(ప్రొఫెసర్ హరగోపాల్ సార్ వివిద పత్రికలల్లో రాసిన వ్యాసాలు అందుబాటులో ఉన్న మేరకు ఇక్కడ ఇస్తున్నాం. ఈ వ్యాసాలు, ఆయన అనుభవాలు ఈ తరం వారికి ఉపయోగపడతాయని అశీస్తూ...మీ డేవిడ్)
Sunday, October 28, 2012
సమైక్యత అంటే ఏమిటి? (21-7-2011)
పట్టణాల మధ్య పల్లెటూళ్ల మధ్య విపరీతమైన అగాధమేర్పడింది. వ్యవసాయరంగంలోని అదనపు సంపత్తిని హైద్రాబాద్‌కు తరలించారు. దీనివల్ల హైద్రాబాద్ చుట్టూ ఉండే మహబూబ్ నగర్, రంగాడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఒక భాగం బాగా దెబ్బతిన్నాయి. విపరీతమైన పేదరికం పెరిగింది. అలాగే ఆంధ్ర రైతాంగం కూడా దోపిడీకి గురైంది. ఆంధ్ర రైతాంగం హైద్రాబాదును వదులుకుంటే తప్ప బాగుపడరు.
నిన్న మొన్నటి వార్తలు చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్య ఒక కొలిక్కి వస్తుందేమోనని ఆశించిన వారికి కొంత ఆందోళన కలిగించేలా ఉన్నాయి. రాజకీయ నాయకులు చెప్పిన విషయాలనే పత్రికలు, ఎలక్షిక్టానిక్ మీడియా నాయకులు చెప్పినట్లుగానే ప్రచురించారా లేక దానికి చిలువలు పలవలు చేర్చి తమ పద్ధతిలో రాశారా తెలియదు. రాజకీయ నాయకుల విశ్వసనీయత ఏ స్థాయి లో ఉందో మీడియా విశ్వసనీయతస్థాయి కూడా అలాగే ఉంది. ఎవరు ఏం చెపుతున్నారు? ఎవరు ఏం రాస్తున్నారో! అన్న గందరగోళం మన దేశంలో విస్తృతం గా వ్యాప్తి చెందింది. ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్, చిదంబరం ఒక్కొక్కరు మహా మాటకారులే. తెలంగాణ నాయకులు వెళ్తే వీళ్లకు నచ్చేలా మాట్లాడుతున్నారు. ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు వెళితే వాళ్లకు ప్రీతిపావూతమైన విధంగా మాట్లాడుతున్నారు.
సమస్య జటిలమైంది అంటున్నారు. రాత్రికి రాత్రే పరిష్కరించలేమంటున్నారు. అందరూ కలసి ఉండండి అంటున్నారు. తెలుగు ప్రజల కు దీర్ఘ చరిత్ర ఉందంటున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష బలంగా ఉందంటున్నారు. ప్రణబ్‌ముఖర్జీ దాదాపు ఐదు సంవత్సరాలు ఈ సమస్యను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ‘సమస్య జటిలమైంది’ అంటూ చిదంబరం ప్రకటన చేసేప్పుడు తాను ఢిల్లీలో లేనని, ఉంటే ప్రకటన భిన్నంగా ఉండేదేమో అంటూనే, చిదంబరం ప్రకటన వ్యక్తిగతం కాదు, దానికి మా అందరి సమ్మతి ఉందని అంటున్నారు. ఆజాద్ చైనా నుంచి పనికి రాని ఒక ప్రకటన చేసి దానికి తాను చింతిస్తున్నానని అంటున్నారు.
ప్రధానమంత్రి బుద్ధిగా ఉండండి అని కలిసిన ఆప్రాంతం వారికి ఈ ప్రాంతం వారికి ఏదో వృద్ధాక్షిశమంలో ఉండే ఒక పెద్దమనిషి తరహా మాట్లాడుతున్నారు. సోనియాగాంధీ మనసులో ఏం ఉందో చెప్పడానికి మనకు పుట్టపర్తి సాయిబాబా కూడా లేకుండాపోయారు. ప్రపంచంలో ఒక అతిపెద్ద దేశ బాధ్యతను, పాలనను నిర్వహిస్తున్న ఈ పెద్దమనుషులు స్వతంవూతంగా ఆలోచించడం మానేసారా? వాళ్ల ను ఏ అదృశ్యశక్తో నడుపుతున్నదా? ఈ దేశ భవిష్యత్తును వీళ్లకు వదిలివేయవచ్చునా? చాలా తీవ్రంగా రెండు ప్రాంతాల ప్రజలు ఆలోచించాలి.
ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారుల ప్రయోజనాలు వేరు. వాళ్ల ప్రయోజనాలే ప్రజల ప్రయోజనాలుగా చెలామణి చేయడంలోనే వాళ్ల రాజకీయ చాకచక్యం ఉంది. కోస్తా రైతులు ముఖ్యంగా ధనిక రైతాంగం వీళ్ల గురించి ఆందోళన చెందుతున్నారు. మొన్నటి ఢిల్లీ మీటింగులో ఈ విషయాన్ని నాయకులు బహిరంగంగానే అన్నారు. విద్యార్థులు హైదరాబాద్‌లో అవకాశాలుపోతాయని వాపోతున్నారు. ఈ సమస్యలే తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నారు. కృష్ణా, గోదావరి నదులలో తమకు న్యాయంగా రావలసిన వాటా తమకు దక్కకుండా పోతుందని మళ్లీ మళ్లీ చెపుతున్నారు. హెచ్‌ఎంటీవీ ‘దశదిశ’ వైజాగ్ చర్చలో నీళ్ల విషయంలో తెలంగాణకు ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాకు ఎంత అన్యాయం జరిగిందో సవివరంగా, సోదాహరణంగా వివరించాను. కృష్ణా నీళ్లు కావలసిన రైతులు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నారు.
ఇద్దరికీ నీళ్లు కావాలి. కావలసినన్ని లేదా ఇద్దరికీ సరిపోయేన్ని నీళ్లు కృష్ణలో లేదా మన రాష్ట్రానికి వచ్చిన వాటాలో లేవు. సమస్య ఇది. వాళ్లేమో మా వ్యవసాయం దెబ్బతింటుంది అంటున్నారు. వీళ్లేమో మా ప్రాంతం ఇప్పటికే దెబ్బతిన్నది అంటున్నారు. దీనికి ప్రత్యేక రాష్ట్రం పరిష్కారమని అనుభవ పూర్వకంగా అంటున్నారు. మరి సమైక్యవాదులు న్యాయమైన పంపిణీ జరిపి ప్రజలను సమైక్యంగా ఉంచుదాం అని, ఢిల్లీకి వెళ్లి ‘మేం ఒకే పంటకు కాలువ నీళ్లు ఉపయోగించి, రెండవ పంటకు భూగర్భ జలాలను ఉపయోగించుకుంటూ, వెనుకబడిన తెలంగాణకు మేం బాసటగా నిలు స్తాం, మా రైతాంగాన్ని ఒప్పిస్తాం’ అని అనే బదులు,‘రాష్ట్రాన్ని విభజిస్తే మా రైతాంగం నష్టపోతుంది కనుక సమైక్యంగా రాష్ట్రాన్ని ఉంచండి’ అని అంటే ఆ వాదన సమైక్యతను బలపరిచినట్లా లేక తెలంగాణ రైతాంగాన్ని అవమానపరిచినట్లా ఆలోచించాలి. అన్యాయం సమైక్యతకు పునాది కాలేదని చారివూతక వాస్తవం ఎందుకు వాళ్ల అవగాహనకు రావడం లేదో మనం ఊహించుకోవచ్చు.
అలాగే ఆంధ్ర ప్రాంత విద్యార్థుల ఆందోళనను అర్థం చేసుకోవచ్చు. అయితే తెలంగాణ ఏర్పడితే మా అవకాశాలు మెరుగుపడతాయని తెలంగాణ విద్యార్థులు ఆశిస్తున్నారు. తెలంగాణ విద్యార్థులకు ఆ ప్రాంతం విద్యార్థుల జవాబు ఏమై ఉండాలి? మన ఇద్దరికి ఉద్యోగాలు ఇవ్వలేని ఒక ఆర్థిక నమూనాలో మనం ఇరుక్కున్నాం. ఈ అభివృద్ధి నమూనా మూలాలను ప్రశ్నించి శ్రమ ఆధారిత పారిక్షిశామిక విధానానికి మేం పోరాడుతాం. మీకు నియామకాల్లో జరిగిన అన్యాయా న్ని మేం గుర్తించాం. మీకు మీ న్యాయమైన వాటా వచ్చేందుకు మేం కూడా పోరాడుతాం, ఇద్దరం కలిసి పోరాడుదాం, సమైక్యంగా అది సాధ్యమే అనడం లేదు. హైద్రాబాద్ మాకు చెందకపోతే మా ఉద్యోగ అవకాశాల సంగతేమిటి అని వాపోతున్నారు.
ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆశించే తెలంగాణ విద్యార్థులకు సమైక్యవాదం సమర్థించే వారి జవాబు ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబు లేకుండా సమైక్యత ఎలా సాధ్యమవుతుంది నేను చాలా కాలంగా ఈ మాట అంటున్నాను. మళ్లీ అంటున్నాను. సమైక్యత ఒక ఉదాత్తమైన విలువ. దాన్ని సాధించడానికి త్యాగబుద్ధి కావాలి. ఆ త్యాగం లేకుండా సమైక్యత నిలవడం సాధ్యం కాదు.
నిజానికి ఈ మౌలిక ప్రశ్నలకు జవాబు తెలియని రాజకీయ పార్టీలు ప్రాంతాల వారీగా చీలిపోయాయి. ఈ సమస్యలకు పరిష్కారం తెలియని కేంద్ర నాయక త్వం ఏ రోటికి ఆ పాట అంటున్నాయి. నిజానికి నీళ్ల విషయంలో, నియామకాల విషయంలో ప్రణబ్‌ముఖర్జీ కమిటీ లోతైన అధ్యయనం చేయవలసి ఉంది. అది చేయకుండా కాలయాపన చేసి కాలమే దీనికి పరిష్కారం చూపుతుంది అని భావించాడు. కనీసం శ్రీకృష్ణ కమిషన్ ఆర్థిక అభివృద్ధి నమూనాను పరిశీలించి నీళ్ల విషయంలో, నియామకాల విషయంలో హైదరాబాద్‌లో అవకాశాల పరిమితుల విషయంలో అందరికీ అవకాశాలు పెంచే పారిక్షిశామిక విధానం కానీ, ఆర్థిక విధానం గురించి కాని కొంత లోతైన అధ్యయనం చేస్తే కొంత ప్రయోజనకరంగా ఉండేది. అలాకాక పనికిరాని ఆరు సలహాలను ఇచ్చి అపహాస్యం పాలైంది.
ఇక తెలంగాణ ఉద్యమం ఒక మలుపు తిరుగవలసి ఉంది. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ఒక చారివూతక అనివార్యత అయ్యింది. ఇప్పుడున్న అభివృద్ధి నమూనా ప్రాంతాల మధ్య అంతరాలు పెంచుతుందే తప్ప తగ్గించదు. విద్యార్థులందరికీ అవకాశాలు అటుంచి త్వరలోనే ఉద్యోగావకాశాలు చాలా కుదించుకు పోనున్నాయి. నోబెల్ బహుమతి గ్రహీత స్లగ్లిట్జ్ ఈ అభివృద్ధిని ఉద్యోగరహిత వృద్ధి అని పేర్కొన్నాడు. కనుక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రక్రియలో భాగంగా చర్చ ఎలాంటి తెలంగాణ అనేది చర్చించాలి. ఆలస్యం అయిన కొద్దీ.. ఈ చర్చ పోరులో భాగంగా జరగాలి. తెలంగాణలోని విశ్వవిద్యాలయ విద్యార్థులు తమ అవకాశాలకు పోరాడు తూ, గ్రామీణ రైతాంగంమీద, వాళ్ల జీవన ప్రమాణాలమీద సునిశితమైన పరిశీలనలు, చర్చలు జరపాలి.
తెలంగాణ ఏర్పాటు ఎంత ఆలస్యమైతే మన అవగాహన అంత లోతుగా పెరగాలి. నిజానికి ఏ ప్రజాస్వామ్య ఉద్యమమైనా ఆదిశలో జరగాలి. పాలకవర్గాలు మోసం చేస్తూ పరిపాలించే ఒక కళను రూపొందించుకున్నాయి. ఈ విషయం కేంద్ర నాయకుల మాటలతో ఈ పాటికి తెలంగాణ యువకులకు స్పష్టంగా అర్థమై ఉండాలి. పరిష్కారం ఆలస్యమైతే నిరాశపడితే చాలా ప్రమాదం. ఎంత ఆలస్యమైతే అంత పట్టుదల, అవగాహన, స్పష్టత పెరగాలి.సమస్యలకు కారణాలు, పరిష్కారాలు వెతికే జిజ్ఞాస పెరగాలి. ఉద్యమాన్ని దీర్ఘకాలం నడపవలసి వస్తే ఆ సంసిద్దత అలవరుచుకోవాలి. గమ్యం స్పష్టంగా ఉంటే గమనం వేగం తగ్గినా చలనం నిలుపుకోవాలి. ఢిల్లీ రాజకీయాలను పరిశీలిస్తే.. ఎక్కడో సమస్యను హైద్రాబాద్ భవిష్యత్తుతో ముడిపె ఉంది. ఆ విషయం శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చిన సలహాలలో మనకు కనిపిస్తుంది.
హైద్రాబాద్ నగరం ఇలాంటి వక్ర అభివృద్ధికి గురికాకుంటే బాగుండేది.
నేను 1960లో మొట్టమొదట చూసిన హైద్రాబాద్ చాలా అందంగా, ప్రశాంతంగా ఉండేది. యాభై ఏళ్లలో నగరమంతా విధ్వంసానికి గురైంది. దీన్నంతా అభివృద్ధి అని అనుకుంటున్నారు. పట్టణాల మధ్య పల్లెటూళ్ల మధ్య విపరీతమైన అగాధమేర్పడింది. వ్యవసాయరంగంలోని అదనపు సంపత్తిని హైద్రాబాద్‌కు తరలించారు. దీని వల్ల హైద్రాబాద్ చుట్టూ ఉండే మహబూబ్‌నగర్, రంగాడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఒక భాగం బాగా దెబ్బతిన్నాయి. విపరీతమైన పేదరికం పెరిగింది. అలాగే ఆంధ్ర రైతాంగం కూడా దోపిడీకి గురైంది. ఆంధ్ర రైతాంగం హైద్రాబాదును వదులుకుంటే తప్ప బాగుపడరు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో కనీసం పది పట్టణాలను అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. రైతాంగాన్ని పట్టణాభివృద్ధిని సమన్వయ పర్చగలగాలి. లేకపోతే.. మనం ఏ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామో, ఆ అసమానతలు భిన్న రూపాలలో మళ్లీ మళ్లీ పునరావృతమౌతాయి.
నిజానికి తెలంగాణ విద్యావంతులు, మేధావు లు, ప్రజాస్వామిక వాదులు, రచయితలు, ఉద్యోగస్తులు, జర్నలిస్టులు తెలంగాణ భవిష్యత్ చిత్రపటాన్ని రూపొందించాలి. ఇక యువత డబ్బు ప్రభావానికి గురికాకుండా జయశంకర్‌లాగా, నిలు నిజాయితీగా, నిరాడంబరంగా అతిపేదవాళ్ల పట్ల ప్రేమను పెంచుకుంటే రాష్ట్ర నిర్మాణంలో ఆలస్యంగానైనా ఈ విషయంలో తెలంగాణ భవిష్యత్తుకు కొత్త బాటలు వేస్తారు. సమైక్యత అంటే దాని అర్థం ఇదే. ఆప్రాంతానికైనా, ఈ ప్రాంతానికైనా..
Labels:
నమస్తే తెలంగాణ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment