూరు సమస్యలకు కదిలిపోతా రు. నారాయణపేటలో మేం ఒక ధర్నా కార్యక్షికమం నిర్వహిస్తే అక్కడ పనిచేస్తున్న ఆర్డీవో (నా విద్యార్థి) మాతో పాటు టెంటులో కూర్చుంది. వృత్తిపరమైన సమస్యలుంటాయి అని నేనంటే, పాలమూరు సమస్యలను చూసిన ఎవ్వరైనా ఇలా కూర్చోవలసిందే అన్నది.
ఈ నెల 15,16 తేదీలలో పాలమూరు ప్రజల ఉద్యమాల కొనసాగింపుగా, పాలమూరు అధ్యయన వేదిక 30 గంటల పాలమూరు జల సాధన దీక్ష శిబిరా న్ని నిర్వహిస్తున్నది. దీనిలో ప్రముఖులు, పాలమూరు అవస్థను చూసిన చుక్కా రామయ్య, రాంచంవూదమూర్తి, పొత్తూరి వెంక లాంటి వాళ్లే కాక, కవు లు, కళాకారులు పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహిస్తు న్న కోదండరాం వస్తారు. పాలమూరు నీటి సమస్య తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రధానమైన అంశంగా మారాలి. మరోసారి చెప్పాలంటే కరువు కాటకాలున్న ప్రాంతానికి ప్రజా చైతన్యమే పరిష్కార మార్గం. పాలమూరు భవిష్యత్ స్వప్నాన్ని నీళ్లు పోసి పెంచేలా అందరం కృషి చేద్దాం.
మళ్లీ నిషేధ రాజకీయాలు (23-8-2012)
మన రాష్ట్రంలో రెవల్యూషనరీ డెమొక్షికాటిక్ సంస్థ (ఆర్డీఎఫ్)ను నిషేధించడం తొందరపాటు చర్యే. రాజకీయ విశ్వాసాలను, ఆ విశ్వాసాలున్న సంస్థలను నిషేధించడం మన రాష్ట్రానికి కొత్తేమీ కాదు. విప్లవ ఉద్యమాలు ముందుకు తీసుకవచ్చిన మౌలిక ప్రజా సమస్యలను పరిష్కరించలేని రాజకీయ వ్యవస్థ, ఆ మౌలిక సమస్యలను లేవనెత్తుతున్న రాజకీయాలను నిషేధించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. విప్లవ పార్టీలనే కాక పార్టీల పట్ల సానుభూతి కలిగిన సంస్థలను, వాటికి ఫ్రంట్ ఆర్గనైజేషన్ అని పేరుపెట్టి, వాటి సాహిత్యాన్ని, పుస్తకాలను నిషేధించే ఒక అప్రజాస్వామిక సంస్కృతి రాష్ట్రంలో ఉంది. నిషేధ రాజకీయాలు భూస్వామ్య, వలసవాద పద్ధతులు. ఇలాంటి పద్ధతులకు వ్యతిరేకంగా స్వాతంవూత్యోద్యమం నడవడం వల్ల ఆ ఉద్యమంలో ముందుకు వచ్చిన ప్రజాస్వామ్య ఆకాంక్షల వెలుగులో భారత రాజ్యాంగం రూపొందించబడింది. దాదాపు రెండున్నర సంవత్సరా ల కాలం మేధోమథనం చేసి అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ రూపకల్పన జరిగింది.
స్వతంత్ర దేశంలో ప్రజలే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటార ని, ప్రజలు స్వేచ్ఛగా స్వతంవూతంగా తమ సమస్యలు చెప్పుకోవచ్చని, సంఘటితంగా సంఘాలు పెట్టుకోవచ్చని, ఉద్యమాలు చేపట్టవచ్చని రాజ్యాంగం హామీ ఇచ్చి, హక్కులు కల్పించింది. భావ ప్రకటన స్వేచ్ఛకు దాదాపు మూడు శతాబ్దాల చరిత్ర ఉంది. సోక్రటీస్, జీసస్, గెలీలియో కోపర్నికస్, భ్రూనోల సాహసం నుంచి, లక్షలాది ప్రజల పోరాటాల నుంచి భావ ప్రకటనా స్వేచ్ఛ ఒక వ్యవస్థీకృతమైన ప్రజాస్వామ్య విలువగా మానవ చైతన్యం లో భాగమైంది. పైన ఉదహరించిన సాహసవంతులు తమ స్వేచ్ఛ కోసం, తాము నమ్మిన విశ్వాసాల కోసం, తాము సత్యమనుకొని నమ్మిన సత్యాన్ని అప్పటి పాలకవర్గాలకు కంటగింపుగా ఉన్నా ప్రపంచానికి చాటారు. ఈ అంశం మీద నేను చాలా సందర్భాల్లో పేర్కొన్న జేఎస్ మిల్ స్వేచ్ఛ మీద రాసిన గ్రంథం ప్రామాణికం గా పరిగణింపబడుతున్నది. మానవాళి సత్యాన్వేషణలో ఉన్నప్పుడు ఎలాంటి భావాలను నిరోధించినా అది మానవ నాగరికత పరిణామ క్రమానికి ప్రమాదమని స్వేచ్ఛా సిద్ధాంతం భావిస్తుంది.
స్వాతంవూత్యోద్యమ కాలంలో మన దేశంలో ఈ విలువ చాలా ప్రసవవేదన తర్వాతే పుట్టిం ది. గాంధీ రాసిన ‘హింద్ స్వరాజ్’ను అప్ప టి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. అలాగే రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఉద్యమమే జరిగింది. ఈ కాలంలోనే భిన్న భావాలు ముందుకు వచ్చాయి. మార్క్సి స్టు సిద్ధాంతం, ఎంఎన్ రాయ్, లోహియా, డాక్టర్ అంబేద్కర్, జయవూపకాశ్ నారాయణ, అలాగే హిందూమత ఛాందసత్వానికి చెందిన సావర్కర్, గోల్వాల్కర్ రచనలు కూడా వచ్చాయి. మనం అన్ని భావాలతో ఏకీభవించకపోవచ్చు. కానీ ఆ భావా లు చెప్పే స్వేచ్ఛ వాళ్లకుండాలి. అంతిమంగా ప్రజలు ముఖ్యంగా శ్రామిక జనం దేన్ని విశ్వసించి పోరాడితే ఆ విలువలు సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి. ఈ మొత్తం వారసత్వం ఏమైంది? ఎక్కడ మునిగిపోయిందో అడగవలసిన అగత్యం ఏర్పడింది.
మన రాష్ట్రంలో నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి నిషేధ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే నక్సల్బరి పోరాటాన్ని పాలకులు ఎప్పు డూ ఇది కేవలం శాంతి భద్రతల సమస్య అని భావించలేదు. పాలించే వాళ్ల కు దీని మూలాలు ఎక్కడ ఉన్నాయో అని తెలియక కాదు. అది వాళ్లకు పూర్తి గా తెలుసు కాబట్టే ఇంత భయం. సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానత ల నుంచి, అణచివేత నుంచి ఈ ఉద్యమాలు పుట్టాయని ఏలిన వారికి తెలు సు. తెలిస్తే అసమానతలు తగ్గించవచ్చు కదా, భూమిని పంపిణీ చేయవచ్చు కదా, ఆదివాసీల హక్కులను గుర్తించి, రాజ్యాంగ స్ఫూర్తితో వాళ్ల వనరులు వాళ్లకే దక్కేలా చూడవచ్చు కదా. ఇది చేయడం స్వప్రయోజన పరులకు ఇష్టం ఉండదు. అశాంతిమయమైన హింసా ప్రపంచంలో అభవూదతతోనైనా జీవిస్తారు. కానీ కొన్ని ప్రయోజనాలనైనా వదులుకొని ఒక సజీవ శాంతియు త సమాజంలో జీవించాలనే స్పృహ వాళ్లకుండదు. విపరీతమైన ఆస్తికాంక్ష, లాభాల వేటలో ఉండే వాళ్లలోని మనిషి మాయమైపోయి ఉంటాడు. అందు కే వాళ్లు బలవూపయోగాన్ని, హింసను కోరుకుంటారు. హింసద్వారా ప్రజల ఆకాంక్షలను అణచివేయాలనుకుంటారు. అక్కడే ఆగరు. ఆ ఆలోచనలనే తుంచి వేయాలనుకుంటారు.
నిజాయితీగా ప్రశ్నలడిగే వారు చాలా భయంకరంగా కనిపిస్తారు. రోజు వాస్తవాలను వక్రీకరించే మీడియాను సృష్టించుకుంటారు.వాళ్లు రోజూ ప్రచారం చేస్తున్న సమాచారం నిజమని భ్రమింప చూస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా , అంతిమంగా మనిషి తన సామాజిక అనుభవం నుంచి వాస్తవాలను గ్రహిస్తాడు. ఆ అనుభవపు వెలుగులో ముందుకుపోతుంటాడు. ఆలోచనలను, భావాలను, సంస్థలను నిషేధించ డం వల్ల మార్క్స్ అన్నట్లు.. అవి పాలకులు ఆశించిన ప్రయోజనాలకు భిన్నంగా మనిషి చైతన్యాన్ని మరింత పదును చేస్తాయి. ఒక పుస్తకాన్ని నిషేధించడం వల్ల ఆ పుస్తకం చదవాలి అనే ఆసక్తి పెరుగుతుంది. ఒక సంస్థను నిషేధిస్తే, ఆ సంస్థ గురించి పట్టించుకోని వారు కూడా ఈ సంస్థను ఎందుకు నిషేధించారు అని చర్చించుకుంటారు. నిషేధాలు ఎప్పుడూ పాలకుల ప్రయోజనాలకు వ్యతిరేకంగానే పనిచేస్తాయి.
మన రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు రాజకీయాలను ప్రవేశపెట్టిన వారిలో వెంగళ్రావు ఆద్యుడు. ఆ రోజుల్లో సమర్థవంతమైన ముఖ్యమంత్రి అని చాలా ప్రచారం చేశారు. ఎన్కౌంటర్లను ప్రోత్సహిస్తే పాలక వర్గాలు సంబరపడ్డాయి. ఆయన అణచాలన్న రాజకీయాలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నా యి. అది దేశ భద్రతకే పెద్ద ముప్పు అని భావించేదాకా ఎదిగాయి. కానీ వెంగళ్రావును ఎవరు గుర్తు పెట్టుకున్నారో మనకు తెలియదు. ఆణచివేతను కొనసాగించినా, రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చినందుకు ఎన్టీఆర్‌ను గుర్తుపెట్టుకున్నారు. కొంచెం వెసులుబాటు కల్పించినా జ్ఞాపకం పెట్టుకునే ఈ ప్రజల మీద దాడులు అణచివేతలు చేయడం పాలకుల అజ్ఞానం.
మన రాష్ట్రంలో నక్సలైట్ పార్టీలకు, ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు జరిగాయని ప్రభుత్వం మరిచిపోయినా, ప్రజలకు గుర్తుండే ఉంటుంది. ఇది ‘పౌర సమాజం’ చొరవ మీద ఏడు, ఎనిమిది ఏళ్ల నిరంతర కృషి మేరకు జరిగింది. అడవి నుంచి అగ్రనాయకులు హైదరాబాద్‌లో ప్రభుత్వ అతిథులుగా ఉండి, కొన్ని మౌలికమైన అంశాలను చర్చకు పెట్టారు. అందులో ముఖ్యంగా ప్రజాస్వామిక హక్కుల మీద చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. రాజకీయాలను, విశ్వాసాలను ప్రచారం చేసుకునే హక్కు పరిధి పెంచాలని, పాలకులు తాము రాసుకున్న రాజ్యాంగాన్నైనా గౌరవించాలని, ఆ హక్కులు ప్రజలు అనుభవించాలంటే ఒక రాజకీయ పరిస్థితిని కల్పించాలని డిమాండ్ చేశారు. పౌరస్పందన వేదిక ప్రజాస్వామ్యచోటు పరిధి పెరిగితే హింస తగ్గుతుందని చాలా బలంగా విశ్వసించి అంత పెద్ద ప్రయత్నం చేసింది. ఇంత పెద్ద ప్రయోగం జరిగిన రాష్ట్రంలో మళ్లీ రెవల్యూషనరీ డెమోక్షికటిక్ ఫ్రంట్ లాంటి జాతీయ జాతీ య సంస్థను ఏపీ పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ కింద నిషేధించడమేమిటి? ఇప్పుడు మన రాష్ట్రంలో అంత బలమైన నక్సలైట్ ఉద్య మం లేదు కదా, నక్సలైట్లు అభివృద్ధికి ఆటంకం అని ప్రచారం చేసిన వారు, ఇప్పుడు తాము పదేపదే చెబుతున్న అభివృద్ధిని చేపట్టవచ్చుకదా! ఆర్డీఎఫ్ లాంటి ప్రజాస్వామిక సంస్థ ముందుకు తెచ్చిన వాదనలకు జవాబు చెప్పవచ్చు కదా.
మన రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమం పూర్తిగా సమసిపోయింది అని కేంద్ర హోం మంవూతికి చెబుతున్నా మన ప్రభుత్వానికి కొందరు కవులు, రచయితలు, ప్రజాస్వామికవాదులు నిరాయుధంగా రాజకీయా లు మాట్లాడుతుంటే అంత భయమెందు కు? ఉద్యమం మళ్లీ పుంజుకోవచ్చు అని అనుకుంటే అది మళ్లీ రావలసిన అవసరం లేని పరిస్థితులు కల్పించవచ్చుకదా. నిషే ధం ప్రజల అవసరాలకు, అంతరాలకు జవాబు ఎలా అవుతుంది. ప్రపంచీకరణ సామ్రాజ్యవాద ప్రేరిత అభివృద్ధి నమూనాను అమలు చేసినంత కాలం ఉద్యమాలు ఏదో రూపంలో జరుగుతూనే ఉంటాయి. అమెరికాలో వాల్‌స్ట్రీట్ ఆక్రమించుకోండి అన్న ఉద్యమం వెనక ఏ నక్సలైట్లు ఉన్నారు? అది శాంతియుత పోరాటం అని భావిస్తే, అమెరికాలో ప్రతి పౌరుడి దగ్గర ఆయుధముంది. వాళ్ల రాజ్యాంగంలోనే ఆయుధాన్ని కలిగి ఉండే హక్కును రాసుకున్నారు. అమెరికన్ ప్రజల సహనం నశిస్తే, అది సాయుధ పోరాటం గా మారడానికి ఎక్కువ సమయం పట్టదు.
నిజానికి ఆర్డీఎఫ్ మన రాష్ట్రం లో గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా ఒక సభ జరిపింది. సభలో మాలాంటి వాళ్లం పాల్గొన్నాం. ఛత్తీస్‌గఢ్‌లో కలెక్టర్ అపహరణ సందర్భంలో ఈ దుర్మార్గాన్ని గురించి అడిగితే అక్కడి ముఖ్యమంత్రి గ్రీన్‌హంట్ అనేటువంటి చర్య తమ రాష్ట్రంలో లేనేలేదని అన్నాడు. లేకపోతే దాని గురించి మాట్లాడేవారి విశ్వసనీయత దెబ్బతింటుంది కదా. ఆర్డీఎఫ్ అలాంటి సభ ఒకటి ఢిల్లీలో పోలీసుల అనుమతితో పార్లమెంటు స్ట్రీట్‌లో పెట్టింది. ఆ సభ కు హాజరైన వారిలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, ప్రజాస్వామికవాదులు, అలాగే న్యాయమూర్తి రాజేంద్ర సచార్ మాట్లాడారు. ఇంత పారదర్శకంగా పాలకులు అంటున్న ప్రజాస్వామ్య గొడుగు కింద పనిచేస్తున్న సంస్థను నిషేధించడమనేది చరివూతకు వ్యతిరేకంగా ప్రయాణించడమే. ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం ఒక రాజకీయ స్పృహతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని, అలా ఒత్తిడి తేవడానికి తెలంగాణ కోసం పోరాడుతున్న రాజకీయ శక్తులు కూడా కృషి చేస్తాయని ఆశిద్దాం.
పొంగి పొరలిన తెలంగాణ ప్రజాచైతన్యం (15-8-2012)
అల్లం సోదరులకు కన్నతల్లి జన్మనిస్తే, కరీంనగర్ పోరాటాలు మరో జన్మనిచ్చాయి. ముగ్గురు సోదరులు (రాజయ్య, వీరయ్య, నారాయణ) సృష్టించిన సాహిత్యము, చేసిన విశ్లేషణ తెలంగాణ చైతన్యంలో అంతర్లీనంగా ఉండడమేగాక పరిణామక్షికమంలో అవి తమవంతు చారివూతక పాత్రను నిర్వహిస్తున్నాయి.నూతన సామాజిక సంబంధాలు ఏర్పడేదాకా ఆ సాహిత్యం అలా సజీవంగానే ఉంటుంది. చాలా ఇతర సందర్భాల్లో నేను పంచుకున్న ఫీలింగ్స్‌లో వ్యక్తులు సామాజిక చైతన్యాన్ని ఎంత ప్రభావితం చేస్తారో, సామూహిక చైతన్యం వ్యక్తులను ఎలా మలుచుకుంటుందో నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు కాని- వ్యక్తుల ప్రభావం సామాజిక చైతన్యీకరణ పైనా ఉంటుంది అని అంగీకరిస్తే, ఈ ముగ్గురు సోదరులు నిర్వహించిన పాత్ర నిస్సందేహంగా గొప్పదే.అల్లం రాజయ్య కథ-నవలల్లోనూ, అల్లం వీరయ్య గేయ సాహిత్యంలోనూ, నారాయణ కవిత్వం-రాజకీయ విశ్లేషణల్లోనూ.. ఇలా భిన్నవ్యక్తిత్వాలకి తగ్గట్టుగా భిన్నమైన సాహిత్య ప్రక్రియలు ఎన్నుకున్నారు. నారాయణ స్వయంగా ఆయుధం పట్టుకుని ప్రత్యక్షంగా ఉద్యమాలలో పాల్గొన్నవాడూ, రాజ్యహింసను అనుభవించిన వాడు. ఆయన వ్యాసాలు చదువుతుంటే, ఒక కవికుండే సున్నితమైన మనస్తత్వంతో కవిత్వమో వచనమో తేల్చుకోవడం సాహిత్యంతో గాఢ పరిచయం లేని నాలాంటి వాడికి కష్టంగానే ఉంటుంది. ప్రతి వ్యాసాన్ని- ఒకసారి దాని పొయటిక్ బ్యూటీకి, పొంగిపొరలిన ఆవేశం కొరకు.. మరోసారి విశ్లేషణ కొరకు చదివాను.నారాయణ చేతిలో భాష భావాలకి తగ్గట్టుగా ఒదిగిపోయింది. భాష ఆయన చెప్పినట్లు వినడం తప్ప ఆయన రచనకు ఎక్కడా పరిమితి కాలేదు, ప్రతిబంధకం కాలేదు. చదివేవాళ్లకి ఇలాంటి సుసంపన్నమైన భాషాజ్ఞానం మనక్కూడా వుంటే ఎంత బావుండునో అనిపిస్తుంది.ఈ వ్యాసాలు చాలా అంశాలనే చర్చించాయి. కానీ మూడో నాలుగో అంశాలు చాలా ప్రధానంగా ఆలోచనలని కుదిపి, అంతరంగానికి తగిలి కదిలించేలా ఉన్నాయి.
ప్రజాఉద్యమాలు, విప్లవ పోరాటాలు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం.. ప్రపంచీకరణ దుర్మార్గం.. అరుదైన కొందరు వ్యక్తుల పాత్రపై నారాయణ అంచనా - ఈ కోవలోకి వస్తాయి. తన గ్రామం గురించి, తన అనుభవాల గురించి వ్రాసిన జ్ఞాపకాలలో ఒక రకమైన నోస్టాల్జియా కనిపిస్తుంది. విప్లవోద్యమాల గురించిన రచనల్లో ఇంద్ర దగ్గర ప్రారంభించి సమకాలీన విప్లవ ఉద్యమాన్ని కూడా స్పృశించినా, ఆయన ఇంకా రాయవల్సింది మిగిలే ఉందనిపిస్తుంది. ఇందు లో ఆరుట్ల జ్ఞాపకాలు దానితో ముడిపడిన త్యాగాల చరివూతను గుర్తుచేస్తాయి. అలాగే సమ్మక్క సారక్కల తిరుగుబాటు దాని విశిష్టతలను, తెలంగాణ పోరాట వారసత్వాన్ని ‘జనవనం మనాది’ గుర్తుచేస్తుంది. సెప్టెంబర్ 17 మీద వ్యాసం కనువిప్పు కలిగించేలా ఉంది. చరివూతలో ఒక సంఘటనని ఎలా చూడాలో, ఏ కోణం నుంచి పరిశీలించాలో ఆ వ్యాసం చదివితే తెలుస్తుంది. ఉద్యమ విశిష్టతలే కాక, దాని పెదధోరణులను- విభేదాలను, స్వార్థాన్ని, స్వప్రయోజనాన్ని, ‘అహం’వూపభావాన్ని- అంతే నిజాయితీగా ఎత్తిచూపాడు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పట్ల నారాయణకుండే కన్సర్న్, కమిట్మెంట్ అత్యంత బలంగా, ఆవేశపూరితంగా ఈ రచనల్లో కనిపిస్తాయి.నిజానికి ప్రధాన స్రవంతిగా ప్రవహించిన ప్రాణహిత అదే. దీంట్లో తెలంగాణలో జరుగుతున్న విధ్వంసం, తెలంగాణ మీద జరిగిన అణచివేత, దోపిడీ, అంతర్గత సామాజిక సంబంధాలు.. ఇలా చాలా చాలా అంశాలున్నాయి. ఉదాహరణకు పాలమూరు జిల్లాలో బాలస్వామిని హత్య చేసిన పద్ధతి, ఇతర కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలు, అలాగే ‘కరువు అరిగోస’లో ఆ జిల్లా అనుభవిస్తున్న వేదనామయ జీవితాన్ని హృద్యంగా చెప్పాడు. తెలంగాణ అభివృద్ధి ఎంత సంక్షోభంలో ఉందో, దేవాదుల ప్రాజెక్టు ఒక మృగతృష్ణగా ఎలా మారిందో వివరించాడు. తెలంగాణ ఉద్యమాన్ని భిన్నకోణాల నుండి చూసే పెద్ద కృషి ఉంది- కొన్ని వ్యాసాలు చాలా ఆవేశంతో రాసినవి, కొన్ని విపరీతమైన ఆవేదనతో రాసినవి, కొన్ని సమస్యల మూలాల్లోకి వెళ్లినవి.
ఈ ఉద్యమ క్రమంలో జరిగిన ఆత్మబలిదానాలు, వాటిని ఆపడానికి తన సృజనాత్మక శక్తినంతా ఉపయోగించి రాసిన మనసు కదిలించే వ్యాసాలున్నాయి. ఇక తెలంగాణ రాజకీయ నాయకుల మోసాలను, ద్రోహాన్ని, స్వార్థాన్ని, అవినీతిని,అబద్ధాలను, అవకాశవాదాన్ని, అమ్ముడుపోవడాన్ని ఉతికి పారేశాడు. ఇంతటి విమర్శనాత్మక వ్యాసాలు ఇంత సూటిగా, ఇంత వేడిగా వాడిగా ఇంతవరకూ ఎవరూ రాయలేదు. రాయలేక పోవచ్చుకూడా. ఇది ఒక రకంగా తెలంగాణను ప్రేమించిన ఒక ప్రతిభావంతమైన జర్నలిస్టు రాజకీయ నాయకులు చేసుకోవాల్సిన ‘ఆత్మవిమర్శ’ గురించి చేసిన శంఖారావం లాగుంది. మరీ నిస్సహాయంగా ఫీల్ అయినప్పుడు వ్యంగ్యంగా రాశాడు. అసహాయతని, ఆగ్రహాన్ని వ్యక్తీకరించే ఒక రచనా పద్ధతిగా వ్యంగ్యాన్ని వాడాడనిపిస్తుంది. ఈ వ్యాసాల్లో సోనియమ్మకు లేఖ, మిస్టర్ చీఫ్ మినిస్టర్ అంటూ రాజశేఖర్‌డ్డికి రాసిన లేఖ హైలైట్స్‌గా ఉన్నాయి.తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న ప్రపంచీకరణ సందర్భం కూడా చాలా ముఖ్యం. నారాయణకి స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం ఉంది. కాబట్టే, తెలంగాణను కేవలం అస్తిత్వానికీ పరిమితం చేయకుండా, దాని విస్తృతిని కూడా చూడగలిగాడు. ప్రపంచీకరణ చేస్తున్న విధ్వంసాన్ని సింగరేణి ఓపెన్ కాస్ట్‌ల మీద, రైతుల ఆత్మహత్యల మీద ఎలా ప్రతిఫలిస్తుందో చాలా ఆగ్రహంతో రాశాడు. అలాగే హైదరాబాద్ నగర జ్ఞాపకాలు రాస్తూ... పెరుగుతున్న రియల్ ఎస్టేట్ల వ్యాపారాన్ని, కాలుష్యంతో ముంచెత్తుతున్న నగర విధ్వంసక పారిక్షిశామిక విధానాలని నిరసిస్తూ ఎంతో హృదయవేదనతో రాశాడు. లోపిస్తున్న మానవీయ విలువల పట్ల కరుణతోనూ, కసిగానూ రాశాడు. ప్యారడైజ్లాస్ట్, ఆర్ట్స్ కాలేజీ జ్ఞాపకాల్లో ఈ ఆందోళన కనిపిస్తుంది. విశిష్ట వ్యక్తులుగా కాళోజీ, బాలగోపాల్ల గురించి రాస్తూ, వాళ్ల పట్ల నారాయణ తనకున్న గౌరవాన్ని బాగా వ్యక్తీకరించాడు. ‘ఇప్పుడు రక్షకుడు లేడు’ అని కాళోజీమీద, ‘మనకాలపు పరిపూర్ణ మానవుడు’ అని బాలగోపాల్ మీద రాసిన వ్యా సాల్లో శీర్షికనుంచి చివరి దాకా ఆ లోటుని, గౌరవాన్ని ఎంతో ఉన్నతంగా వ్యక్తీకరించాడు. అలాగే ‘పాటని బంధించడమా’అని గద్దర్ గురించి, ‘కన్నీటి కలత’ అని చుక్కారామయ్య గారి గురించి భావోద్వేగంతో రాశాడు. ప్రాణహితలో అల్లం నారాయణ వ్యక్తిత్వాన్ని, ఆయన ఆవేశ కావేశాలని మనం చూడడమే కాక, నడుస్తున్న చరివూతలోని ఒక సామాజిక, చారివూతక ఉద్యమ స్ఫూర్తిని కూడా చూస్తాం. వీటిని యాంత్రికంగా చదవలేరు. మనసు పెట్టి చదివితే నారాయణ ఆలోచనలతో, ఆగ్రహంతో, ఆవేదనతో.. కలిసో, కలబడుతూనో సాగవలసిందే. దేశవ్యాప్తంగా జర్నలిజం ప్రమాణాలు దిగజారుతూ, ఫాసిజంవైపు దేశం నెట్టబడుతున్న సందర్భంలో ఈ పుస్తకంతో తెలుగు జర్నలిజానికి నారాయణ అందించిన ప్రాణహితే కాదు, ప్రాణవాయువు కూడా.
(‘ప్రాణహిత’ పుస్తకానికి రాసిన ముందుమాట)
పోలీసు కుటుంబాల పోరాటం (9-8-2012)
‘మా లోని వాడివే, మా వాడివే నీవు పొట్టకూటి కొరకు పోలీసు అయ్యావు’ అని గద్దర్ పాడుతున్నప్పుడు పోలీస్ కానిస్టేబు ల్స్ చాలా ఆసక్తిగా పాట వినడమే కాక, మళ్లొకసారి పాడమని ఇతరుల ద్వారా అడిగించుకునేవారు. ఆ పాట వాళ్లను కదిలించడానికి కారణం వాళ్ల జీవిత అనుభవంపభుత్వ శాఖలన్నింటిలో నిచ్చెన మెట్లు ఉండ డం, పై అధికారి కింది అధికారుల మీద ఆధిపత్యం చెలాయించడం ఒక సహజమైన అంశంగా పరిగణిస్తుంటారు. ప్రభుత్వానికి అలాగే భిన్నమైన శాఖలకు ఒక లక్ష్యముంటుందని, దాని కోసం సమష్టిగా కృషి చేయడానికి మనుషులు ఒక్కచోట కలిసి పనిచేస్తున్నారనే స్పృహ లేకపోవడం ప్రభుత్వ పాలనా సంస్కృతిలో చాలా పెద్దలోపం. అందరూ మనుషులే అని వాళ్ల వాళ్ల అర్హతలను, అవకాశాలను బట్టి భిన్న స్థాయిలలో పని చేస్తుంటారని అంత మాత్రాన వాళ్లు మనుషులు కాకుండా పోరనే విషయాన్ని అధికారుల బుర్రలోకి ఎక్కించడం అంత సులభమైన పనేమి కాదు.
ఈ అమానవీయ సంస్కృతి అన్ని శాఖల కంటే పోలీస్ శాఖలో చాలా విస్తృతంగా ఉంది. బలవూపయోగమనేది ఒక అమానవీయ సంస్కృ తి. దాన్ని వ్యవస్థీకరించి, ఒక పద్ధతిగా ఆచరించడం వల్ల, శాఖలో అతి చిన్నస్థాయిలో పనిచేస్తున్న కానిస్టేబుల్స్‌ను నిరంతరంగా ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు వ్యతిరేకంగా వాడుకోవడం వల్ల పోలీసు యంత్రాంగం చాలా పెద్దఎత్తున అమానుషీకరణకు గురైంది. అయితే మనుషులు యాంత్రికంగా, అమానవీయంగా నిత్య జీవితంలో జీవించడం సాధ్యం కాదు. పోలీసు డ్యూటీలకు బయట వాళ్లకొక కుటుంబ జీవితముంటుం ది. వాళ్లకు స్నేహాలు, బంధువులు, పిల్లలుంటారు. ఈ సహజమైన మాన వ సంబంధాలకు పోలీసు శాఖలోని అసహజమైన సంబంధాలకు మధ్య ఒక నిరంతర ఘర్షణ ఉంటుంది. అయితే పై స్థాయిలో పనిచేసే అధికారులకు, అధికారం చెలాయించే వెసులుబాటే కాక, సౌకర్యాలు కూడా చాలా ఉంటాయి. వాళ్లలో కూడా చాలామంది అధికారులు అమానుషంగా మారినా కుటుంబాల వరకు కొంత వెసులుబాటు ఉంటుంది. ఈ వెసులుబాటులో ఒక భాగం ఆర్డర్లీ వ్యవస్థ. ఈ వ్యవస్థ మూలాలను బాని స సమాజంలో చూడవచ్చు.
మోహన్‌రావు స్పార్టకస్ పేర రాసిన ఖాకీ బతుకులు అన్న ఆత్మకథ ఒక అద్భుతమైన సాహిత్య ప్రయోగం. ఇది ఒక కానిస్టేబుల్ ఆత్మకథే కాక ఆయన తండ్రి జీవిత చరిత్ర కూడా. ఈ రచనలో ఒక ఆర్డర్లీ జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చిత్రీకరించాడు. ఇందులో ఒక వ్యవసాయకూలీ జీవితాన్ని ఆర్డర్లీ జీవితంతో పోలుస్తూ, ఈ రెండు పనులలో ఎందులో ఎక్కు వ ఆత్మగౌరవం ఉంటుందో అన్న చర్చ ఉంది. వ్యవసాయ కూలీ ఒక ఉత్పత్తిలో పాల్గొనడమే కాక ఆ ఒక్క పనే చేయవలసి ఉంటుంది. వచ్చే కూలీ చాలా తక్కువే అయినా పనిలో గౌరవముంది. ఒక ఆర్డర్లీ పిల్లల టాయిపూట్ కడగడం నుంచి బట్టలు ఉతికే లాంటి అన్ని ఇంటి పనులు చేయాలి. చేస్తున్న క్రమంలో ఆఫీసర్ల భార్య లు తిట్టే తిట్లు, అవమానాలు భరించాలి.
వీటిని భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామానికి తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించి, గ్రామానికి వెళ్తునే గ్రామంలో ఉండే మనుషుల దగ్గరి నుంచి అందరూ ఆయనను గౌరవంగానే చూస్తారు. ఈ ద్వంద్వ అనుభవాల మధ్య నిర్ణయం కష్టమవుతుంది. పోలీసు యంత్రాంగంలో చాలా అవసరాలుండే గ్రామ పాలకులు ఈ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం వల్ల పోలీసుల పట్ల కొంత జాగ్రత్తగా ప్రవర్తిస్తుంటారు. ఇక సాధారణ ప్రజలకు పోలీసులంటే చాలా భయమే. పోలీసు కానిస్టేబుల్స్ అందరికి ఈ అనుభవం ఉంటుం ది. పోలీసు అధికారుల, వాళ్ల భార్యల (వాళ్లను దొరసానులని కూడా పిలుస్తుంటారు) పట్ల చాలా ఆగ్రహం ఉంటుంది. కానీ పేదవారి కోపం పెదవికి చేటు అనుకొని, వాళ్ల కోపాన్ని సాధారణ ప్రజల మీద, వాళ్ల కుటుంబాల మీద ప్రకటిస్తుంటారు. చాలాకాలం కానిస్టేబుల్ కుటుంబాలకు తమ భర్తల ప్రవర్తనకు నిజమైన కారణాలు తెలియక వాళ్ల హింసను భరిస్తూ వచ్చారు. సమాజం పరిణామం చెందుతున్న క్రమంలో, చైతన్యం కూడా పెరుగుతుంది. బహుశా పోలీసు కుటుంబాలకు ఇప్పుడు కొంత స్పష్టత ఏర్పడడం వల్ల తమ భర్తల మీద ఆగ్రహం దానికి కారణమైన ఆఫీసర్ల మీదికి మళ్లింది.
ఒక ఐజీ స్థాయి అధికారి మీద దాడి చేయడమంటే సాధారణమైన విషయం కాదు. మనుషుల్లో సహనం ఒక స్థాయి వరకే ఉంటుంది. అది దాటితే తిరుగుబాటే మార్గం. థామస్ పేన్ హక్కుల మీద రాసిన పుస్తకంలో సహనం, అసహనానికి వ్యతిరేకం కాదంటూ, రెండు కూడా ఒకే పరిణామానికి దారి తీస్తాయని, నాణానికి ఇవి రెండు వైపులు అంటారు. ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగింది అదే.
ఈ ఉద్యమంలో పాల్గొన్న మహిళలు, పిల్లలు ‘మాకు న్యాయం కావా లి అని నినాదాలు ఇచ్చారు. న్యాయం అడిగినంత మాత్రాన వచ్చేది కాదు ఇచ్చేది కాదు. గున్నార్ మిర్డాల్ తన ‘ఏషియన్ డ్రామా’ పుస్తకంలో మానవ చరివూతలో మనుషుపూపుడూ తమకుండే ప్రివిలేజెస్‌ను అంత సులభంగా తమకు తాము వదులుకోరు అని అంటాడు. బాలగోపాల్ కూడా ఒక సందర్భంలో మనుషులకు తమకు లేనిదానికి కొట్లాడడం తెలుసుకాని ఉన్నదాన్ని వదులుకోవడం తెలియదు అన్నారు. పోలీసు అధికారులు అంత సులభంగా తమ ప్రవర్తనను మార్చుకుని కానిస్టేబుల్స్‌ను గౌరవంగా చూడడం కాని, వాళ్లకు కూడా కుటుంబాలున్నాయని కాని గుర్తించడం అంత సులభం కాదు. దానికంటే మించి వాళ్లు మానవీయంగా మారితే విచ్చలవిడి అధికారాన్ని చెలాయించడం సాధ్యం కాదు.
మన దేశంలో అవలంబిస్తున్న అభివృద్ధి నమూనా పుణ్యమా అని రాబోయే కాలమంతా పోరాటాల కాలమే. నమూనా మారేదాకా సమా జం ఊపిరి పీల్చుకుంటుందని అనుకోలేం. ప్రతిరోజు కొత్త సమస్యలను సృష్టించి మనుషులను ముప్పు తిప్పలు పెడితే కాని సామ్రాజ్యవాద దేశాలకు, వాళ్ల ఏజెంట్లకు లక్షల కోట్ల ఆదాయాలు రావు. పోరాటాలు జరిగినంత కాలం పోలీసు బలగాలను ఉపయోగిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ యంత్రాంగ అమానుషీకరణ అనివార్యంగా ఉంటుంది. శాంతి చర్చల సందర్భంలో నక్సలైట్ నాయకులు పోలీసుల సర్వీస్ నిబంధనల గురించి మాట్లాడితే పోలీసు ఆఫీసర్లు చాలా అభ్యంతరం చెప్పారు. అది మా అంతర్గత సమస్య అంటూ, బయటి వాళ్ల జోక్యం తాము ఒప్పుకోమని అన్నారు. వాళ్లు ఆర్డర్లీ వ్యవస్థ మీద ఉద్యమం చేసినప్పుడు దాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించినా, ఆఫీసర్లు ఆ నిర్ణయాన్ని పూర్తిగా అమలు చేయ డం లేదు. ఉద్యమ ప్రాంతాలలో కానిస్టేబుల్ స్థాయి వారి పరిస్థితి కొంత మెరుగు.
అధికారులు అంత దురుసుగా ప్రవర్తించరు. అయితే వాళ్లు తమ కుటుంబాలకు దూరంగా ఏళ్ల తరబడి జీవించవలసి ఉంటుంది. సెలవులు రెండేళ్లకు ఒకసారి ఇస్తారని, తమ కుటుంబం కోసమని, ముఖ్యం గా పిల్లల చదువుల కోసం తాము చాలా సుదూర ప్రాంతాలలో పని చేస్తున్నామని బస్తర్‌లో పనిచేస్తున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ అన్నారు. మొన్న ఛత్తీస్‌గఢ్ కిడ్నాప్ సందర్భం లో రెండుసార్లు సీఆర్పీఎఫ్ క్యాంపు లో ఉండవలసి వచ్చింది. అప్పుడు కానిస్టేబుల్స్ జీవితాల్ని దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. వాళ్లు అభవూదత వల్ల బయటికి వెళ్లరు. 24 గంటలు క్యాంపులోనే ఉండాలి. వాళ్లకు అక్కడ ఏ సౌకర్యాలు లేవు. ఒక గుడి మాత్రం కట్టారు. ఆ గుడిలో ఉదయం, సాయంత్రం గంటల తరబడి గొంతు చించుకునేలా భజన చేస్తారు. దేవుడు కూడా పోలీసు పాత్రను చాలా వరకు నిర్వహిస్తుంటాడు. దేవుడు అనే భావన లేకపోతే సమాజాన్ని నియంవూతించడం అంత సులభం కాదు. పోలీసుల పని మరింత క్లిష్టంగా మారుతుంది.
మొన్న జరిగిన పోలీసు కుటుంబాల పోరాట నేపథ్యం ఇది. ఒకవైపు కుటుంబం కోసమని, పిల్లల చదువు కోసమని విరామం లేకుండా పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు అండగా వారి కుటుంబాలు నిలబడి, తమ భర్తలను, తమ తండ్రులను మనుషులుగా చూడండి అనే పోరాటం చేయడం ప్రభుత్వానికి, పోలీస్ అధికారులకు ఒక కొత్త సవాల్. మనిషిని మనిషిగా చూడాలి అనే సుదీర్ఘ పోరాటంలో ఇదొక భాగం. సామాజిక సంబంధాలను సమక్షిగంగా చూసే దృక్పథాన్ని సమాజం, ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే ఈ కుటుంబాల పక్షాన నిలవడం సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్య సంస్కృతి పెరిగితేనే కానిస్టేబుళ్ల బతుకు కొంత మారే అవకాశముంది.
వెంటాడే విజయ్ జ్ఞాపకాలు (2-8-2012)
అలెక్స్ పాల్ మీనన్ అపహరణలో కీలకపాత్ర నిర్వహించిన మడకాం విజయ్ మరణించాడన్న వార్త విన్నప్పుడు ఒకేసారి చాలా జ్ఞాపకాలు తరుముకొని వచ్చాయి. రెండు నెలల క్రితమే ఆయనను కలిసిన జ్ఞాపకాలు, గంటల తరబడి ఆయనతో చేసిన చర్చలు, ఆయన ముందుకు తీసుకువచ్చిన వాదనలు, బీడీ శర్మ మడకాం వాద వివాదాలు. అన్నింటికి మించి ఆయన ఇక భౌతికంగా లేడు అనే విషయం జీర్ణించుకోవడం కష్టమే అనిపించింది. ఆయన బస్తర్ అడవిలో ఉద్యమం పనిమీద ట్రాక్టర్ నడుపుతూ ఒక మలుపు దగ్గర ట్రాక్టర్ ఒక చెట్టుకు ఢీకొని స్టీరింగ్ ఎదకు తగిలి స్పృహ కోల్పోయి రెండు రోజుల తర్వాత మరణించాడని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఉద్యమంలోనే ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరమై, ప్రజలతో మమేకమై ఒక ప్రత్యామ్నాయ సమాజం కోసం కలలుకనే వారు ఇలా మరణించడం పెద్ద విషాదం.
మడకాం విజయ్ చాలా దృఢకాయుడు. ఆరు అడుగుల ఎత్తు. ముఖం మీద ఒక పట్టుదల, ప్రవర్తనలో చాలా సీరియస్‌గా ఉండడం, తక్కువగా మాట్లాడడం ఆయన వ్యక్తిత్వంలో నేను గమనించిన అంశాలు. మేము ఆయనతో గడిపిన దాదాపు పదిగంటలలో ఒకే ఒక్కసారి చిరునవ్వును గమనించాను. అయితే మా సంభాషణలో అది చాలా కీలకమైన నవ్వు.
కలెక్టర్ అపహరణ అంశాన్ని పరిష్కరించడంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చాలా మొండి వైఖ రి తీసుకోవడంతో, పార్టీ నాయకత్వంతో కలిసి వాళ్ల డిమాండ్ల మీద చర్చించి, పార్టీ ఏమేరకు తమ డిమాండ్ల విషయంలో పట్టు సడలించగలదో, అలా గే ఏ డిమాండ్లు వాళ్ల దృష్టిలో ప్రధాన మో తెలుసుకోవడానికి పార్టీని ప్రత్యక్షంగా కలవడం జరిగింది. మేం బస్తర్‌లో పార్టీ నిర్ణయించిన ప్రదేశానికి చేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. సాయంత్రం చేరుకోవడం వల్ల ఆ రాత్రి ఆదివాసీల మధ్యే ఉండే అవకాశం కలిగింది. అయితే మొదటి దఫా చర్చలో సీనియర్ నాయకుడు కామ్రేడ్ గణేశ్‌తో జరిగాయి. సాయం త్రం ఏడు నుంచి రాత్రి పదకొండు వరకు జరిగిన చర్చల్లో మడకాం విజయ్ పాల్గొన్నా, ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. కేవలం జరుగుతున్న చర్చ వింటున్నా, ఆయన వాటిలో చాలా సీరియస్‌గా పాల్గొన్నట్లుగానే అనిపించింది.
మేము సాయంత్రం మూడు నాలుగు గంటల ప్రాంతంలో తాడిమెట్లకు చేరుకోగానే దారి వెంటే కాక సమావేశ స్థలంలో చాలామంది ఆదివాసీలు మా కోసం ఎదురుచూస్తూ, మాకు ఆహ్వానం పలికారు. తర్వాత ఛత్తీస్‌గఢ్ పోలీసులు, ముఖ్యంగా సల్వాజుడుం చేసిన దాడులను, అమానుషమైన హత్యలను తమ కళ్లముందే తమ కుటుంబ సభ్యులను ఎలా సజీవ దహనం చేశారో ఒక కుటుంబం తర్వాత మరొక కుటుంబం వాళ్ల భాషలో వివరిస్తున్నప్పుడు మడకాం విజయ్ ట్రాన్స్‌లేటర్ పాత్రను నిర్వహించాడు. ఆయన స్వయాన ఆదివాసీ కావడం వల్ల సల్వాజుడుం బాధితుల బాధను మాకు హిందీలో, మేము హిందీలో అడిగిన ప్రశ్నలను బాధితులకు వాళ్ల భాషలో వివరించాడు. ఈ పని చాలా ఓపికగా దాదాపు మూడు,నాలుగు గంటలు చేశాడు. ఎక్కడ తన సొంత అనుభవాన్ని కాని, తన సొంత వివరణను కాని చేర్చలేదు. సమయం తక్కువ ఉండడంతో అందరి బాధలను వినడం సాధ్యం కాదని మేం అన్నా, ఒకరి తర్వాత ఒకరు రావ డం ఆగలేదు. ఆయనే కలగజేసుకొని వాళ్లకు పరిస్థితి వివరించి వాళ్లందరి మీద జరిగిన దాడులకు సంబంధించిన వివరాలను మాకు అందజేయమని ఒప్పించి, వాళ్లను తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేసి పంపించాడు.
పార్టీ నాయకుడు గణేశ్‌తో చాలా సుదీర్ఘమైన చర్చే జరిగింది. మూడు, నాలుగు అంశాల మీద పార్టీ వైఖరి, మానుంచి తాము ఆశిస్తున్న పాత్ర గురిం చి చాలా స్పష్టంగానే వివరించాడు. మేము బయటి పరిస్థితి గురించి, ప్రభు త్వ మొండి వైఖరి గురించి, మధ్యవర్తులకుండే పరిమితుల గురించి వివరిం చాం. గణేశ్ తెలుగువాడైనా బీడీ శర్మ, విజయ్‌కి తెలుగు రాకపోవడం వల్ల మొత్తం సంభాషణ హిందీలో జరిగింది. చర్చలో విజయ్ ఎక్కడా జోక్యం చేసుకోవడంకాని, మాట్లాడడంకాని చేయలేదు. అది పార్టీ క్రమశిక్షణా, లేక అది ఆయన ప్రవర్తనా తెలియదు. అడవి నుంచి రాయ్‌పూర్ చేరుకున్న తర్వా త ప్రభుత్వానికి పార్టీ అభివూపాయాలను మేము వివరించడమే కాక రాత పూర్వకంగా కూడా ఇచ్చాం. ప్రభుత్వ మధ్యవర్తులు ముఖ్యమంవూతితో, క్యాబినెట్ సభ్యులతో గంటల తరబడి చర్చించి, ప్రభుత్వ వైఖరిని, తమ సొంత అభివూపాయాలతో జోడించి చెప్పుతూ, ఒక అత్యున్నత కమిటీని వేస్తామని, కలెక్టర్ విడుదల అయిన ఒక గంటలో కమిటీ పని ప్రారంభిస్తుందని, డిమాండ్లను ముఖ్యంగా ఆదివాసీల విడుదల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని అనడంతో, మేం చర్చల నుంచి వైదొలుగుతామని అన్నాం. చేయండి అది మీఇష్టం, తాము కూడా మధ్యవర్తులమేనని తాము వెళ్లిపోతామని అనడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. మొత్తం సమస్యను అలా మధ్యలో వదిలివేయడం ఎలా అనే విషయంలో మేం కొంత ఉదారంగా ఉన్నామేమో అనిపిస్తుంది. మొత్తంగా ఒక రాజీ ఫార్ములా చేసి బయటి పరిస్థితుల, పరిమితుల దృష్ట్యా కలెక్టర్‌ను వదిలివేయాలని విజ్ఞప్తి చేయడంతో పార్టీ దానికి అంగీకరించింది.
కలెక్టర్‌ను తీసుకపోవడానికి తమ మధ్యవర్తులే రావాలని పార్టీ కోరడంతో రెండవసారి మళ్లీ అడవికి వెళ్లవలసి వచ్చింది. ఈసారి కామ్రేడ్ గణేశ్ లేడు. కలెక్టర్‌ను అప్పగించే మొత్తం ప్రక్రియను కామ్రేడ్ విజయ్ నిర్వహించాడు. స్వయానా ఆదివాసీ కావడం వల్ల ఆదివాసీలు అనుభవించిన హింసను కళ్లా రా చూసిన వాడుగా, అపహరణలో కీలకపాత్ర వహించడం వల్ల మేం చేసిన విజ్ఞప్తి పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నాడు. ఆ అసంతృప్తి మాట్లాడినంత సేపు కనిపించింది. ఆయన దృష్టిలో మేం చర్చల నుంచి వైదొలిగితే బావుండేదని, కలెక్టర్‌ను విడుదల చేయాలనే విజ్ఞప్తి చేసి ఉండవలసింది కాదని అభివూపాయం వ్యక్తమైంది. చాలా ప్రశ్నలు అడిగాడు. ప్రతిఅంశాన్ని గురించి చాలా వివరంగా చెప్పిన తర్వాత, కలెక్టర్ అపహరణ నుంచి ఏం సాధించామో, ఆదివాసీలకు తాము ఏం సమాధానం చెప్పాలని సూటిగా అడిగాడు. దానికి మేం చాలా పెద్ద వివరణ ఇచ్చి బస్తర్ ఆదివాసీల సమస్యలు గత పది పన్నెండు రోజులుగా చర్చలోకి వచ్చాయని, ఆదివాసీల పట్ల పార్టీకుండే కమిట్మెంట్ సమాజానికి మరింత స్పష్టంగా అవగాహన అయ్యిందని, బస్తర్ ఆదివాసీల బాధల గురించి, వాళ్ల మీద జరిగిన హత్యాకాండ గురించి మేం బయటి ప్రపంచానికి తెలుపుతామని అని అన్నప్పుడు ఒక చిరునవ్వు నవ్వి, చేతిలో చేయి కలిపాడు.
ఈ చర్చ ముగిసిన తర్వాత కలెక్టర్ విడుదలకు మరికొంత సమయం ఉండడంతో, పార్టీ సిద్ధాంతం, ఆచరణ మీద నాకుండే ప్రశ్నలు, అనుమానాలు చర్చకు పెట్టాను.
దాంట్లో భాగంగా బస్తర్ ఉద్యమమైనా లేదా మొత్తం మావోయిస్టు ఉద్యమం కేవలం హింసాత్మకమైనదని, రాజ్యాధికారం తప్ప వీళ్లకు వేరే ఏ ఆలోచన లేదనే ప్రచారం బాగా జరిగిందని చెపుతూ మానవీయ విలువలు, నూతన సమాజం గురించిన చర్చ, విశాల సమాజానికుండే సంక్షోభానికి ప్రత్యామ్నాయ పరిష్కారాలు, మానవ విలువల పట్ల పార్టీకుండే వైఖరి మరింత స్పష్టంగా, సిద్ధాంతంతో ఆచరణలో వ్యక్తీకరింపబడాలనే మొత్తం చర్చను రికార్డు చేసుకున్నాడు. అది పార్టీ దృష్టికే తీసుకరావడానికే ఆ పని ఆయన చేస్తున్నాడని నాకు అనిపించింది. చేశాడో లేదో తెలియదు.
ఆ తర్వాత తాను కొంత కఠినంగా ప్రవర్తించానని దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని అంటూ పార్టీ విజ్ఞప్తి మేరకు మేం మధ్యవర్తుల బాధ్యత అంగీకరించినందుకు మాకు కృతజ్ఞతలు చెప్పాడు. మా ఇద్దరి సెల్ నంబర్లు తీసుకుని, ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా, ఆదివాసీల మీద హింస జరిగినా మాకు తెలియజేస్తానన్నాడు. అలాంటి కామ్రేడ్ విజయ్ ఇంత త్వరలో తానే ఒక అపాయకర పరిస్థితిలో పడతాడని, ఆ అపాయం గురించి చెప్పే అవకా శం ఆయనకే లేకపోవడం విషాదం. ఆదివాసీలలో పుట్టి, వాళ్ల మధ్య పెరి గి, ఒక నాయకుడిగా ఎదిగి, బస్తర్ ప్రజలను ముందుకు నడిపించగలిగిన ఒక ఆదివాసీ నాయకుడి గొంతు మళ్లీ వినిపించదన్న నిజాన్ని అంత సులభంగా జీర్ణించుకోలేం. చర్చల సందర్భంలో ఈసారి ప్రభుత్వం సాయుధ చర్యతో కలెక్టర్ విడుదలకు ప్రయత్నం చేసే ఒక ప్రమాదం కూడా ఉందని మాకు అనిపించిందని అన్నప్పుడు, చావుకు మేం ఎప్పుడూ భయపడలేదు అని అన్న మాట మరిచిపోలేని జ్ఞాపకం.
విజయమ్మ దండయాత్ర (26-7-2012)
విజయమ్మ సిరిసిల్ల ‘సాహస’ యాత్రకు స్పందించడం కొంత వ్యక్తిగత ఇబ్బందితో కూడుకున్న అంశమైనా,ఈ యాత్రకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడగవలసిన అవసరముంది. రాయలసీమ ముఠా రాజకీయాల గురించి కాని, లేక రాజశేఖర్‌డ్డి కుటుంబపరంగా వస్తున్న ఫ్యాక్షనిజం గురించి కాని, దానితో ముడిపడి ఉన్న హింస, మనుషులు ఒకరికొకరు నిర్దాక్షిణ్యంగా చంపుకోవడంపై కథలు కథలుగా చెప్పుకునే కథనాన్ని ఇక్కడ చర్చించడం లేదు. ఆంధ్రవూపదేశ్ పౌరహక్కుల సంఘం ఈ ఫ్యాక్షనిజాన్ని గురించి లోతుగానే పరిశీలించి ప్రచారం చేసింది. ప్రచారం చేసేప్పుడు బాలగోపాల్ చాలా పబ్లిక్ మీటింగ్‌లలో రాయలసీమ ప్రజలు ఫ్యాక్షనిజాన్ని, ఫ్యాక్షనిస్టులను అసహ్యించుకోవాలని పదేపదే చెప్పేవాడు. అసహ్యించుకోకపోతే దాని సాధికారత కొనసాగుతుందని, ప్రజలు ఆ విష వలయం నుంచి తప్పుకోలేరని చెప్పేవాడు.
ఈ మొత్తం హింసలో మహిళల ప్రత్యక్ష పాత్ర చాలా తక్కువ. కొన్ని సందర్భాల్లో మహాభారతంలో ద్రౌపది చేసిన ప్రతిజ్ఞలా మహిళలు చేశారని వినికిడి ఉంది. అయితే ఈ విషయాలు విజయమ్మకు పూర్తిగా తెలుసో లేదో తెలియదు. మొత్తంగా విజయమ్మ రాజశేఖర్‌డ్డి సతీమణిగా, జగన్మోహన్డ్డి తల్లిగా ఒక అనివార్య పరిస్థితిలో రాజకీయ జీవనంలోకి నెట్టబడింది. నిజానికి ఆమె కూతురు షర్మిలా బాగానే మాట్లాడుతుంది. ఆమెకు అవకాశమిస్తే నాయకురాలిగా ఎదిగే అవకాశముంది. కానీ ప్రియాంకగాంధీని ఎలా క్రియాశీల రాజకీయాల్లోకి రానివ్వడం లేదో ఈమె పట్ల కూడా అదే వైఖరి ఉంది. విజయమ్మ చెప్పిన మాటలు ఆమె తనయుడు వింటా డో లేదో కాని ఆయన సలహాల మేరకు ఆమె రాజకీయ పాత్రను నిర్వహిస్తున్నా రు. తల్లికి పిల్లల మీద సహజంగానే ప్రేమ ఉంటుంది. బైబిల్ ప్రకారం దారి తప్పిన వాడిమీద శ్రద్ధ ఎక్కువుంటుంది. కాని పరకాలలో కాని, సిరిసిల్లలో కాని పర్యటించేప్పుడు సమస్యలేమిటో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఆ సమస్యల పట్ల రాజశేఖర్‌డ్డి వైఖరి ఏముండేదో సరిగ్గా తెలియకపోతే సిరిసిల్లలో ఎందుకు అంత ప్రతిఘటన వచ్చిందో ఆమెకు పూర్తిగా అవగాహన కాకపోచ్చు.
ప్రభుత్వం తన ప్రయోజనం కోసమని, సమైక్యవాదాన్ని ఈ పద్ధతిలో తెలంగాణలో ప్రవేశపెట్టి, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షే లేదు అని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నది. పరకాలలో, సిరిసిల్లలో స్థానిక నాయకత్వాలకు ఇతర ప్రయోజనాలున్నా యి. ఈ రెండు పర్యటనలు తెలంగాణ గురించి వై.ఎస్.ఆర్. పార్టీ వైఖరి స్పష్టమై న ప్రకటన ఇప్పించలేకపోయాయి. ఈ మొత్తం రాజకీయ ప్రక్రియలో కొందరు తెలంగాణ నాయకులు ప్రజల ఆకాంక్షల ను కాదని ఇతర ప్రాంత నాయకత్వం మీద ఎంత ఆధారపడి ఉన్నారో మరొకసారి రుజువు అయ్యింది. తెలంగాణ ప్రజాస్వామ్య ఆకాంక్షను సమీకరించడంలో తెలంగాణ ఉద్యమం ఎంత సఫలమయ్యిందో, తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని ప్రభావితం చేయడంలో అంత విఫలమయ్యింది. ఉద్యమ ప్రజాస్వామ్య సంస్కృతికి ‘ప్రాతినిధ్యపు ప్రజాస్వామ్యా’నికి ఎంత అంతరమున్నదో మరోసారి స్పష్టమయ్యింది.
విజయమ్మ సిరిసిల్ల చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడానికి , వాళ్ల బాధలను అర్థం చేసుకోవడానికని వెళ్లామని అంటున్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్య సానుభూతితో పరిష్కారమయ్యే సమస్య కాదు. అది ఒక సామ్రాజ్యవాద ప్రేరిత అభివృద్ధి నమూనా అల్లిన విష వలయం. ఇది ఒక చేనేత కార్మికుల మీదే కాదు, దాదాపు అన్ని చేతి వృత్తులు అలా విధ్వంసం అయ్యాయి. సామ్రాజ్యవాద విషవలయం నుంచి చేనేత కార్మికులను కాపాడడానికి సానుభూతి సరిపోదు. అభివృద్ధి నమూనా మూలాలను ప్రశ్నించాలి. అలా ప్రశ్నించాలంటే బలమైన ప్రజా ఉద్యమం కావాలి. తెలంగాణ ఉద్యమానికి సామ్రాజ్యవాదం మీద స్పష్టమైన వైఖరి ఉన్నా లేకున్నా ప్రజా ఉద్యమంలో పాల్గొంటున్న ప్రజల ఆకాంక్షల వెనక అభివృద్ధి నమూనా మీద ఆగ్రహం ఉన్నదనేది చాలా స్పష్టం.
దానికి విజయమ్మ ఏం చేయగలరో తెలియదు.ఒక రాజకీయ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సిరిసిల్లకు వెళ్లి మాట్లాడే హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాలా వద్దా అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పవలసి ఉంది. సమాధానం కాకున్నా కనీసం చర్చించవలసిన అవసరం ఉంది. ఈ ప్రశ్న పరకాల ప్రభాకర్ పదే పదే అడుగుతున్నాడు. సమైక్యవాదాన్ని గురించి హైదరాబాద్‌లో మాట్లాడే హక్కు లేదా, పౌరహక్కుల ఉద్యమం ఈ మాట్లాడే స్వేచ్ఛను కాపాడాలి కదా అని నాతో వాదించాడు. నిజమే మాట్లాడే స్వేచ్ఛ అందరికి ఉండాలి. తెలంగాణవాదులకు ఆంధ్ర ప్రాంతంలో, సమైక్యవాదులకు తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే స్వేచ్ఛ ఉంటే బావుండేది.
కాని ప్రజాస్వామ్యం అంత పరిణితి చెందలేదు కదా. ఒక సందర్భంలో పాలమూరు కరువు మీద ఒకరోజు ధర్నా చేసి ఎన్నికలలో రాజకీయ నాయకులను పాలమూరు సమస్యలపై నిలదీయం డి అని ప్రజలకు చెప్పడానికి అనుమతి కోరితే ప్రభుత్వం దాన్ని తిరస్కరిస్తే బాలగోపాల్ హైకోర్టులో లంచ్‌మోషన్ మూవ్ చేసి కోర్టు నుంచి అనుమతి ఇప్పించాడు. తెలంగాణ ప్రజల నిరసనల మధ్య ఇంత పోలీసు రక్షణ కల్పించి విజయమ్మ మాట్లాడే హక్కును కాపాడిన ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ నుంచి తమ సమస్యలను చెప్పుకోవడానికి హైదరాబాద్ వస్తే అర్ధరాత్రి వాళ్లను, వాళ్లతో పాటు పౌరహక్కుల నాయకులను అరెస్టు చేసింది. ఛత్తీస్‌గఢ్ ఆదివాసీలకు మాట్లాడే హక్కు ఉందా లేదా అన్న ప్రశ్నకు మన రాష్ట్ర పోలీసులు మాట్లాడే స్వేచ్ఛ గురించి మాట్లాడే వాళ్లు జవాబు చెప్పాలి. వాళ్లు ఒకవేళ శాంతిభవూదతల సమస్య అని అంటే, విజయమ్మ యాత్ర శాంతియుతం గా, భద్రతగా జరిగిందా? ప్రభుత్వం పాటిం చే విలువలలో, ప్రమాణాలలో సార్వజనీనత, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏమాత్రం లేకపోవడం వల్లే రాజ్యాంగం కల్పించిన మాట్లాడే హక్కు ఇప్పుడు పోలీసుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది.
ఇక పులి రాజకీయ సంస్కృతి గురించి మాట్లాడితే చిట్టా చాలా విప్పవలసి ఉంటుంది. కడప లోపలి ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడాలంటే కడప దాటే మాట్లాడాలి. కడప లోపల అంతా గప్చిప్. ముఠాలుగా విడిపోయిన గ్రామాల్లో ఒక రాజకీయ పార్టీ మరొక ముఠా గ్రామానికి వెళ్లడం నిషేధం. అది ఉల్లంఘిస్తే మరణదండన కన్నా తక్కువ శిక్ష ఉండదు. ఈ అంశం మీద బహుశా మానవ హక్కుల వేదిక జయ శ్రీ కంటే ఎక్కువ ఎవరికి తెలిసి ఉండదు. ఆమెకు రాయడం, పబ్లిక్ లెక్చర్స్ ఇవ్వడం అలవాటులేకపోవడం వల్ల ప్రజాస్వామ్యానికే చాలా నష్టం జరిగింది. గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రజాస్వామిక హక్కు కోసం రాజీలేని సాహస పోరాటం జయశ్రీ చేస్తున్నది. జయశ్రీ విజయమ్మలా తిరిగితే రాజ్యం ఇంత రక్షణ కల్పిస్తుందా? ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది. కానీ పులి రాజకీయ నాయకులకు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే అర్హత లేదేమో అనిపిస్తుంది. విజయమ్మ జయశ్రీని కలిసి చర్చిస్తే కొంత ప్రయోజనకరంగా ఉండవచ్చు.
అయితే విజయమ్మ మహిళగా రాయలసీమ రాజకీయాలలో ఎదిగితే, బయటి అనుభవాన్ని నిశితంగా పరిశీలిస్తే, కడపలో ప్రజాస్వామ్య ఆచరణను గ్రామాలకు వెళ్లి పరిశీలిస్తే బహుశా ఆమెకు చాలా ఆశ్చర్యకరమైన, ఊహించని కొన్ని నిజాలు అర్థం కావచ్చు. దారితప్పిన తన కొడుకు భవిష్యత్తే కాకుండా లక్షలాది మంది పేద ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే రాయలసీమకు, కడపకు, ముఖ్యంగా పులి కొంత మేలు జరగవచ్చు. ఇలాంటి యాత్రలు ఏవైనా ప్రజల అభిమానం మధ్యన జరగాలి. కానీ పోలీసుల తుపాకుల రక్షణతో కాదు.
కిశోర్‌చంద్రదేవ్ పిల్లిమొగ్గ (12-7-2012)
కేంద్ర గిరిజన మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మారణకాండకు సరైన సమయంలో, సమస్య లోతుల్లోకి వెళ్లి అడిగిన ప్రశ్నలు, సలహాలను ఆహ్వానిస్తూ నేను వ్యాసం రాశా ను. తర్వాత ఒక బలమైన అనుమానమే కాక కొంత భయం కూడా వేసింది. ఈ విషయం మీద వీవీతో మాట్లాడుతూ ఈ మంత్రి నేను అలా అనలేదు పత్రికలు తప్పుగా రిపోర్టు చేశాయని అంటే రాసిన వ్యాసాన్ని ఎలా సమర్థించుకోవాలో అనే అనుమానం ఉంది అని అంటే, అలా అన్నా మనం ఆశ్చర్యపోవలసిందేమీ లేదు అని వీవీ అన్నారు. మంత్రి తానన్న మాటలను, వ్యాఖ్యలను వెనక్కితీసుకోకపోయినా, ఈమధ్యే ఛత్తీస్‌గఢ్ సంఘటనలో పోలీసుల ప్రవర్తన మీద స్పందిస్తూ, వాళ్లు అలాంటి పొరపాట్లు చేయకుండా ఆంధ్రవూపదేశ్‌లోని గ్రేహౌండ్స్ లాంటి లక్ష్యానికి అంకితమైన బలగాన్ని తయారు చేయాలని సూచన చేశారు. ఇది ఒక రకంగా నాలాంటి వాళ్లను నిరాశకు గురిచేసింది. లేకలేక ఒక మంత్రి ఒక సంఘటనకు ప్రజాస్వామ్యంగా స్పందించాడని కొంత సంతోషపడ్డా తాను అంతకుముందు లేవదీసిన చర్చకు ఈ సలహా ఎట్లా సరిపోతుందో అర్థం కావడం లేదు.ఆయన అడిగిన ప్రశ్న అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులకు అడవి మీద, ఖనిజ సంపద మీద హక్కు ఉంటుందని వాళ్ళ అనుమతి లేకుండా ఖనిజాలను బయటివాళ్లకు అప్పజెప్పకూడదని, అలాగే ఖనిజాలను దేశ ప్రయోజనాలకే ఉపయోగించాలని అంటూ, ‘గ్రేహౌండ్స్’ ఈ లక్ష్యాలను ఎలా సాధిస్తుందో, ఆ బలగాలు ఎలా ఉపయోగపడతాయో చెప్పవలసిన బాధ్యత ఉంది.
ఆంధ్రవూపదేశ్‌లో గ్రేహౌండ్స్ బలగాలు విజయాన్ని సాధించాయని, మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేశాయని దేశ వ్యాప్తం గా ప్రచారం జరుగుతోంది. దీంట్లో కొంత నిజమున్నా ఛత్తీస్‌గఢ్‌కు ఆంధ్రవూపదేశ్‌కు చాలా తేడా ఉంది. అయితే మావోయిస్టు పార్టీ ఈ రాష్ట్రంలో వెనక్కి తగ్గిన తర్వాత ఖనిజ సంపద దోపిడీ నిరాఘాటంగా సాగింది. లక్షల కోట్ల ఆస్తుల గురించి రాష్ట్రంలో చాలా చర్చ జరుగుతున్నది. ఈ కోట్ల రూపాయల సంపదలో ఖనిజాల నుంచి వచ్చిన లాభాలు, నల్లధనం, దాని నుంచి రాజ్యం మీద వాళ్లు చేస్తున్న సవారీ మన అనుభవంలోనే ఉంది. గ్రేహౌండ్స్ మావోయిస్టు ఉద్యమాన్ని అణచడానికి కొంతవరకు ఉపయోగపడిందేమో కానీ, ఈ కోట్ల సంపద దోపిడీని అది ఎలా ఆపగలదు? ఈ అక్రమ సంపదను రక్షించుకోవడానికి దోపిడీదారులు పెంచి పోషించిన మాఫియాను ఏం చేయగలరు? నేను ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తం గా పనిచేస్తున్న 160 మంది సీనియర్ పోలీస్ అధికారులకు లెక్చర్ ఇచ్చినప్పుడు మాఫియా పాత్రను, అది పెరిగిన విధానా న్ని విశ్లేషిస్తూ, ఈ మాఫియా దగ్గర ఆయుధాలున్నాయి, ఇది సంపూర్ణంగా చట్ట వ్యతిరేక మూక, వీళ్లకు రాజకీయ విశ్వాసాలులేవు. ఈ మాఫియా దాదాపు అన్ని లాభసాటి రంగాల్లో ఉంది. మహారాష్ట్రలో కిరోసిన్ మాఫియా జిల్లా కలెక్టర్‌ను సజీవంగా అంటుపెట్టింది. (దానికి కిరోసిన్‌నే ఉపయోగించి ఉంటారు) అలాగే మధ్యవూపదేశ్‌లో అనుకుంటా ఒక ఐపీఎస్ ఆఫీసర్‌పై నుంచి ట్రక్కు నడిపించి చం పారు.
అధికారులను బెదిరిస్తూ ఉంటారు. అలాగే దేశ వ్యాప్తంగా సమాచార హక్కు కోసం పోరాడుతున్న చాలామందిని హత్య చేశారు. సమాచార హక్కు కోసం పోరాడే వారు నిరాయుధులు, చట్టం మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నవారు. వాళ్లకు ఎలాంటి రక్షణ లేదు. ఇది ఛత్తీస్‌గఢ్‌లో శంకర్‌గుహ నియోగి లాంటి ఒక గొప్ప కార్మిక నాయకుడిని చంపినప్పుడే నియంవూతించవలసిన మూక. ఈ మాఫియాను ఎలా ఎదుర్కోవాలి? దానికి గ్రేహౌండ్స్ ఏం చేయగలవు అన్న సవాలు మనముందు ఉన్నది. దీనికి స్పందిస్తూ కొందరు పోలీసు అధికారులు ఈ మాఫియా తో పోరాడవచ్చు కదా అని అన్నారు. అంటే పోలీసు అధికారులకు కూడా మాఫియాను ఎలా నియంవూతించాలో అర్థం కావడంలేదు.
సమస్య మూలాలు ఖనిజ సంపద అక్రమ దోపిడీలో ఉందని, గిరిజనులకు పూర్తి హక్కులను ఇవ్వడమే పరిష్కారమని ఒకవైపు అంటూ రాజ్యహింసను సమర్థించడం, సమస్య ఒకటైతే పరిష్కారం హింసలో చూడడం, అధికారంలో ఉన్న వారికి సహజమేమో అనిపిస్తుంది. నిజానికి ఈరోజు మావోయిస్టు హింసకంటే కూడా వాళ్ల రాజకీయ విశ్వాసాలే వ్యవస్థను చాలా భయపెడుతున్నాయి. రాజకీయ విశ్వాసాలులేని ఏ హింసైనా చాలామందికి అంగీకారంగా ఉంది. నిజానికి గుజరాత్ మాన వ హననంలో హత్యలు, మానభంగాలు, చిన్న చిన్న పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపడానికి వ్యతిరేకంగా మేం పోరాటం చేశాం. పిల్లలను మావన కవచంగా మావోయిస్టులు ఉపయోగిస్తున్నారు అని మీడియా ఎంత ప్రచారం చేసినా, మొన్న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన హత్యాకాండ సందర్భంలో మావోయిస్టులు లేరని అందరూ అంగీకరిస్తున్నారు. ది హిందూ దిన పత్రిక, ఎన్డీటీవీ ఈ విషయాన్ని కొంత విస్తృతంగానే సమాజ దృష్టికి తీసుకొచ్చాయి. పిల్లలను మానవ కవచంగా వాడుతున్నారన్నది కనీసం ఈ సంఘటనలో లేదని అంటే దీన్ని ప్రచార అస్త్రంగా ఉపయోగించుకున్నారన్నది స్పష్టంగానే కనబడుతుంది.
మావోయిస్టు ఉద్యమం ఒక సైన్యాన్ని కలిగి ఉందని, వాళ్లు రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారని, ఇది చాలా భయంకరమైన అంశమని బీజేపీ చాలా పెద్ద ఎత్తున వాదిస్తున్నది. మావోయిస్టు పార్టీ కూడా ఈ అంశం మీద కొంచెం ఎక్కువగా మాట్లాడడం వల్ల విశాల ప్రజానీకంలో కూడా ఆ అభివూపాయం ఉంది. కానీ ఈ సమాజం చాలా అమానుషంగా మారుతున్నదని, మానవీయ విలువలు కాపాడుకోవలసిన ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలని చాలామందే కోరుకుంటున్నారు. సమాజంలోని వ్యవస్థీకృ త హింసను క్రమక్షికమంగా అర్థం చేసుకుంటున్నారు. హింస, ప్రతిహింసలు సామాజిక మార్పులో భాగం కావచ్చు కానీ, సమాజం తనను తాను మానవీ య సమాజంగా నిలుపుకోవడానికి చాలా పోరాటాలే చేయవలసి ఉంది. ఈ మానవీయ పోరాటాలలో మావోయిస్టు ఉద్యమం పాత్ర ఎంత ఉంటుందన్నది ఒక చారివూతక సవాలు. దాంట్లో వాళ్లు అంటున్న ప్రతిహింస పాత్ర గురిం చి చర్చ జరగవలసి ఉంది.
సమాజం హింస, ప్రతిహింస వలయంలో చిక్కుకొని విపరీతమైన ప్రాణనష్టం జరుగుతుందని, దీన్ని ఎలాగైనా నివారించాలనే లక్ష్యంతో మన రాష్ట్రం లో పౌర స్పందన వేదిక శంకరన్ ఆధ్వర్యంలో (మానవత్వం పరిమళించిన మంచి మనిషి) దాదాపు ఆరు, ఏడు సంవత్సరాల కృషి ఫలితంగా మావోయి స్టు పార్టీ, జనశక్తి నాయకులు ప్రభుత్వం తో చర్చించడానికి స్వయాన వచ్చా రు. చర్చల ఫలితమేమిటో తెలుగు సమాజానికి అనుభవపూర్వకంగా తెలుసు. ఈ విషయం కిశోర్ చంద్రదేవ్‌కు తప్పక తెలిసే ఉంటుంది. చర్చల సందర్భంలో ప్రజాస్వామిక హక్కులు, భూసంస్కరణలు వంటి సమస్యలు చర్చకు రావడంతో అక్ర మ సంపాదన అధినేతలు చర్చలను ఒక్క అడుగు ముందుకు పోనీయలేదు. ఇంత అనుభవం ఉండి, ప్రజల నుంచి ఎదిగి వచ్చిన కిశోర్ చంద్రదేవ్ ఆదివాసీల సమస్యకు గ్రేహౌండ్స్యే పరిష్కారం అనటం సరైంది కాదు. ఉత్తరాంవూధలో మావోయిస్టు ఉద్యమం ఉంటే లక్షింపేట ఊచకోత జరిగి ఉండేదా? ఆయన ఆదివాసీల సమస్యకు పరిష్కారం గ్రేహౌండ్స్యే అనడం చారివూతక విషాదం
బస్తర్‌లో ఏం జరుగుతోంది? (5-7-2012)
రెండు నెలల కిందట బస్తర్‌లో జరిగిన కలెక్టర్ అపహరణ సందర్భంలో ఆ ప్రాంతం, అక్కడి ఉద్యమాల గురించి దేశ వ్యాప్తంగా, అలాగే మీడియాలో కూడా చర్చ జరిగింది. కలెక్టర్‌ను కిడ్నాప్ చెయ్యడం ఎంతవరకు సమర్థనీయమని దేశంలోని చాలామంది మధ్యతరగతి విద్యావంతులు ప్రశ్నించారు. మీడియా, హిందూ లాంటి వార్తా పత్రికతో సహా రాజ్యం ఏ పరిస్థితుల్లో రాజీపడకూడదని ‘ఢీలా రాజ్యం’గా (Soft State) ప్రవర్తించకూడదని, ఇది ‘కఠినమైన రాజ్య’మనే సందేశం మావోయిస్టు పార్టీకి, ఇతర ప్రజలకు అర్థమయ్యేలా ప్రవర్తించాలని సలహాలు వచ్చాయి. ఈ కిడ్నాప్ ఉదంతాన్ని మీడియా తన టీఆర్ పీ రేటింగ్‌ను పెంచుకోవడానికి కొంత రసవత్తరంగానే నడిపించింది. ఇంతకి బస్తర్‌లో పరిస్థితి కిడ్నాప్‌ల దాకా ఎందుకు వచ్చిందని కాని, అక్కడ గిరిజనుల స్థితిగతులు ఎలా ఉన్నాయని కాని, రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేక హక్కులు గిరిజనులు అనుభవిస్తున్నారా లేదా అని కాని చర్చ జరగలేదు. అంతకుమించి మన్మోహన్ (ఇప్పుడు ఆయన ఆర్థిక మంత్రిత్వశాఖను కూడా నిర్వర్తిస్తున్నారు) చిదంబరం, కపిల్‌సిబాల్ ఒక్కొక్కరు అభివృద్ధి నమూనా మహాభిమానులు. వాళ్లు చెప్పే అభివృద్ధి ఎవరి కోసం? ఈ అభివృద్ధిలో బస్తర్ గిరిజనుల పాత్ర ఉందా? వాళ్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్న అడగడం మానేశారు.
రాజ్యాంగం గిరిజనులకు ఇచ్చిన హక్కులను పూర్తిగా కాలరాశారు. ఈ పరిస్థితే అందమైన, ఆహ్లాదకరమైన బస్తర్‌ను విపరీత సంక్షోభంలోకి నెట్టడంతో శాంతిని, ప్రకృతిని ప్రేమించే ఆదివాసీలు ఆయుధాలు పట్టుకోవలసి వచ్చింది. ఆయుధాలు పట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ప్రశ్న అడగడానికి మీడియా సాహసించడం లేదు. ఆ ప్రశ్న అడిగితే ఏ కార్పొరేటు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నా రో, ఆ కార్పొరేటు మూలాలు కదులుతాయన్నది మీడియాకు తెలుసు. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రశ్నలను అడగడమే కార్పొరేటు పక్షాన జవాబులు వచ్చేలా తయారు చేస్తారు. ఉదాహరణకు నాలుగు రోజుల కిందట బస్తర్‌లో జరిగిన మానవహననంలో 20మంది అమాయక గిరిజనులు హత్య గావించబడ్డారు. అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నా రు. ఈదేశంలోని మధ్యతరగతి మన సు ఎంత కరుడుగట్టినా, పసిపిల్లలు అంటే ఎక్కడో కొంచెం మానవ స్పందన మిగిలిందేమోనన్న అనుమానంతో మీడి యా మావోయిస్టులు పిల్లలను అడ్డుపెట్టుకోవడం ఎంత వరకు సబబు అనే ప్రశ్నను సంధించడం మొదలుపెట్టారు. నిజానికి బస్తర్‌లోని బీజాపూర్‌లో జరిగిన హత్యాకాండలో ఇది కీలకమైన ప్రశ్నేనా? మొత్తం సంఘటనలో మావోయిస్టులు అక్కడ లేరని గిరిజను లు భూమిపూజ పండుగ జరుపుకుంటున్నారని, సాయుధ బలగాలు తప్పుడు సమాచారం వలన అక్కడికి అర్ధరాత్రి చేరుకుని కాల్పులు జరిపారని హిందూ పత్రిక మూడు రోజులు వరుసగా వార్తలు రాస్తున్నా, స్వయాన కాంగ్రెస్ పార్టీ సభ్యులే నిజనిర్ధారణ కమిటీ వేసి, చిదంబరం పోలీసు చర్యలను సమర్థిస్తూ చేసిన ప్రకటనను ఖండిస్తూ ఒక ప్రకటన చేసినా, దాని మీద జరగవలసినంత చర్చ జరగడం లేదు.
ఇప్పుడు కేంద్ర గిరిజన శాఖామంత్రి కిశోర్ చంద్రదేవ్ ఇది బూటకపు ఎన్‌కౌం టర్ అని హిందూ పత్రికకు ఇచ్చిన ఒక వివరణాత్మక ఇంటర్వ్యూలో అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సమస్యల లోతుకు వెళ్లడానికి సిద్ధంగా లేదు, సరికదా తప్పు డు ప్రశ్నలు, సమాచారాన్ని వక్రీకరించి అందించడంవల్ల ఒక సాధారణ మధ్యతరగతి మనిషి మొత్తం మావోయిస్టు ఉద్యమం పట్ల ముఖ్యంగా గిరిజన పోరాటాల పట్ల ఒక శాస్త్రీయ, లేదా ప్రజాస్వామ్య దృక్పథాన్ని అవలంబించలేకపోతున్నాడు. ఇప్పటికైనా విద్యావంతులు మీడియాలో వచ్చిన వార్తలే కాక సరైన సమాచారం సేకరించడానికి కొంత శ్రమపడాలి. కనీసం మీడియా ఇచ్చిన సమాచారాన్ని విమర్శనాత్మకంగా చూడడం అలవాటు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమకారులకు ఇది చాలా అవసరం.
కారణం ఏదైనా ఈసారి ఛత్తీస్‌గఢ్ సంఘటన పాలకుల మధ్యే తీవ్ర విభేదాలకు దారి తీసింది. అంతకుముందు బస్తర్ గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడని లేదా భయంతో బతుకుతున్న కాంగ్రెస్ సభ్యులు నిజనిర్ధారణ కమిటీ వేసి మొత్తం ఎన్కౌంటర్ బూటకమని తేల్చారు. ఈ విషయం మణిశంకర్ అయ్యర్ బాహాటంగానే అంటున్నారు. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌పార్టీ, ఆ పార్టీ సభ్యులు, కేంద్ర గిరిజనమంత్రి, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కేంద్ర వ్యవసాయ సహాయమంత్రి అందరూ ఇది బూటక ఎన్కౌంటరని అంటున్నారు. చిదంబరం మాత్రం సంఘటన జరిగిన మరుక్షణమే ఇది నిజమైన ఎన్కౌంటర్ అని తేల్చేశారు. కేంద్ర హోంమంవూతి గా తమ బలగాలు ఏది చేసినా సమర్థించడం ఆయన తన బాధ్యతయని అనుకోవచ్చు. కానీ వాస్తవాలకు కూడా కొంత బలముంటుంది. ఈ వాస్తవాల వల్ల అంతిమంగా సాయుధ బలగాల, హోంమంవూతితో సహా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మీదే ప్రజలు విశ్వాసం కోల్పోతే జరిగే ప్రమాదం సామ్రాజ్యవాద పెట్టుబడికి దాసోహం అంటున్న హోంమంత్రికి అర్థమైనా కావడం లేదు, లేదా స్వామి భక్తి ఒక తదాత్మన స్థితికి చేరుకొని ఆదిశంకరుడి భ్రాంతి మధ్యనైనా చిక్కు కుని ఉండాలి.
కిశోర్ చంద్రదేవ్ గిరిజన మంత్రిగా, స్వయాన గిరిజనుడు కావడం వల్ల, నక్సలైట్ ఉద్యమం ఉధృతంగా ఎగిసిపడిన ఉత్తరాంధ్రవాసిగా కొన్ని వాస్తవాలు నిర్భయంగా, నిజాయితీగా ప్రకటించాడు. అంతేకాక కొన్ని మౌలిక ప్రశ్నలు కూడా అడిగారు. సంఘటన తీవ్రవాదులకు పోలీసులకు మధ్యే జరిగి ఉంటే ఆయుధాలులేని వాళ్లు చాలామంది అక్కడ ఎందుకున్నారు? నిరాయుధులైన మనుషులపైన సాయుధ బలగాలు కాల్పులు జరపకూడదన్న నియమం ఏమైంది? అర్ధరాత్రి కాబట్టి ఏది అగుపించలేదు అని అంటే అర్ధరాత్రి పేరుతో విచ్ఛలవిడిగా సాయుధ బలగాలు కాల్పులు జరపవచ్చునా? ఒకవేళ తీవ్రవాదులే గిరిజనులను సమీకరిస్తే గిరిజనులకు తగిన రక్షణ కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వమున్నప్పుడు, వారు తమ ప్రాణాలను బలి ఇవ్వవలసిందేనా? అయితే కిశోర్ చంద్రదేవ్ చాలామంది అంటున్నట్టే గిరిజనులు ఇటు సాయుధ బలగాల అటు మావోయిస్టుల మధ్య చిక్కుకుపోయారని అంటూ- తాను మొదటి నుంచి కిరాతకమైన సల్వాజుడుంకు వ్యతిరేకమన్నారు.
సల్వాజుడుంను ప్రజల మీదికి వదలడం వల్ల గిరిజనుల మధ్యే ఘర్షణ పెరిగి ఒకరికొకరు చంపుకోవడం వల్ల తీరా ప్రాణాలు కోల్పోతున్నది గిరిజనులే అని అన్నారు. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా కొన్ని మౌలికమైన అంశాలపై కూడా వ్యాఖ్యానించారు. తీవ్రవాదం ఒకరకంగా శాంతి భద్రతల సమస్యే అయినా, దీని మూలాలకు వెళ్లవలసి ఉంటుంద ని, మూలాలకు వెళ్లకుండా సమస్య పరిష్కారం కాదన్నారు. దీని మూలాలు ఖనిజాలలో ఉన్నాయని, ఈ ఖనిజ సంపదను బయటికితీసే క్రమంలో గిరిజనుల జీవితాలను క్రమక్షికమంగా విధ్వంసం చేస్తున్నాయని, పరిష్కారం గిరిజనులకు అడవిపై, అక్కడి భూమిపై హక్కులను పునరుద్ధరించి, ఖనిజాలను ఇతరులకు అప్పగించే ముందు గిరిజనులకు సంపదపై ఉండే హక్కులను గుర్తించాలని, లేకపోతే వాళ్లు నిరాక్షిశయులే కాక రాజ్యపరిధి నుంచి బయటికి నెట్టివేయబడతారని అన్నారు. అంతేకాక ఒక అభివృద్ధి చెందుతున్న దేశం తమ ఖనిజ సంపదను ఇతర దేశాలకు విచ్ఛలవిడిగా అప్పగించడం వల్ల మనదేశ అవసరాలకు ఖనిజాలు ఏవీ మిగలవని, జాతీయ శ్రేయస్సు దృష్ట్యా ఆలోచించడమే కాక వేలాది సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న గిరిజనులను కాదని మనం ఏంచేసినా అది వాళ్ల సహజ హక్కులను హరించడమవుతుందని అన్నారు.
ప్రపంచీకరణ ప్రారంభమైన తర్వాత, సామ్రాజ్యవాద నీలినీడలు ఈ దేశంలో పరుచుకుంటున్న కాలంలో బహుశా అధికారంలో ఉన్న ఏ మంత్రి కాని, రాజకీ య నాయకుడు కాని ప్రతిపక్షపార్టీ కాని, కొత్తగా ఎదిగిన మాయావతి లాంటి నాయకురాలు కాని ఇంత స్పష్టంగా మాట్లాడడం నేను చూడలేదు. నిజానికి బస్తర్‌లో మావోయిస్టు పార్టీ చేస్తున్నదల్లా అక్కడి గిరిజనుల జీవన్మరణ పోరాటానికి మద్దతునిచ్చి వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని కాపాడుతున్నది. ఈ ఒక్క అంశం తప్పించి ఆ ఉద్యమం మీద అన్ని రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే దీంట్లో మావోయిస్టు పార్టీ వైఫల్యం కూడా కొంత ఉంది. ఎంతసేపు మాట్లాడినా, ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా సాయుధ పోరాటం గురించి, తమ సైన్యాన్ని గురించి మాట్లాడినంతగా తమ పార్టీకుండే మానవీయ కోణం గురించి చెప్పకపోవడం వల్ల బయట జరిగే ప్రచారానికి ఎక్కువ స్పందన వస్తున్నది.ఈ దేశసంపద ఈదేశ ప్రజలది. ఈ దేశ అట్టడుగు ప్రజలు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించి,ఒక సుందరమైన సమాజనిర్మాణం స్వప్నమని, మధ్య తరగతి అనుభవిస్తున్న సంక్షోభానికి, మానవ సంబంధాలు కూలిపోతున్న సందర్భానికి ప్రత్యామ్నాయ మానవీయ సమాజం సాధ్యమే అనే విశ్వాసం కలిగించగలగాలి. ఆ ఉద్యమం నిర్వహించవలసిన పాత్ర కూడా అదే. ఈ విషయాన్ని బస్తర్‌లో మావోయిస్టు పార్టీ నాయకులతో కూడా చెప్పడం జరిగింది. బస్తర్ ‘మారణహోమం’ ఏ కారణం వల్లో ఒక లోతైన చర్చకు దారి తీయడం ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. ఇలాంటి చర్చే తెలంగాణ ఉద్యమంలో కూడా జరగాల్సిన అవసరం ఉంది.
జయశంకర్‌లేని తెలంగాణ (21-6-2012)
జయశంకర్ మరణించి అప్పుడే ఒక్క సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో, అలాగే రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు జరిగాయి. ఆ మార్పుల్లో పరకాల ఎన్నికలు, వాటి ఫలితాలు లోతుగా చర్చించవలసిన ఒక అంశ మే. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో జగన్మోహన్డ్డి గెలుస్తాడని ఊహించిందే. రాజకీయ సాంఘికశక్తుల పునరేకీకరణ జరుగుతున్నదని, పాల క వర్గాలలో అధికారం, సంపద, పంపిణీ విషయాల్లో ఘర్షణ కొంచెం తీవ్రస్థాయికే చేరుకుందని చాలా సందర్భాల్లో చెప్పే ఉన్నాం. రాజకీయ అధికారానికి అక్రమ సంపాదనతో ఎదిగిన మాఫియాయే సామాజిక పునాది, మాఫియా యువతే రాజకీయకార్యకర్తలు. ఏ పార్టీకి కూడా స్వతంవూతంగా, పార్టీ మీద, పార్టీ విధానాల మీద గౌరవముండి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు లేరు. పై నుంచి కిందిదాకా అక్రమ సంపాదనతో వాటాదారులే రాజకీయ ప్రక్రియకు కీలకశక్తులు. ఇది 80వ దశాబ్దంలో పుట్టి, 90లలో చాలా పెరిగింది.
రాజశేఖర్‌డ్డి ఈ మాఫియాను చాలా జాగ్రత్తగా పెంచి పోషించాడు.తన పీఠాన్ని అధిష్ఠానం ఎప్పుడు ముట్టి నా రాష్ట్రవ్యాప్తంగా శాంతిభవూదతలను విచ్ఛిన్నం చేసేవాడే. అది వాళ్లకు రాయలసీమ ముఠా రాజకీయాల నుంచి వచ్చిన వారసత్వం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా వరకు ఈ మాఫియా మీద ఆధారపడ్డవారు. కొందరైతే మాఫియాగా ప్రారంభమై మంత్రులుగా ఎదిగారు. ఇందులో తెలంగాణ నాయకులు కూడా ఉన్నారు. అట్లా మాఫియా సంస్కృతి నుంచి పుట్టిన నాయకత్వమే పరకాలను గత దశాబ్ద కాలంగా పరిపాలిస్తున్నది. కొండా మురళి కుటుంబం పేరు చెపితే వరంగల్‌లో చాలా నిజాయితీగా జీవిస్తున్న వారు కూడా భయపడడం చూసి ఒక దశాబ్ద కాలం వరంగల్‌లో పనిచేసిన నాకే ఆశ్చర్యం వేసింది.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తెలంగాణను ఈ మాఫియా సంస్కృతి నుంచి కాపాడింది అని నేను గాఢంగానే నమ్ముతున్నాను. మానుకోట సంఘటన తర్వాత ఈ నమ్మకం మరింత బలపడింది. అయితే మొత్తం తెలంగాణ ఉద్యమంలో నాకు తెలిసి, నేను పాల్గొన్న సభలలో ఒక్క పరకాలలోనే కొండాసురేఖ సభ జరగనివ్వలేదు. వేలమంది నుంచి నిరసన వచ్చినా, ఎంత నచ్చచెబుదామన్నా ఆమె వినలేదు.సభ జరగలేదు సరికదా, సభ నిర్వాహకులు మా భద్రత గురించి చాలా ఆందోళనపడ్డారు. గూండాలు మా మీద ఎప్పుడైనా దాడి చేయవచ్చనే ఒక పుకారు కూడా చాలా వేగంగానే ప్రచారమయ్యింది. ఈ సంఘటన తెలంగాణ ఉద్యమానికి ఒక కనువిప్పుగా ఉండవలసింది. చాలామంది ఇప్పటికే పేర్కొన్నట్టు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల రాజకీయాలు తప్ప తెలంగాణ సమస్యలపై ప్రజలను సమీకరించకపోవడం, తెలంగాణ యువతకు దిశానిర్దేశం చేయకపోవడం వల్ల ఎంత ప్రమాదమో పరకాల మనకు తెలియజేస్తున్నది. అయితే తెలంగాణ ఎన్నికల ద్వారానే సాధ్య ం కాదు. సమాంతరంగా ఉద్యమాలు కూడా ఉండాలని చాలామందే అంటున్నారు. కానీ ఆ ఉద్యమానికి ఏం లక్ష్యముండాలి, జనాన్ని ఏ విధంగా సమీకరిస్తారు, యువతకు ఎలాంటి విలువలు, విశ్వాసాలు ఇవ్వాలి అనే అంశాలపై ఎంత తీవ్రమైన చర్చ జరగాలో అది జరగడం లేదు. తెలంగాణ అనే ఒక అమూర్త లక్ష్యం ప్రజలను కదిలించినా, రాజకీయ నాయకులను ప్రశ్నించే ధైర్యాన్ని ఉద్యమం పూర్తిగా ఇవ్వలేకపోవడం వల్లే, పరకాలలో ‘భయా న్ని’ నివారించలేకపోయింది.
తెలంగాణ రాజకీయ సంస్కృతి గురించి, ఉద్యమధోరణుల గురించి జయశంకర్ నేను చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఒక టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ సామాజిక విశ్లేషణలో ‘హరగోపాల్‌తో చర్చ చాలా ఉపయోగపడింది’అని ఆయన అన్నప్పుడు నేను కొంచెం ఆనందపడ్డ మాట వాస్తవం. అయితే పార్లమెంటరీ రాజకీయాల్లో చాలా పరిమితులున్నాయని మళ్లీ మళ్లీ అనేవాడు. కొంచెం గట్టిగా వాదిస్తే ‘డాక్టర్ సాబ్ ఉన్న సరుకు ఇది, మనం ఏం చేయగలం’ అనేవాడు. అయితే ప్రజలను నిరంతరంగా ఎడ్యుకేట్ చేయాలి అని మాత్రం సంపూర్ణంగా విశ్వసించేవాడు. అందుకే అలసట లేకుండా ఒక దశాబ్దకాలం తెలంగాణ ప్రాంతం మొత్తం పర్యటించాడు. వందల సభలకు హాజరయ్యేవాడు. చాలా స్పష్టంగా సులభమైన భాషలో అందరికి అర్థమయ్యేలా మాట్లాడేవాడు. తెలంగాణ ప్రజల చైతన్యానికి జయశంకర్ చాలా దోహదపడ్డా, పరకాల ఎన్నికల తర్వాత ఆయన లేని లోటు కొట్టవచ్చినట్టుగా కనిపిస్తున్నది.
జయశంకర్ ఉపన్యాసాలే కాక సమాచారాన్ని సమక్షిగంగా సేకరించడానికి చాలా శ్రమపడ్డాడు. వీలున్నప్పుడల్లా వ్యాసాలు రాశాడు. శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఎందు కు మీరు కమిటీ మీద అంత ఆశలు పెట్టుకున్నారు అని అడిగితే, కమి టీ సరైన సమాచారం లేక తప్పుడు నిర్ణయం చేస్తే అది మన వైఫల్యం అవుతుందని, రాజకీయంగా, సంకుచితంగా వాళ్లు నిర్ణయం తీసుకుంటే అది వాళ్ల తప్పిదమవుతుందని అన్నాడు. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత దానికి స్పందిస్తూ ‘It is trash’ అంటే చెత్తబుట్టలో వెయ్యవలసిన నివేదిక అని దాని భావం. ఆ కమిటీ ఇచ్చిన తప్పుడు వాస్తవాల మీద వివరంగా రాశాడు, మాట్లాడాడు. దానిపట్ల ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి శ్రమపడ్డాడు.
పరకాల ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నేర్చుకోవలసింది, జయశంకర్ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకపోవడానికి, అధ్యయనం, ఆలోచన, ప్రజలతో నిరంతర సంభాషణ అవసరం. ఆవేశంగా మాట్లాడడం, లేని వాగ్దానాలు చేయడం, మనమే తెలంగాణ సాధిస్తాం అని చెప్పడం తగ్గించి, ఉద్యమ అవసరాన్ని, ప్రజల చైతన్యవంతమైన పాత్రను గుర్తుచేస్తూ, సామాన్య ప్రజలు తెలంగాణ ఎందుకు కావాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. అంటే ప్రజల నుంచి నేర్చుకోవడం చాలా అవసరం. అలాగే రాష్ట్ర సాధన తర్వాత ఎలాంటి తెలంగాణను కోరుకుంటున్నామో, ఆ తెలంగాణ ఇప్పటి తెలంగాణ కంటే ఎంత భిన్నంగా ఉంటుందో, అంటే భవిష్యత్ తెలంగాణ స్వరూపాన్ని కొంతైనా చెప్పగలగాలి. ఈ విషయంలో జయశంకర్ తనమీదే తాను కొన్ని పరిమితులు విధించుకోవడం ఒక పెద్దపరిమితే. ఈ అం శం గురించి మాట్లాడితే తెలంగాణ రానియ్యండి డాక్టర్ సాబ్ అనేవాడు. బహుశా పరకాల ఎన్ని కల తర్వాత ఆయన మన మధ్య ఉంటే తప్పక ఆలోచించేవాడని నేను అనుకుంటున్నాను.
పరకాలలో ఎందుకు తెలంగా ణ ఉద్యమ ప్రభావం తక్కువున్నదో విశ్లేషించడమేకాక తెలంగాణలో తెలుగుదేశం,కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాజశేఖర్‌డ్డి పెంచి పోషించిన మాఫియాను మార్చడమెలా, ఎన్నికల రాజకీయాల్లో వాళ్ల పాత్రను పూర్తిగా నివారించగలమా అన్నది ఒక సవాలు అయితే, చైతన్యవంతమైన ఉద్యమంలోకి ఈ మాఫియా యువతను ఎలా తీసుకరావడం, వాళ్లని ఎలా ఎడ్యుకేట్ చేయడం ఎలా అని ఆలోచించాలి. పరకాలలో మాఫియా పాత్రని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. నిజానికి మొత్తంరాష్ట్రంలో మాఫి యా వర్గం, రాజశేఖర్‌రెడ్డి మరణం పట్ల వచ్చిన సానుభూతిని చాలా పెద్ద ఎత్తున వాడుకుంటున్నారు. ఈ సానుభూతి పోతే మరొక జగన్మెహన్డ్డిని సృష్టించడం అంత సులభం కాదు అని వాళ్లకు తెలు సు. అందుకే రాజశేఖర్‌డ్డి మరణించగానే కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలందరూ జగన్మోహన్డ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. అధిష్ఠానానికి ఇచ్చిన పత్రంలో అందరు సంతకాలు చేశారు.
జగన్మోహన్డ్డిని ముఖ్యమంవూతిని చేయాలని సంతకాలు చేసిన రోజే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఆత్మహత్యలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ బొందను తామే తవ్వుకున్నారు. ఈ విషయం జయశంకర్ పదేపదే అనేవాడు. తెలంగాణ ముఖ్యమంత్రి పదవే మీకు దక్కుతుంది అని అంటే ఉప ముఖ్యమంత్రి పదవికి ఆరాటపడుతున్నారు అనేవాడు. రాజకీయ నాయకులకు ఒక మంచి తెలంగాణ కావాలనే స్వప్నం, చారివూతక స్పృహ, సమగ్ర సామాజిక అవగాహన లేకపోవడం ఎంత ప్రమాదం. సమాజం తనను తాను ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి జయశంకర్ లాంటి అరుదై న వ్యక్తులను సృష్టించుకుంటుంది. తెలంగాణలో ఈ జీవనాడి సజీవంగానే ఉంది. మనం జయశంకర్‌కు ఇవ్వగల నివాళి, పరకాల సంస్కృతి తెలంగాణ అంతా వ్యాపించకుండా జాగ్రత్త పడడమే.
అడవిలో అందమైన ఆవుదూడ (7-6-2012)
సుక్మా జిల్లా కలెక్టర్ అపహరణ సందర్భంలో నేను బస్తర్‌కు వెళ్ళానన్నది చాలా మందికి తెలిసిన విషయమే. ఇంతకు ముం దు కూడా 1993లో కొయ్యూరుకు, 2011లో ఒడిస్సాలో మధ్యవర్తిగా వెళ్ళిన విషయం కూడా చాలా మందికి తెలుసు. అయితే కొయ్యూరు అపహరణ సందర్భంలో కొంతదూరం అడవిలోకి వెళ్ళి ఒక గుట్ట ఎక్కి అప్పటి పీపుల్స్‌వార్ దళంతో కలిసి కన్నబీరన్ నేను చర్చించవలసి వచ్చింది. శాంతిచర్చల సందర్భంలో కూడ రెండు మూడు దఫాలు అడవికి వెళ్ళవలసి వచ్చింది. మళ్ళీ ఛత్తీస్‌గడ్‌లో కూడ రెండుసార్లు అడవికి వెళ్ళవలసి వచ్చింది. ఇంతకు ముందు అన్ని అపహరణలతో పోలిస్తే ఇది కొంత క్లిష్టంగానే ఉండింది. అని నేను ఇంతకు ముందే రాసి ఉన్నాను. రెండవసారి కలెక్టర్ అలెక్స్ మీనన్‌ను మావోయిస్టు పార్టీ మాకు అప్పగించిన తర్వాత బి.డి. శర్మ అలెక్స్ మీనన్, నేను మూ డు సైకిల్ మోటార్ల మీద తిరిగి చింతల్నార్కు వస్తున్నప్పుడు ఒక చిన్న అందమైన ఆవుదూడ బహుశా పదిపదిహేను రోజుల వయసుండవచ్చు. అది అడవిలో చాలా ఆనందంతో గంతులు వేస్తూ పరుగెత్తిన దృశ్యం నాకు ఒక మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలింది. నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. చిన్నప్పుడు అవు ఈనడం, చిన్న ఆవుదూడలను చాలానే చూశాను. ఆవు దూడ పడుతూనే కొద్ది సమయం తర్వాతే నడవడం, పరుగెత్తడం చూసి అంత చిన్న వయసులో అది నడవడం చూస్తే చాలా అబ్బురంగా ఉండేది.
మనుషులు పుట్టగానే నడుస్తే ఎంత బావుండేది అనిపిస్తుంది. పుట్టిన తర్వాత పెరగడానికి, దొర్లడం, లేచి నిలబడడం, కొద్దిగా అడుగులు వేయడం, తర్వాత నడవడం, పరుగెత్తడం చేస్తారు. అవుదూడకు ఈ పరిణామ దశలో ఏవీ లేవు. బహుశా అవి పుట్టుకతోనే కొం త స్వేచ్ఛతోనే పుడుతాయనిపిస్తుంది. అలాకాక మనిషి స్వేచ్ఛగా జీవించడానికి, అంటే తన కాళ్ళమీద తాను నిలబడడానికి చాలా శ్రమే ఉం టుంది. అందుకే మనిషిది సమష్టి జీవనం. పరస్పర ఆధారిత జీవితం. మా ఇంట్లో కాని, మా ఊళ్లో కాని చిన్నప్పుడే పరిగెత్తిన దూడను చూశా ను కాని బస్తర్ ఆవుదూడ విముక్తి చెందిన దూడలా కనిపించింది.
విశాలమైన అడవి, చెట్ల మధ్య నుంచి దూసుక పరుగెత్తగలదా, దానిని ఆపేవాడు లేడు. దాని స్వేచ్ఛ దానిది. అంతకు మించి అతి ముచ్చటగా, మెరుస్తున్న తెలుపు రంగుల్లో చాలా ఆరోగ్యంగా ఉంది. బహుశా సల్వాజుడుం, గ్రీన్‌హం ట్ ప్రభావాలు దాని మీద పడ్డట్టు కనిపించలేదు. ఇంకా ఈ అణచివేత ఈ లేగదూడ దాక వచ్చినట్టులేదు.
బస్తర్ ఆదివాసీలు కూడ ఒక కాలంలో ఇంత స్వేచ్ఛతో కూడుకున్న తమ జీవితం తాము జీవించారు. వాళ్ళ ఆచారాలు, విశ్వాసాలు, సంపదలు, పెళ్ళిళ్ళు, విడిపోవడాలు, వాళ్ళపాటలు, నాట్యం, దుస్తులు ధరించే తీరు అన్ని చాలా భిన్నంగానే ఉండేది.వాళ్ళు ప్రకృతికి దగ్గరగా జీవించిన మను షులు, ఆ జీవితాన్ని రొమాంటెసైజ్ చేయవలసిన అవసరం లేదు. కానివాళ్ళు నాగరికులు అనడం తప్ప. నాగకరికత ప్రమాణాలు ఎవరు నిర్ణయిస్తారు అనేదే సమస్య. కోస్తాంధ్ర ప్రాంతవాసుల దృష్టిలో తెలంగాణవాళ్ళు కొంత అనాగరికులు అనే అభివూపాయం ఉంది. అది రేగడి విత్తుల నవలలో స్పష్టంగానే వ్యక్తమయ్యింది. బస్తర్ ఆదివాసీలతో దాదాపు జీవించి వాళ్ళలో పూర్తిగా మిళితమైవాళ్ళ కోసం నిరంతరంగా శ్రమపడ్డ బి.డి శర్మలో కూడ కొంత అమాయకత్వం, మనుషుల మీద విశ్వాసం, మాట మీద నమ్మకం . రాసిన పదాల మీద, చట్టాల మీద కంటే కూడా ఇచ్చిన మాట చాలా బలమైంది. నాలుగు దశాబ్దాలు ఐఏఎస్ ఆఫీసర్‌గా పనిచేసిన తర్వాత కూడా ఆ నమ్మకాలు అలాగే ఉన్నాయి. మనం ఎంత వాదించినా, ఇచ్చిన మాట గౌరవించనివాడు రాసిన ఇచ్చిన మాటను కూడా పాటించడు అని ఆయన భావిస్తాడు. బహుశా అది ఆయన మీద ఆదివాసీ సంస్కృతి ప్రభావమేమో. మావోయిస్టు పార్టీకి నిజమైన బలం కూడ పార్టీకి ఆదివాసీలకు ఉండే పరస్పర విశ్వాసమే.
లేగదూడ స్వేచ్ఛతో పోల్చగల ఆదివాసీల స్వేచ్ఛ ఎలా విధ్వంసం అవుతూ వస్తున్నదో, చారివూతక మలుపులను చూస్తే తప్ప అర్థం కాదు. ఆదివాసీలు ప్రకృతికి దగ్గరగా జీవించినా ప్రకృతితో ఘర్షణ కూడా ఉంటుంది. ముఖ్యం గా పులులు, ఎలుగుబంట్లు లాంటి వాటితో వాళ్ళు నిరంతరంగా పోరాడుతూనే ఉంటారు. కనక ప్రతి ఆదివాసీ చేతిలో ఏదో ఒక ఆయుధ ముంటుం ది. చాలామంది దగ్గర ధనస్సు బాగాలు చూస్తే నాలాంటి వాడికి కొంత విం తగా అనిపించింది. బి.డి.శర్మ ఒక ఆదివాసీని నీ బాణం ఎంత దూరం వెళ్ళగలదు అని అడిగాడు. ఆ ఆదివాసి ఒక చిన్న చిరునవ్వును సమాధానంగా ఇచ్చాడు. ఈ క్రూర జంతువులతో నిరంతర పోరాటం వలన వాళ్ళకు పోరాట స్ఫూర్తి ఒకటుంటుంది. తెల్లవాడు బస్తర్‌లో ప్రవేశించినప్పుడు ఎచటివాడు, ఎవడువాడు ఇటువచ్చిన తెల్లవాడు అని శ్రీశ్రీ అన్నట్టు తెల్లవాడితో కలబడ్డారు. మానవీయ పరిణామ శాస్త్రజ్ఞుడు ఎల్విన్ బస్తర్ జీవితాన్ని గురించి చాలా మంచి రచనలు చేశాడు. వాళ్ళ జీవన విధానాన్ని సంస్కృతిని భవిష్యత్ తరాలకు తన రచనలలో భద్రపర్చాడు.
బి.డి. శర్మ మీద నేను గత వ్యాసంలో ప్రస్తావించినట్టు,1949, 26 జనవరి నాడు బస్తర్ ప్రజలు తమ స్వేచ్ఛను కోల్పోయారు అన్న మాటలు చాలా లోతైనవి. నూతన ఆర్థిక విధానం పరిణామం వలన విపరీతమైన వేగంతో విదేశీ పెట్టుబడి సాయుధ బలగాలతో బస్తర్లోకి చొరబడింది. ఆబలం సరిపోక బస్తర్ ప్రజల్లోని కొందరిని విడదీసి ‘సల్వాజుడుం’గా మార్చి విపరీతమైన దుర్మార్గాలు చేయించారు. నిజానికి గంటల తరబడి విన్నా సరిపోని భయంకర వాస్తవాలు వాళ్ళు చెప్ప గలరు. తమ మనుషులే అంత క్రూరంగా తమ పట్ల ప్రవర్తించడాన్ని వాళ్ళు తట్టుకోలేక పోతున్నారు. సల్వాజుడుం అంత అమానుషంగా ఎలా తయారయ్యింది అని మావోయిస్టు నాయకత్వాన్ని అడిగితే రాజ్యం వాళ్ళను సాధారణ ప్రజలనుంచి వేరు చేసి అమానవీయమైన మనుషులుగా మార్చి వీళ్ళ మీదికి వదిలారు అని అన్నారు.బస్తర్‌లో సల్వాజుడుం చేసిన దుర్మార్గాల గురించి కొన్ని నివేదికలు, కొంత సమాచారం అందుబాటులో ఉంది. మేము చూసిన, విన్న విషయాల గురించి కూడా వేరే ఒక వ్యా సంలో రాయవలసి ఉంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి మాత్రం ఆపరేషన్ గ్రీన్‌హంట్ కాని, సల్వాజుడుం కాని ఛత్తీస్‌గఢ్‌లో లేవని, ఆపరేషన్ గ్రీన్‌హంట్ తమ డిక్షనరీలోనే లేదు అని ఒక పత్రి కా విలేఖరుల సమావేశంలో చెప్పారు. అరుంధతీరాయ్ బస్తర్ మీద రాసిన వ్యాసంలో ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ని అబద్దా లు ప్రచారంలో ఉన్నాయో చెప్పుతూ మావోయిస్టు పార్టీ గురించి మీడియా చేసే అబద్దపు ప్రచారంలో ‘ఆవులు మాయమైన’ ఒక సంగతి గురించి రాసింది.
బి.జె.పి పోయిన ఎన్నికలలో తాము గెలిస్తే ప్రతి ఇంటికి ఒక ఆవును ఇస్తామని వాగ్దానం చేసింది. ఆవును ఇవ్వలేదు. ఇవ్వకపోవడానికి బస్తర్‌లోని ఆవులంటే గిట్టని మావోయిస్టుపార్టీ చంపేసిందని, ఆవులు లేకపోవడం వలన ఇవ్వలేకపోయామని ప్రచారం చేసింది. పార్టీ ఈ విషయాన్ని నిర్దందంగా ఖండిస్తే, మీడియాలో అది ప్రచారం కాలేదు.అందమైన ఆవుదూడ పరుగే ఆవులు సజీవంగా ఉన్నాయ నడానికి ప్రత్యేక సాక్ష్యం. సమస్యల్లా బస్తర్‌లో ఇప్పుడుండే యుద్ధ వాతావరణం ఇంకా ఎంతముందుకు పోతుందనేది. స్వేచ్ఛగా, స్వచ్ఛంగా జీవించే మనుషుల జీవితాలను వాళ్ళ వనరుల దోపిడీ కోసం విధ్వసం చేయడం ఎందుకు అనే ప్రశ్న నాగరిక సమాజం అడగాలి. ఈ అంశం నేను పదేపదే రాస్తున్నాను. గుర్తు చేస్తున్నాను. వాళ్లు అడవిలో తమకు తోచిన రీతిలో జీవిస్తున్నారు.
రాజ్యం అడవిలోకి వెళ్ళదలిస్తే అక్కడి మనుషుల జీవితాలను వాళ్ళు మరింత అందంగా, ఆనందంగా జీవించే పరిస్థితులను కల్పించడానికైతే వేరు. కాని కేవలంవాళ్ళ వనరుల కోసం వెళ్ళి వాళ్ళ కాళ్ళకింద భూమిని తొలిస్తే భూకంపం రాకుండా ఎలా ఉంటుంది. విశాలమైన అడవిలో అందమైన ఆ లేగ దూడ స్వేచ్ఛగా ఉంటుందా లేక అది కూడ భయంభయంగా జీవించే వాతావరణం ఏర్పడుతుందా అన్నదే ప్రశ్న.
పాలమూరు - పరకాల-ఎక్కడికి (31-5-2012)
పాలమూరుకు పరకాలకు చాలాతేడా ఉంది. పాలమూరు జిల్లా చాలా చాలా వెనుకబడినజిల్లా. చైతన్యస్థాయి ఎదగవలసిన జిల్లా. వలస లు, కరువులతో బాధపడుతున్న ప్రాంతమిది. అదికాక ముస్లింలసంఖ్య కూడా ఎక్కువే. ఇవన్నీ పరకాలకు వర్తించవు. అయినా తెలంగాణ పాలక వర్గాలు, బలమైన సామాజికవర్గాలు, కులాలు కాంగ్రెస్, తెలుగుదేశంతో విసిగిపోయిన నాయకత్వం ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నది. జగన్మోహన్డ్డిని తెలంగాణలోకి రానిస్తే ఆయనను అంగీకరించడానికి చాలామంది తెలంగాణ నాయకులు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్డ్డి వ్యక్తిత్వం ఎలాంటిది? ఇంత సంపద ఎలా కూడబెట్టుకున్నాడు? ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు?ఇవన్నీ తెలంగాణలోని బలమైన సామాజిక వర్గాన్ని ఆందోళనకు గురిచేయడం లేదు. తెలంగాణ భవిష్యత్తు ఏమిటి? వస్తే ఎవరైనా తెస్తే ముఖ్యమంత్రి పదవికి, సంపద కూడబెట్టుకోవడానికి అవకాశాలు పెరగొచ్చు.
ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగితే ఇప్పుడు రాజశేఖర్‌డ్డి, చంద్రబాబు కల్పించిన అధికారంలో వాటాకు, ఆస్తులు పెంచుకోవడానికి మార్గాలు బాగానే ఉన్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం, ప్రపంచబ్యాంకు నుంచి వచ్చిన సబ్ కాంట్రాక్టులు, తెలుగులో చెప్పాలంటే ఉప ఉప కాంట్రాక్టులు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో వాటాలు, మద్యం నుంచి ధారావాహికంగా వచ్చే డబ్బు.. ఇదీ బాగానే ఉంది. ఒకరకంగా బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఇది జాతీయ పార్టీ, అధికారంలోకి ఎప్పుడైనా రావచ్చు. మతతత్వం గురిం చి మాట్లాడితే మంచిదే కదా. మతం ద్వారా పేదవాళ్లను మభ్యపెట్టవచ్చు. మనుషులను విభజించవచ్చు. గుజరాత్ లాంటి ‘సమర్థవంతమైన’ పాలన రావచ్చు. నరేంవూదమోడి లాంటి ముఖ్యమంత్రి మనలో ఎవరైనా కావ చ్చు. ఇలా ఆలోచనా సరళి. అందుకే తెలంగాణ ప్రాంతం విషయంలో బీజేపీ చాలా ధీమాగా ఉంది. తెలంగాణ ప్రజలకు ఇది ఒక అగ్ని పరీక్ష.
మిగతా అన్ని పార్టీలు బాగున్నాయా? బీజేపీ ఒక్క పార్టే తక్కువా అని అడగవచ్చు.నిజానికి చాలా వేగంగా బీజేపీలో ముందుకుపోతూ ఎదుగుతున్న యువ నాయకుడు కిషన్‌డ్డి.ఆయన మర్యాదకైనా తన ‘పాదయాత్ర’ ప్రారంభించే ముందు నాక్కూడా ఫోన్ చేశాడు. తెలంగాణ కోసమే కదా అని నేను మర్యాద పూర్వకంగానే మాట్లాడాను. కానీ ఆయన శైలి, మాటలు, దృక్ప థం తెలంగాణ ప్రజల మనస్తత్వానికి కాని చారివూతక స్పృహకు కాని ఎక్కడా పొంతన కుదరదు. ఆయన వెంకయ్యనాయుడు శిష్యుడు. ఎందుకు ఆయన సుష్మా స్వరాజ్‌ను అభిమానించొచ్చు కదా. వెంకయ్యనాయుడు తెలంగాణ కోసం ఏం మాట్లాడాడో నాకు తెలియదు కాని సుష్మా స్వరాజ్ తెలంగాణ గురించి పార్లమెంటులో బాగానే మాట్లాడింది. రెండు ఆయన నరేంవూదమోడీ ప్రధా ని కావాలన్నాడు. నాకు భయమేసింది.
తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తి నరేంవూదమోడిని అభిమానించడం నమ్మరాని విషయం. సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లో, యశ్వంత్‌సిన్హానో, జశ్వంత్‌సింగ్ ఇంతమంది ఉండగా ఈయన వేలాదిమంది ముస్లింలను ఊచకోత కోసిన గుజరాత్ ముఖ్యమంవూతిని ఎందుకు సమర్థిస్తున్నాడు? అంటే గోద్రా సంగతి ఏమిటి అని అడగడం తప్ప వేరే జవాబులేదు. గోద్రా దుర్మార్గంలో పాల్గొన్న వాళ్ళను శిక్షించండి, కాని ఒకరు నేరం చేస్తే ఇంకా తల్లి గర్భం నుంచి బయటికి కూడా రాని అమాయకపు శిశువుకు ఎందుకు శిక్ష! గోద్రా అంటే ఎక్కడున్నదో తెలియని అమాయకపు ముస్లిం మహిళల పట్ల ఎందుకు అంత అరాచకత్వం? నిజానికి గుజరాత్ ఘటనల తర్వాత మనిషి మీద, మానవత్వం మీదే అనుమానమొచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ దేశ జాతీయ మీడియా, ఇంగ్లిషు చానెల్స్ నరేంవూదమోడికి విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నాయి.
నరేంవూదమోడి కేరళలో కమ్యూనిస్టుపార్టీ హింసను ఖండించడమే కాక, హింసకు ప్రజాస్వామ్యంలో స్థానంలేదు అని అంటే ఏ మా త్రం సిగ్గులేని మీడియా దానికి ప్రచారం కల్పించింది. కానీ ఒక్కడు కూడా గుజరాత్ హింసాకాండ సంగతి ఏంటి అని అడగలేదు. ఈ మొత్తం ప్రక్రియను గమనించకుండా, తెలంగాణలో ఎదుగుతున్న ఒక బీజేపీ నాయకుడు మోడిని సమర్థించడం తెలంగాణ ప్రజాస్వామ్య సంస్కృతికి అంగీకారంకాదు, కాకూడదు. అందుకే తెలంగాణ జేఏసీ కోదండరాం, సింగిడి రచయితలు స్పష్టంగానే బీజేపీ రాజకీయాలకు దూరమవుతున్నారు. నిజానికి సంయమనంతో మాట్లాడుతున్న సీహెచ్.విద్యాసాగర్‌రావు, బండారు దత్తావూతేయలు ఎందుకు అగ్రనాయకులుగా అంగీకరించడడం లేదో అర్థంకాదు. నిజానికి ఇద్దరూ కేంద్ర కేబినేట్లో పనిచేసిన నాయకులే.
ఇక ఇంకొక ముఖ్య అంశానికి వస్తే, పాలమూరు ఎన్నికల నుంచి ముస్లింలను విమర్శిస్తూ రజాకార్ల నుంచి ప్రస్తావించారు. ఇప్పుడు రజాకార్ల ప్రస్తావన ఎందుకు అని మనం అడగవచ్చు? దానికి మించి బందగీ, షోయబుల్లాఖాన్‌ల త్యాగాలను గుర్తుచేసుకోవచ్చు.ఇంకా చరివూతలోకి వెనక్కి వెళ్ళాలంటే తుర్రెబాజ్‌ఖాన్ సహసాన్ని గురించి మాట్లాడవచ్చు.కలియుగ దైవమని భావించే వెంక సహచరి అని ప్రచారంలో ఉండే బీబీనాంచారి గురించి మాట్లాడొచ్చు. తెలంగాణలోని పీర్ల పండుగ గురించి మాట్లాడవచ్చు. ముస్లింల గురించే మాట్లాడాలంటే ఇదంతా తెలంగాణ వారసత్వమే కదా, దాని మీదే మాట్లాడొచ్చు కదా, అయితే పరకాలలో మాట్లాడుతూ ‘రజాకార్ల గురించి మాట్లాడడమే మతతత్వమయితే నేను మతతత్వవాది’ నే అని కిషన్‌డ్డి అన్నారు. రజాకార్ల దురాగతాల గురించి, దుర్మార్గాల గురించి నాకు తెలిసినంత కిషన్‌డ్డికి తెలిసే అవకాశం లేదు. ఊళ్లో కాసీం రజ్వీని మా గ్రామస్తులు చంపారు. అయితే మా గ్రామం కాసీం రజ్వీని చం పింది. తుర్రెబాజ్‌ఖాన్‌కు రక్షణ కల్పించింది. రజాకార్లను గుర్తుపెట్టుకొని ఇతర త్యాగాలు చేసిన ముస్లింలను గుర్తుపెట్టుకోకపోవడం మతతత్వం.
ఇంతకు ముందు రాసిన వ్యాసంలో నేను ప్రస్తావించిన అంశాల గురించి కిషన్‌డ్డి ఆలోచించాలి. చరివూతను చెప్పేటప్పుడు సమక్షిగంగా చెప్పాలి. రజాకార్ల చేసిన దుర్మార్గం గుజరాత్లో దుర్మార్గం, సల్వాజడుం దుర్మార్గాలతో పోల్చవచ్చు. రజాకార్ల పేరు వింటేనే మా అమ్మ కొంత భయంగా మాట్లాడేది ఇంట్లో ఎక్కువ అల్లరి చేసే తన కొడుకును రజాకార్ అని పిలిచేది. వాళ్ళు హిందూ స్త్రీ పట్ల చేసిన తప్పు లు క్షమించరానివే, వాటిని తప్పక గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడూ పునరావృత్తం కాకుం డా చూసుకోవాలి. కాని వాళ్లకు రక్షణ కల్పించి, గడీలలో వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించి సహకారం చేసిన హిందూ భూస్వాముల గురిం చి ఎందుకు మాట్లాడడం లేదు. వాళ్లకు వ్యతిరేకంగా సహసంగా పోరాడిన ఆనాటి కమ్యూనిస్టుపార్టీని ఎందుకు అభినందించడం లేదు? వాళ్ళ దుర్మార్గాలకు బలైన కమ్యూనిస్టు కార్యకర్తల గురించి పరకాలలో ఎందుకు మాట్లాడడం లేదన్నదే ప్రశ్న.
తెలంగాణలో బీజేపీ పార్టీ నిలదొక్కుకోవాలంటే గుజరాత్ నమూనా పనికిరాదు. ఆది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ విషయం బీజేపీలో చాలా చురుకుగా పనిచేసి మధ్యంతరంగా చనిపోయిన మహబూబ్‌నగర్ ఝాన్సీ తో నేను ప్రస్తావించేవాణ్ణి. ఆమె ఎప్పుడూ నే ను ఆ విషయాలు, మతతత్వ రాజకీయాలు ప్రస్తావించలేదు కదా అనేది. నిజం కూడా ఆమె చాలా ఆవేశంగా తెలంగాణకు గడిచిన అన్యాయాన్ని గురించి మాట్లాడేది. ఇంతకుముందే ఇతర వ్యాసాల్లో ప్రస్తావించిన అంశాలను మళ్లీ ప్రస్తావించవలసిన అవసరం ఏర్పడింది. పాలమూ రు జిల్లాలో కోస్గి దగ్గర ఒక గ్రామంలో వలసల గురించి అధ్యయనం చేయడానికి వెళ్ళి, వాళ్ళ గ్రామంలో అట్టడుగున ఉండే అతిపేద ఐదు కుటుంబాలు ఏవి అని అడిగితే పేదరికంలో కూరుకుపోయిన ఆ గ్రామ దళితులు ఒక ముస్లిం కుటుంబాన్ని చూపించారు.
అలాగే మా నాన్న గంటల తరబడి పూజ చేసేవాడు. మత విశ్వాసాలు చాలా బలంగా ఉన్నవాడు. కాని మా గ్రామంలో ఉండే ముస్లింలందరూ ఆయనను అభిమానించేవారు. ఆయన చనిపోయిన రోజువాళ్ళే దుకాణాలను మూయించారు. ఆయనకు చేసే కర్మకాండ ఖర్చు కొంత భరిస్తామని ఒక ముస్లిం అబ్బాయి చాలా పట్టుపట్టాడు. అంతేకాదు గుజరాత్ మానవ హననం తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దాదాపు 14 గంటలు జరిగిన మీటింగ్‌లో ప్రతి తెలంగాణ వ్యక్తి కన్నీ ళ్లు పెట్టుకున్నాడు. కొందరు బోరుమని ఏడ్చారు. ఇది తెలంగాణ విశిష్ట సంస్కృ తి. ఈ సంస్కృతిని విస్మరించి, ఇంత మానవీయ విలువలను విధ్వంసం చేసే ఏ ప్రయత్నాన్నైనా తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు. కొట్టాలి కూడా.
బి.డి. శర్మ:అరుదైన ఐఏఎస్ (17-5-2012)
‘నమస్తే తెలంగాణ’ కాలమ్‌కు రాయడంలో కొంత గ్యాప్ వచ్చింది. మిగతా కారణాలతో సహా ఛత్తీస్‌గఢ్‌లో కలెక్టర్ అలెక్స్ పాల్ మీన న్ కిడ్నాప్‌లో మధ్యవర్తిగా వెళ్లవలసి రావడం వల్ల కూడా జాప్యం జరిగింది. ఇప్పుడు కూడా సీరియస్‌గా రాసే ఒక మానసికస్థితి ఏర్పడలేదు. మధ్యవర్తి త్వం నిర్వహించిన తర్వాత సాధారణ మానసికస్థితి రావడానికి సమయం పడుతుంది. ఇది గతంలో కూడా నాకు అనుభవమే. అయితే ఏదో రాయడ మో, లేదా ఏదో ఒక సభలో ప్రసంగించడమో చేస్తే తప్ప అతి త్వరగా సాధారణ స్థితి రాదు. ఒరిస్సా కిడ్నాప్ తర్వాత పాలమూరు అధ్యయన వేదిక తెలంగాణ చరిత్ర మీద నిర్వహించిన నభనుద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో కొంత సాధారణ స్థితి వచ్చింది. ఈసారి సెక్ర ఆఫీసర్స్‌ను ఉద్దేశించి పాలనా సంస్కరణల మీద మొన్నటి ప్రసంగంతో కొంత కుదుట పడడం వల్ల మొదటిసారిగా చేసే ప్రయత్నమిది.
ఛత్తీస్‌గఢ్ మధ్యవర్తిత్వం నేనింత వరకు పాల్గొన్న అనుభవాలతో పోలి స్తే బహుశా ఇది మిగతా వాటి కంటే కఠినమైన సమస్య. అంత కష్టంగా ఉంటుందని నేను భావించలేదు. అయితే ఇలాంటి అనుభవాన్ని ‘జ్ఞానం’గా చూడాల ని ఆర్.ఎస్.రావు అనేవారు.
గతంలో 1993 కొయ్యూర్ కిడ్నాప్ ఘటనలో కన్నబీరన్తో, 1996 నుంచి 2004 వరకు శాంతి చర్చల ప్రయత్నంలో శంకరన్, పొత్తూరి వెంక ఇతర మిత్రులతో, గత సంవత్స రం ఆర్.ఎస్. రావు, దండపాణి మొహంతితో, ఈ ఛత్తీస్‌గఢ్‌లో డాక్టర్ బ్రహ్మదేవ శర్మ (బీడీ శర్మ)తో కలిసి కృషి చేసే అవకాశం కలిగింది. వీళ్లందరిలో దండపాణి, బీడీ శర్మలు తప్పించి, మిగతా వాళ్లంతా తెలుగు సమాజానికి పరిచితులే. ఆత్మీయు లే. ఛత్తీస్‌గఢ్ అనుభవాలను పంచుకోవలసిన అవసరము, బాధ్యత నా మీద ఉంది. అది తప్పక చేయాలి. ఈసారి ఎందుకో బీడీ శర్మ గురించి తెలుగు సమాజానికి, ముఖ్యంగా ఒక ఉద్యమంలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెప్పడం ప్రారంభించడం ప్రయోజనకరంగా ఉంటుందని అనిపించింది.
బీడీ శర్మ మధ్యవూపదేశ్‌లో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన బాలగోపాల్ లాగే ఎంఎస్సీ గణితశాస్త్రం చేసి, అందులో డాక్టరేట్ కూడాపూర్తి చేశారు. సివిల్ సర్వీస్‌తో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం తో చేరారు. సివిల్ సర్వెంట్‌గా బహుశా స్వాతంత్య్రం తర్వాత శంకరన్‌తో సరిసమానం తూగేలాగా ప్రజలకు అద్భుతమైన సేవలు అందించారు. కొన్ని ఆయ న చేసిన ప్రయోగాలు, ముఖ్యంగా ఆచరణ నాలాంటి వాడికి ఊహకు అందని విధంగా ఉంది. నాకు ఆయన గురించి శంకరన్ చెప్పేవారు. అయితే రాడికల్ రాజకీయాల పట్ల ఆయనకు అభిమానం ఉంది. కానీ ఆ రాజకీయ ప్రక్రియలో ఉండే మెలికలు, అంతర్గత అంశాలు కొన్ని సున్నితమైన సమస్యల పట్ల ఆయనకు సమక్షిగమైన అవగాహన తక్కువ. లేదా దాని గురించి ఆయన ఎక్కువగా పట్టించుకోడు అని శంకరన్ అనేవారు. అయితే శర్మ ఎప్పు డు హైదరాబాద్ వచ్చినా శంకరన్ దగ్గరే ఉండేవారు. ఇద్దరి మధ్యన సాన్నిహిత్యమే కాక సున్నితమైన హాస్యముండేది. శంకరన్ అప్పుడప్పుడూ నీవు ఎవ్వరి మీటింగ్‌కు వచ్చావు, మీటింగ్ ఎక్కడ? ఆ పార్టీ ఏ పార్టీ? ఇలా అడిగేవాడు.
శర్మ ఎవరైతే ఏం, ప్రజల కోసం పనిచేస్తున్న వాడిగా నా అభివూపాయాలు నావి, వాటిని స్వేచ్ఛగా చెబుతాను అని అనేవారు. శర్మ వెళ్లిపోయిన తర్వాత చూశా వా ఆయనకు ఏ వివరాలు తెలియవు. ఈ పార్టీల మధ్యన తగువులున్నాయి, దృక్పథాలలో తేడాలున్నవి, వాటి గురించి కొంచెమైనా తెలిసి ఉండడం అవసరం అని శంకరన్ అనేవారు. అలా బీడీ శర్మ నాకు పరిచయమయ్యారు.
ఛత్తీస్‌గఢ్ సంఘటన సందర్భంగా ఆయనతో కలిసి దాదాపు తొమ్మిది రోజు లు పనిచేయవలసి వచ్చింది. ఈక్రమంలోనే బీడీ శర్మ అపూర్వ వ్యక్తిత్వం చూసే గొప్ప అవకాశం వచ్చింది. ఆయన ఇప్పుడు ఆరు, ఏడు జిల్లాలుగా ఏర్పడిన అప్పటి అతిపెద్ద బస్తర్ జిల్లాకు నలభై సంవత్సరాల కిందట కలెక్టర్ గా పనిచేశారు. బస్తర్‌ను తన సొంత ప్రాంతంగా, బస్తర్ ఆదివాసీలను తన మనుషులుగా చూసి, నిష్కల్మషంగా ప్రేమించిన మనిషి. నిజానికి బస్తర్ ఆదివాసీల నిష్కల్మష జీవితం కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించి ఉంటుంది. అక్కడి ఆదివాసీలను నేను పొరపాటున పేద ఆదివాసీలు అంటే పేద ఆదివాసులు ఉండరు అన్నాడు. మేం ఆదివాసీలతో మాట్లాడుతున్న సందర్భంలో మీ భాషలో పేదరికాన్ని ఏం అంటారు అని అడిగి ఆ పదం వాళ్ల భాషలో లేదు అని చెప్పారు. వాళ్ల భాషలో భవిష్యత్తు అనే పదం కూడా లేదు అంటూ, జీవితాన్ని నిరంతరం పారుతున్న నిష్కల్మష నదీ ప్రవాహంగా జీవిస్తారు అని వివరించాడు. నిజానికి వాళ్ల మీద ఆయన ప్రేమ అనిర్వచనీయమైంది. వాళ్ల మధ్య చిన్న పిల్లవాడిలా, ఒక వేడి రక్తం కలిగిన యువకుడిగా మారిపోయాడు. వాళ్ల చేత నినాదాలు అనిపించాడు. ప్రమాణాలు చేయించాడు. వాళ్ల మహువా తప్పించి, బయటి నుంచి వచ్చే మద్యాన్ని కూడా తాగవద్దని ప్రమాణాలు చేయించాడు.
మావోయిస్టు కార్యకర్తలు బిస్కట్లు ఇస్తే, బస్తర్‌కు బిస్కట్లు ఎలా రానిచ్చా రు. నేను బస్తర్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు బిస్కట్లను తినవద్దని వారించాను. ఆదివాసీ ప్రాంతాల వనరులను దోచి బిస్కట్లు తయారుచేసి, వాటిని ఆదివాసు లకు తినిపించి దోపిడీని స్థిరపరుచుకుంటున్నారు అన్నారు. ప్రకృతి ఇచ్చిన ఇన్ని రకాల పండ్లు, ఫలాలు ఉన్నప్పుడు బిస్కట్లు తినవలసిన దుర్గతి వీళ్లకెందుకు అని అన్నాడు. బీడీ శర్మకు సుఖము, సౌకర్యాలు ఏవీ పట్టవు. ఇవి నిజానికి బాలగోపాల్ తో పోల్చదగిన గుణాలే. కారులో ఏసీ వేస్తే, డ్రైవర్‌పై కోప్పడ్డాడు. నీవు ఇక్కడ ఏసీ వస్తే ఒక ఆదివాసికి మంచినీళ్లు దొరకవు నీకు తెలుసా అని అన్నాడు. అడవిలో మేం కొంత దూరం నడవవలసి వచ్చింది. ఎనభై ఏళ్లు దాటిన తాను నాకంటే వేగంగా నడవడం ప్రారంభించాడు. నాకు బైపాస్ అయ్యింది. మీ అంత వేగంగా నడవకూడదేమో అంటే తనకు 17 ఏళ్ల కిందటే బైపాస్ అయ్యిందన్నప్పుడు నాకు కొంచెం సిగ్గుకూడా వేసింది. అడవిలో మేం ఒక రాత్రి ఆదివాసీల మధ్య గడపవలసి వచ్చింది. వాళ్ల దగ్గర చిన్న చిన్న మంచాలున్నాయి. ఈయన చాలా పొడవు, కొంత సేపు నేల మీద గురకపెట్టి నిద్రపోయాడు. తర్వాత మంచం మీద ముడుచుకు ని నిద్రపోయాడు.
రెండవసారి మేం కలెక్టర్‌తో తిరిగి వచ్చాక సీఆర్పీఎస్ క్యాంపులో ఒక రాత్రి ఉండవలసి వచ్చింది. మాకిద్దరికి ఒక చిన్నగది ఇచ్చారు. గదంతా చాలా వేడిగా ఉంది. వాళ్ల ఫ్యాన్లు సోలార్ ఎనర్జీ తో మెల్ల గా నడుస్తాయి. నాకు చాలా ఉక్కగా ఉంది అని అంటే, వేడి అంటే ఏమిటి? పడుకోవడానికి అది ఎందుకు అడ్డమొస్తుంది అన్నాడు. రూంలోని ఫ్యాన్ ను పూర్తిగా నావైపు తిప్పి నిద్రపోయా డు. ఉదయం నాలుగున్నరకు లేచి మేం పత్రికలలో ప్రకటించడానికి తయారుచేసిన రెండు పేజీల ఇంగ్లిషు ప్రకటన ను ఉదయం ఆరు గంటల వరకు హిందీలోకి ముత్యాల్లాంటి అక్షరాలతో రాసి చాలా సంతృప్తిగా నాకు చూపించాడు.
బీడీ శర్మ ఇలాంటి ఏ సౌకర్యాలను ఆశించలేదు కాబట్టే ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ లాంటి ప్రధానమంవూతులతో నిస్సంకోచంగా మాట్లాడారు. ఆదివాసీ సమస్యల గురించి వాళ్లను ఎడ్యుకేట్ చేయడానికి వెనకాడలేదు. ఇందిరాగాంధీకి శర్మ గారంటే ఒక ప్రత్యేక గౌరవం కూడా. ఈశాన్య భారతంలోని నెహ్రూ విశ్వవిద్యాలయంలో వీసీని చంపేయడం వలన, విశ్వవిద్యాలయ వీసీగా వెళ్లడానికి ఎవరూ సిద్ధంగా లేనప్పుడు బీడీ శర్మ గారిని వీసీ పదవికి ఆమె పంపింది. ఆయన ఐదు సంవత్సరాలు రాత్రింబవళ్లు కష్టపడి విశ్వవిద్యాలయాన్ని దారిలోకి తెచ్చారు. ఆ తర్వాత ఆయనను ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్‌కు చైర్మన్‌గా నియమించారు. ఇందిరాగాంధీ అకస్మాత్తుగా మరణించడంతో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. బీడీ శర్మ రాజీవ్‌గాంధీని కలిసినప్పుడు రాజ్యాంగంలో మీ హోదా ఏమిటి అని అడిగితే, మీ ప్రపంచంలో, మీ విలువల చట్రంలో మనిషి హోదాను డబ్బులతో కొలుస్తారు. నేను కేవలం నెలకు ఒక రూపాయి తీసుకుంటున్నాను. అలా చూస్తే నాకు ఏ హోదా లేదు. అయితే నేను ఎవరికి అమ్ముడుపోయే వ్యక్తిని కాదు అని అన్నప్పుడు, రాజీవ్‌గాంధీ లేచి నిలబడి తనను డోర్ దాక వచ్చి సాగనంపాడు. ఇది బీడీ శర్మ విశిష్ట వ్యక్తిత్వం.
నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంవూతాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. కాని తెలంగాణ ఉద్యమ కారులకు ఈ నిజాయితీ, నిబద్ధత నిరాడంబరత స్ఫూర్తి కావాలి. ఆయన ఆచరణ ఒక ప్రమాణం కావాలి.
Subscribe to:
Comments (Atom)