(ప్రొఫెసర్ హరగోపాల్ సార్ వివిద పత్రికలల్లో రాసిన వ్యాసాలు అందుబాటులో ఉన్న మేరకు ఇక్కడ ఇస్తున్నాం. ఈ వ్యాసాలు, ఆయన అనుభవాలు ఈ తరం వారికి ఉపయోగపడతాయని అశీస్తూ...మీ డేవిడ్)
Sunday, October 28, 2012
పత్రికా స్వేచ్చ (8-7-2011)
పత్రికలు నిష్పక్షపాతంగా ఉండాలని చాలామంది భావిస్తారు. కానీ నా దృష్టిలో అది సాధ్యం కాదు. అది అభిలషణీయం కూడా కాదు. మంచికి- చెడుకు, మార్పుకు- స్తబ్ధతకు, మానవీయతకు -అమానవీయతకు, విలువలకు- విలువల రాహిత్యానికి మధ్య నిష్పక్షపాతంగా ఉండడం సాధ్యం కాదు.
నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ గారు తమ పత్రికకు ఒక కాలమ్ రాయమని కోరగా అంగీకరించడానికి ఆయన మీద ఉన్న గౌరవంతో.., పత్రిక ఒక ఉద్యమ నేపథ్యంలో రావడం వలన అంగీకరించక తప్పలేదు. అయితే గతంలో నేను ఒక ఆంగ్ల పత్రికకు కాలమ్ రాసినప్పుడు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని వాగ్ధానం చేసినా, మా నాన్న గారు ఒక హస్పిటల్‌లో వైద్యుడి నిర్లక్ష్యం వల్ల చనిపోయినప్పుడు రాసిన వ్యాసాన్ని వేయకపోగా సాధారణంగా ప్రైవేటు హాస్పిటల్స్ మీద వ్యాసాలు వేయకూడదనే ఒక నిర్ణయం పత్రికకు ఉన్నద’ని అన్నారు. మరొక తెలుగు పత్రిక సినిమాలను విమర్శిస్తూ వ్రాసిన వ్యాసాన్ని వేయడానికి అంగీకరించలేదు. ఈ మధ్య ఒడిసాలో మధ్యవర్తిత్వం అనుభావాన్ని వ్యాసంగా పంపిస్తే, మధ్యవర్తిత్వాన్ని తన ఎడిటోరియల్‌లో హర్షించిన ‘హిందూ’ ఆంగ్ల పత్రిక ఆ వ్యాసాన్ని ప్రచురించలేదు. మరొక తెలుగు దిన పత్రిక కొంత వత్తిడి చేసి రాయమంటే రాజశేఖర్‌డ్డి నియంతృత్వ పోకడలను (ముఖ్యంగా విద్యారంగంలో) ప్రసావిస్తూ వ్రాసిన వ్యాసాన్ని ప్రచురించలేదు. ఈ నిర్ణయాలు రాజ్య నియంవూతణలో ప్రభుత్వ ‘సెన్సార్‌షిప్’ వల్ల కాదు. పత్రికలో తమ మీద తామే‘ సెన్సార్‌ిషిప్’ పెట్టుకున్నారు.
ఈ ధోరణిని నామ్ చామ్‌స్కీ ‘ మార్కెట్ సెన్సార్‌షిప్’ అని సూత్రీకరించారు. నమస్తే తెలంగాణ పత్రిక ఒక ఉద్యమ నేపథ్యంలో రావడం వల్ల ఉద్యమాలకుండే స్వేచ్ఛ, ఆకాంక్ష పత్రికకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను.
స్వాతంత్య్రం తర్వాత దాదాపు రెండున్నర దశాబ్దాలు పత్రికా స్వేచ్ఛ బాగానే ఉంది. ఒకటి స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి , రెండవది నెహ్రూ ప్రభుత్వం అవలంబించిన లిబరల్ విలువలు. నెహ్రూ గురించి ‘మదర్ ఇండియా’ అనే పత్రిక చాలా అన్యాయంగా వ్రాసేది. నెహ్రూ ఆ విమర్శను ఆహ్వానించేవాడు. నిజానికి నెహ్రూ స్వ యాన తన గురించి తాను చాలా నిష్కర్షగా ఒక వ్యాసం రాసి ఉన్నాడు. గాంధీ , అంబేద్కర్ ప్రజలను చైతన్యపరుచుటకు పత్రికలే నడిపేవారు. వ్యాసాలు వ్రాసేవారు. ఆ సాంప్రదాయ ప్రభావం దాదాపు రెండు దశాబ్దాలు కొనసాగింది. కానీ 1975 వరకు పాలకులు సంక్షోభంలో పడ్డారు. అది అత్యవసర పరిస్థితిలోకి దారితీసింది. దీంతో పత్రికల మీద దుర్మార్గమైన ఆంక్షలు విధించారు. ఆకాలంలో గోయంకా యాజమాన్యంలో ఉన్న ‘ఇండియన్ ఎక్స్‌వూపెస్’ పత్రిక తన ఎడిటోరియల్ కాలంను ఖాళీగా పెట్టి తన నిరసనను , ప్రతిఘటనను వ్యక్తపరిచింది.
నిజానికి గోయంకా భారతదేశ పత్రికారంగానికి , పత్రికా యాజమాన్యాలకు ఒక గొప్ప వారసత్వాన్ని, ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాడు. నమస్తే తెలంగాణ పత్రిక యాజమాన్యానికి గోయంకా ప్రమాణాలు ఆదర్శం కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ పత్రిక తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్య సంస్కృతిని సుసంపన్నం చేయడానికి ఒక కీలక సాధనంగా భావించాలి. మీరు చేయవలసిందల్లా తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రమాణం తప్పించి, ఇతర ఏ ఆంక్షలను కూడా పెట్టుకోకూడదని కాంక్షిస్తున్నాను.
పత్రికా స్వేచ్ఛకు రాజ్యాంగంలో ప్రత్యేకమైన హామీ లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 క్రింద గుర్తించిన వ్యక్తి స్వేచ్ఛలో భాగంగా మాత్రమే ఈ స్వేచ్ఛ గుర్తించబడింది. కనుక వ్యక్తి స్వేచ్ఛకు భిన్నంగా పత్రికా స్వేచ్ఛ కాపాడడం సాధ్యం కాదు. అయితే.. ప్రాథమిక హక్కులో మనుషులందరినీ చట్టం ముందు సమానమని అంగీకరించినా వాస్తవ జీవితంలో ఇది నిజం కాదు. వాస్తవంలో అసమాన సామాజిక సంబంధాలున్నవి. దీనిని న్యాయాత్మక భ్రమ అని మార్క్స్ విశ్లేషించాడుభమాజనిత న్యాయం సామాజిక వాస్తవంగా మారడానికి సమాజాలు సంఘర్షించవలసి ఉంటుంది.
అది అనివార్యం. నిజానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఈ అసమాన సంబంధాలలోనే వేళ్లు ఉన్నాయి. అంటే.. ప్రాంతీయ అసమానతలకు , అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే ఉద్యమం నుండి పుట్టిన పత్రిక సమానత్వ, న్యాయభావనల ప్రమాణాలమీద నడవడమే సముచితము.
పత్రికలు నిష్పక్షపాతంగా ఉండాలని చాలామంది భావిస్తారు. కానీ నా దృష్టిలో అది సాధ్యం కాదు. అది అభిలషణీయం కూడా కాదు. మంచికి- చెడుకు, మార్పుకు- స్తబ్ధతకు, మానవీయతకు -అమానవీయతకు, విలువలకు- విలువల రాహిత్యానికి మధ్య నిష్పక్షపాతంగా ఉండడం సాధ్యం కాదు. అలాంటి నిష్పక్షపాత వైఖరి నియంతృత్వానికి, ఆధిపత్యరూపాలకు, యధాతథ పరిస్థితిని కాపాడడంలో మునిగిపోతుంది. అంటే.. నిష్పక్షపాతమనేది అసలే ఉండదా? అన్న ప్రశ్నకు సామాజిక అనుభవాన్ని వ్యక్తీకరించడంలో,వాస్తవాలను సేకరించడంలో సాధ్యమైనంత వరకు నిష్పక్షపాతంగానే ఉండాలి.ఉదాహరణకు శ్రీకృష్ణ కమిషన్ సమైక్య ఆంధ్రను బలపరిస్తే అర్ధం చేసుకోవచ్చు. వాళ్లను ఆ విలువల చట్రంలో విశ్లేషించవచ్చు.
విభేదించవచ్చు. వాదించవచ్చు. కానీ.. వాస్తవాలనే వక్రీకరిసే ్తరిపోర్టును తిరస్కరించక వేరే మార్గం లేదు. తెలంగాణలో ఎలక్షిక్టిసిటి ఎక్కువగా ఉపయోగిస్తున్నారేది వాస్తవం. కాబట్టి అది అభివృద్దే అనడం ఎంత అబద్దమో తెలంగాణ వెనుకబాటును అనుభవించిన వాళ్లకు తెలుసు. వర్షాభావం వలన భూగర్భ జలాల విస్తృత వినియోగం వలన, బోరుబావుల వలన విద్యుత్తు వినియోగం ఎక్కువ ఉంది. దీనిని తెలంగాణ ప్రజలు ఏయిర్ కండిషన్ గదుల్లో జీవిస్తున్నారన్నట్లుగా చిత్రీకరించి దాన్ని అభివృద్ధి అని భావించడంలో, ఇది పక్షపాత, నిష్పక్షపాత సమస్యకాదు. ఇది వాస్తవానికి, వక్రీకరణకుండే విభజన రేఖను గౌరవించకపోవడం. అందుకు నమస్తే తెలంగాణ న్యాయం వైపు , ధర్మం వైపు, స్వేచ్ఛవైపు, సార్వజనీన విలువల వైపు, మానవీయ దృక్పథం వైపు స్పష్టమైన పక్షపాత వైఖరి కలిగుండాలి.
అయితే.. విలువల వైపు నిలబడుతున్న పత్రికల మీద ముఖ్యంగా పత్రికా విలేఖరుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్న ఒక సందర్భంలో మనం జీవిస్తున్నాం. ప్రపంచీకరణ శరవేగంగా దూసుకుపోతున్న తరుణంలో సామ్రాజ్యవాద పెట్టుబడి ఏమానవీయ విలువను కూడా బతుక నివ్వదు. మానవీయ విలువల్లో మానవతా దృక్పథానికి అంతర్జాతీయ పెట్టుబడి పరమ శత్రువు. మనిషి స్వార్థం మీద లాభాలు చేసుకొని పెట్టుబడిని పెంచుకోవాలనుకునే దృక్పథం నుంచి మనిషిని చూసి కూడా అది భయపడుతుంది. నియోమి అనే రచయిత తన ‘షాక్ డాక్ట్రిన్’ అనే పుస్తకంలో అమెరికా ఇరాకీ ఖైదీల మీద చేస్తున్న ప్రయోగాలను ప్రస్తావిస్తూ‘ సంక్షేమ రాజ్యం అనే భావనను మానవ జ్ఞాపకం నుంచి తూడ్చి పెట్టడం ఎలా’ అని ఘోరమైన కృషి చేస్తుందన్నారు.
సంక్షేమ భావన ఏరూపంలో ఉన్నా అది కమ్యూనిస్టు బీజ రూపమేనని దాన్ని తొలగిస్తే తప్ప మానవ సమాజాన్ని కమ్యూనిస్టు ప్రత్యామ్నాయం నుండి కాపాడలేమని భావిస్తున్నారట. ఇంత విధ్వంసం జరుగుతున్న కాలంలో ఏ సామాజిక సంబంధాలనైనా, సమిష్టి జీవనం, స్నేహము, ప్రేమ, త్యాగమే గాక ప్రాంతీయ అన్యాయము అనే దాన్ని కూడా సహించరు. తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు అడ్డుపడుతున్న వాళ్లలో హైదరాబాదులోని ఆంధ్ర పెట్టుబడి దారులే కాక పరోక్షంగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల మద్దతు కూడా వాళ్లకుంటుంది.
పెట్టుబడి విపరీత వేగంతో అన్ని అడ్డంకులను తొలగించుకోవడానికి ఒక వైపు రాజ్యం విచ్చలవిడి అధికారాన్ని కట్టబెడుతుంది. దానికి తోడుగా మాఫియా సంస్కృతిని కూడా పెంచి పోషిస్తున్నది. మన రాష్ట్రంలో తెలుగు దేఃశం పాలనలో పెరిగిన విష సంస్కృతిని రాజశేఖర్‌డ్డి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి దోహదపడ్డాడు.ఆ మాఫియా వర్గాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మొదలుకొని అందరూ ఏదో ఒక మేరకు పార్టీల్లో ఉపయోగిస్తున్నారు. అది మనం మానుకోట నుంచి మహబూబ్‌నగర్ దాకా చూశాం. ఈ విపరీత పరిణామం నుండి దేశవ్యాప్తంగా పెరిగిన మాఫియాతో ఇప్పడు పత్రికా స్వేచ్ఛకు పెద్ద ప్రమాదం ఏర్పడింది.వీళ్లే పత్రికా ఆఫీసుల మీద దాడి చేయడం, విలేఖరులను హింసించడం, చంపడం లాంటివి దేశవ్యాప్తంగా.., ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్నారు.
మన దగ్గర గులాం రసూల్ మొదలుకొని మొన్న బాంబేలో చంపబడ్డ జ్యోతిర్మయ్‌డే దాకా కొనసాగుతోంది. ఈ సంస్కృతికి వ్యతిరేకంగా పత్రికలన్నీ పోరాడవలసి ఉంది. దానికి తెలంగాణకు షోయబుల్లా ఖాన్ త్యాగ వారసత్వముంది.
నమస్తే తెలంగాణ పత్రికకు నేను రాసే వ్యాసాలన్నీ ఈ నేపథ్యంలోనే ఉంటాయి. పత్రికా స్వేచ్ఛలో భాగంగా వ్యాసకర్తకుండే స్వేచ్ఛలో భాగంగా.. పీడిత ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజల చైతన్యంలోనుంచి వచ్చే వ్యాసాలను నమస్తే తెలంగాణ హర్షిస్తుందని , తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తారని ఆశిస్తూ...
Labels:
నమస్తే తెలంగాణ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment