(ప్రొఫెసర్ హరగోపాల్ సార్ వివిద పత్రికలల్లో రాసిన వ్యాసాలు అందుబాటులో ఉన్న మేరకు ఇక్కడ ఇస్తున్నాం. ఈ వ్యాసాలు, ఆయన అనుభవాలు ఈ తరం వారికి ఉపయోగపడతాయని అశీస్తూ...మీ డేవిడ్)
Sunday, October 28, 2012
ఉద్యమానికి ‘రియల్’ అడ్డంకి (7-4-2012)
రెండు వారాల క్రితం సంగాడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వార్షికోత్సవానికి కాలేజీ ఆహ్వానం మీద, నేను దేశపతి శ్రీనివాస్ వెళ్ళాం. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అనే గౌరవం కొద్దీ వెళ్ళా ము. ఏ ప్రభుత్వ స్కూల్, కాలేజీ, పిలిచినా అవకాశం ఉంటే తప్పక వెళ్ళాలి అని విద్యాహక్కు ఉద్యమంలో భాగస్వామిగా నేను భావిస్తున్నా ను. ఇది ప్రభుత్వమంటే నాకుండే గౌరవం కాదు. ఈ విద్యాసంస్థలలో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులు చాలా వరకు అతి పేద కుటుంబాలకు చెందినవారు. ఈ దేశంలో రాను రాను పేద వాళ్ళకు విద్య, నాణ్యమైన విద్య దూరమవుతున్నది. ప్రపంచీకరణ విధానాలతో విధ్వంసమైన రంగాలలో విద్య ముఖ్యంగా ఉన్నతవిద్య బాగా దెబ్బతిన్న రంగం. దీని విధ్వంసం 190వ దశాబ్దంలో ప్రారంభమై తెలుగుదేశం పాలనలో పరాకాష్ఠకు చేరుకుంది. దీనికి కొట్టవచ్చినట్టుగా కనిపించే సాక్ష్యం లెక్చరర్ల నియామాకం కోసం నెలకొల్పిన కాలేజీ సర్వీస్ కమిషన్‌ను రద్దు చేయడం. నేను రాయదలచుకున్న అంశానికి ప్రత్యక్షంగా దీని తో సంబంధం లేకున్నా ఈ ఉపోద్ఘాతం అవసరమనిపించింది.
కాలేజీ వార్షికోత్సవానికని మేం కాలేజీకి చేరుకున్నాం. మేం చేరుకోగానే వార్షికోత్సవం రద్దు అయిందని చెప్పడానికి ప్రిన్సిపాల్, అధ్యాపకులు కొంత ఇబ్బందిపడ్డారు. వార్షికోత్సవం రద్దు విద్యార్థుల గొడవ వల్లనో, లేక సంగాడ్డి లో శాంతిభవూదతల సమస్య వల్లనో కాక, లోకల్ ఎమ్మెల్యే జగ్గాడ్డి ఒత్తిడి మేరకు రద్దు అయిందని తెలిసింది. ఒక ఎమ్మెల్యే ప్రభుత్వ కాలేజీలోని ఒక కార్యక్షికమాన్ని ఆపడం, అదీ తెలంగాణ ఉద్యమంలో భాగమైన విద్యార్థులున్నప్పుడు జరగడం నాకు కొంత ఆశ్చర్యం కలిగించింది. నక్సలైట్ ఉద్యమం ఉధృతంగా ఉన్న కాలం లో ఇటువంటి కార్యక్రమాలకు పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొంటున్న వాళ్ళ ను పిలవడానికి ప్రిన్సిపాళ్ళు కొంత ఇబ్బందిపడేవారు. కానీ విద్యార్థుల ఒత్తిడితో పిలిచేవాళ్ళు. వారు పిలిచినా మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునే మాట్లాడేవాణ్ణి. కాలేజీలలో మావోయిస్టు రాజకీయాలే మాట్లాడవలసిన అవసరం లేదు. ఈ వ్యవస్థ తీరు తెన్నులు ఈ ఆర్థిక విధానం, రాజకీయాల దిగజారుడుతనం గురించి మాట్లాడవచ్చు.
విద్య తాత్విక పునాదుల గురించి లేదా జ్ఞానపు లోతుల గురించి మాట్లాడవచ్చు. అయినా అప్పడప్పుడు ఇబ్బందులు ఉండేవి. కానీ గత దశాబ్దకాలంలో నాకు ఇలాంటి అనుభ వం ఎదురుకాలేదు. అయితే మెదక్ కాలేజీలో అధ్యాపకులు అంత భయపడ్డారని కూడా కాదు. చాలామంది తెలంగాణ ఉద్యమంలో, సకల జనుల సమ్మెలో పాల్గొన్నవారే. అయితే రెండు మూడు రోజుల తర్వాతే పరీక్షలు ఉండడంతో వార్షికోత్సవంలో ఎమ్మెల్యే ఏదైనా అల్లరి చేయిస్తే, పిల్లలకు ఇబ్బంది అవుతుందని భావిం చారు. వారు చాలాసేపు చర్చించుకొని ఆ విషయం చెప్పితే పరిస్థితి అర్థం చేసుకొని వెనక్కి తిరిగివచ్చాం.
ఒక ప్రజావూపతినిధికి ప్రభుత్వ విద్యాసంస్థ మీద అంత ఆధిపత్యం ఎలా వచ్చింది. ఈ సంస్థలు తమ స్వంత సంస్థలు అని భావిస్తున్నారా? అలా అనుకుంటే నిజానికి కాలేజీ బిల్డింగ్ మేంటెనెన్స్ ఏం బాగా లేదు. కాలేజీలో చాలా వసతులు లేవు. ఉన్నతవిద్యకు గ్రాంట్స్ తగ్గడంవల్ల ఆధ్యాపకుల నియామకాలు చాలాకాలం లేకపోవడంవల్ల ప్రభుత్వ సంస్థల తీరు దేశంలో దారుణంగా ఉంది. కాలేజీ వార్షికోత్సవాన్ని ఇంత పర్సనల్ తీసుకున్న ప్రజావూపతినిధి కాలేజీ గురించి ఎన్నడైనా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాడా, కాలేజీ బాగా పనిచేస్తే తనకు గర్వకారణమని ఎన్నడైనా అనుకున్నాడో నాకు తెలియదు. ఆయనకు, ఆయన లాంటివాళ్ళకు ప్రైవేట్ కాలేజీలు ఏమైనా ఉన్నాయో తెలియదు.
ఈ సంఘటన మత విద్వేషాల గురించి రాసే వ్యాసంలో పేర్కొనడానికి కారణం- సంగాడ్డిలో ఈ మధ్యే జరిగిన మత విద్వేషాల్లో నిజనిర్ధారణకు వెళ్లిన అసదుద్దీన్ ఓవైసీ, జేఏసీ చైర్మన్ కోదండరాం, చివరకు బీజేపీ ప్రతినిధి కిషన్‌డ్డి, కాంగ్రెస్ నాయకులు ఈ విద్వేషాలకు కాంగ్రె స్ అంతఃకలహాలు కారణం అని అనుకుంటున్నారు. సంగాడ్డి పరిసర ప్రాంతాలలో ప్రపంచీకరణ పుణ్యమా అని భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ల్యాండ్ మాఫియా బాగా పెరిగింది. ల్యాండ్ మాఫియా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు, ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తున్నది. ఉద్యమం ఈ మాఫియాను నియంవూతించడంలో చేయవలసినంత కృషి చేయకపోవడం వల్ల వీళ్ళ బలం, బలగం ఏమీ తగ్గలేదు. హైదరాబాద్, రంగాడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు హైదరాబాద్ చుట్టు ఉన్నాయి. ఈ జిల్లాలలో కొంతమంది మాఫియా నాయకులు రాజకీయ నాయకులుగా ఎది గి మంత్రులు కూడా అయ్యారు. తెలంగాణ ఉద్యమం కొంత సేద తీసుకుంటున్న విశ్రాంతి కాలంలో వీళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి తమ తమ స్థాయిలో పాటుపడుతున్నారు.
సంగాడ్డిలో జరిగిన మత విద్వేషాలను కానీ లేదా కాలేజీ వార్షికోత్సవ రద్దును కానీ ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవలసి ఉంటుంది. మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారంలో- తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముస్లింలు బలపడతారని తెలంగాణ రాష్ట్రం వాళ్ళ నియంవూతణలోకి పోతుందనే ఒక రూమర్‌ను వ్యాప్తి చేశారు. ఇది తెలంగాణ వ్యతిరేకులు చేసిన ప్రచారం అయితే దీన్ని విశ్వసిస్తున్న వాళ్ళలో చాలామంది మధ్యతరగతికి చెందిన వాళ్ళున్నారు. ఈ ప్రచారం మహబూబ్‌నగర్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలనిచ్చిందో మనం చూశాం. మాఫియాకు రాజకీయాలు ఉండవు. అంటే రాజకీయ విశ్వాసాలుండవు. వాళ్ళ జీవిత లక్ష్యమల్లా అక్రమ సంపదను కూడబెట్టుకోవడం. దాని కోసం ఏ పనై నా చేస్తారు. వీళ్ళను నియంవూతించడం ఒక ప్రజా ఉద్యమాలకే సాధ్యమౌతుంది. అయితే మత కల్లోలాల పట్ల, మత రాజకీయాల పట్ల తెలంగాణ ఉద్యమం చాలా జాగ్రత్తలు తీసుకొని జాగరూకతతో మెలగవలసి ఉంది. ఏ మాత్రం తప్పిదం చేసినా, ఏదో కారణం మీదైనా విద్వేషాలు సృష్టించడానికి రియల్ ఎస్టేట్ ద్వారా బలిసిన ఈ వర్గం సిద్ధంగా ఉంది.
అయిదారేళ్ళ కిందట మహబూబ్‌నగ ర్ జిల్లాలో కొండగల్ దగ్గర ఒక గ్రామానికి వెళ్ళి అక్కడి దళితులతో చర్చిస్తూ వాళ్ళ గ్రామంలో ఒక అయిదు అతి పేద కుటుంబాలేవో చూడాలని ఉందని అంటే, తమలో తాము చర్చించుకు ని మొదట మాకు ఒక ముస్లిం కుటుంబాన్ని చూపించారు. మేం వెళ్ళినప్పుడు ఆ ముస్లిం కుటుంబసభ్యులు ఎవ్వరూ లేరు. ఆ పూరి గుడిసె కప్పుకు వార్త పత్రికలను ఉపయోగించారు. వాళ్ళ పేదరికాన్ని, వాళ్ళు అప్పుడప్పుడు ఏది దొరకక ఎలా పస్తులు ఉంటారో చెప్పడం మొదలుపెట్టారు. ఇది చెప్పుతున్న వాళ్ళంతా పేదవాళ్లే. పేదవాళ్లకు ముస్లింలు, హిందువులు అనే ధ్యాస లేదు. ఆకలి గురించి ఎక్కువ తెలుసు. ఆ గ్రామ పేదలకుండే విశాల మనస్తత్వ పునాది మీద తెలంగాణ గ్రామీణ ప్రాంత సామాజిక సంబంధాలు నిలబడి ఉన్నాయి. ఆ విశాల మానవ సంబంధాలను కాపాడుకోవడం తెలంగాణ ఉద్యమ చారివూతక బాధ్యత.
Labels:
నమస్తే తెలంగాణ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment